< Papholawk 16 >
1 Hahoi, bawkim thung hoi kacaipounge lawk ni, cet awh. Cathut e lungkhueknae manang sari touh hah, talai van rabawk awh tie lawk kalvantami sari touh koe a dei pouh e ka thai.
౧అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, “మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి” అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం నేను విన్నాను.
2 Apasuek e kalvantami ni a cei teh, amae manang hah talai van a rabawk navah, sarang e mitnoutnae ka tawn e hoi sarang e meikaphawk kabawknaw koe ka mathout poung e âhlut patawnae ni a tho sin awh.
౨అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూరమృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి.
3 Apâhni e kalvantami ni amae manang hah talîpui dawk a rabawk toteh tui teh tami kadoutnaw e thi patetlah ao teh, talîpui dawk kaawm e moithang pueng teh a due awh.
౩రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.
4 Apâthum e kalvantami ni amae manang hah palang hoi sokcanaw dawk a rabawk toteh, tui teh thi lah a kangcoung.
౪మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి.
5 Tui ka uk e kalvantami ni, atu hai kaawm niteh yampa hai kaawm e kathounge Bawipa, hete hnonaw na sak dawkvah nang teh na lan doeh.
౫అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు.
6 Bangkongtetpawiteh, ahnimouh teh tami kathoungnaw hoi profetnaw e thi a rabawk awh toe. Bawipa nama nihai hote thinaw hah nei hanelah ahnimanaw na poe toe. Ahnimanaw nihai hettelah a khang awh hanelah a kamcu doeh tie lawk ka thai.
౬అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు.
7 Hahoi thuengnae khoungroekoehoi lawk buet touh ka thai e teh, bokheiyah, Oe Bawipa Cathut, Athakasaipounge, nama e lawkcengnae teh a thuem teh a lan doeh telah tie ka thai.
౭అప్పుడు బలిపీఠం, “అవును, ప్రభూ దేవా, సర్వశక్తి శాలీ, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి” అని జవాబివ్వగా విన్నాను.
8 Apali e kalvantami ni amae manang hah kanî dawk a rabawk toteh, kanî teh taminaw hmaikak thainae kâ a tawn.
౮నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషులను తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది.
9 Ka bet poung e khumbei kecu dawk taminaw a kak awh. Hatdawkvah hete runae dawk kâ ka tawn e Cathut e min hah a dudam awh. Pankângainae hai tawn a hoeh. Cathut hai pholen awh hoeh.
౯మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు.
10 Apanga e kalvantami ni amae manang hah sarang e bawitungkhung dawk a rabawk navah sarang uknaeram dawk kho lah a hmo. Taminaw teh amamae patawnae kecu dawk a lainaw taptap a kei awh.
౧౦అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.
11 Taminaw teh a khang awh e patawnae hoi âhlut kecu dawkvah, kalvan kho e Cathut dudamnae lawk a dei awh teh amamouh ni a sak e dawk pankângai hanelah ngai awh hoeh.
౧౧అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు.
12 Ataruk e kalvantami ni amae manang hah Euphrates palangpui dawk a rabawk toteh, tui rem a hak teh, kanîtholae siangpahrangnaw hane lamthung a kamawng pouh.
౧౨ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.
13 Hathnukkhu khorui e a kâko hoi, sarang e a kâko hoi, profetkaphawk e kâko hoi ekka hoi kâvan e kakhine muithanaw kathum touh a tâco e hah ka hmu.
౧౩అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను.
14 Hote kahraituilinaw e muithanaw ni a sak awh e mitnoutnaw doeh. Hote muitha kathum touh e naw teh talaivan ram tangkuem e siangpahrangnaw ni Athakasaipounge, Cathut e hnin kalenpoung hnin tarankâtuknae koe a kamkhueng thai nahanelah hote ukkungnaw koe a kamthaw awh.
౧౪అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.
15 Thai haw, tamru patetlah ka tho han, taminaw hmalah tongtai lahoi kâhlai e lah na o hoeh nahan mae khohna ka khenyawn niteh kâhruetcuet laihoi ka ring e teh a yawkahawi e lah ao.
౧౫“వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తగా ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు.”
16 Hote muithanaw niteh siangpahrangnaw hah Hebru lawk lahoi Armageddon tie hmuen koe a kamkhueng sak awh.
౧౬హీబ్రూ భాషలో ‘హర్ మెగిద్దోన్’ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
17 Asari e kalvantami ni amae manang hah kalvan vah a rabawk toteh kalvan bawkim thung e bawitungkhung dawk hoi kacaipounge lawk ni hot hateh ka cum toe a ti.
౧౭ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది.
18 Hatnavah sumpapalik, khoparit, keitat teh tâlî puenghoi a no. Talai van tami sak pasuek hoi hot patetlah e athakaawme Tâlî a no e awm boihoeh.
౧౮అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది.
19 Khopui teh pung thum touh lah a kâkapek teh ram louk dawk e khopuinaw moi a rawk awh. Cathut ni a lungkhueknae misurtui a pânei hanelah Babilon khopui hah pahnim hoeh.
౧౯ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు.
20 Tuilum abuemlah a kahma teh monnaw hai hmawt hoeh toe.
౨౦ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది.
21 Kalvan hoi pong 100 touh hlai ka ri e roun kalenpoungnaw hai taminaw e van a bo awh. Hete runae teh ekvoi a ru dawkvah, taminaw ni hote roun kecu dawk Cathut dudamnae lawk a dei awh.
౨౧ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.