< Bawknae 1 >
1 BAWIPA ni Mosi a kaw teh kamkhuengnae lukkareiim dawk hoi a pato.
౧యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు.
2 Nang ni Isarel miphunnaw koe na dei pouh hane lawk teh, nangmouh thung dawk tami buetbuet touh ni BAWIPA koe hno poe hanelah ngai pawiteh, saring, tu, hmae hoi maito a sin han.
౨“నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు. మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గానీ, మేకల, గొర్రెల మందల్లో నుండి గానీ తీసుకు రావాలి.
3 Maito hah hmaisawi thuengnae lah a sak han ngai pawiteh, kacueme a na tongpa na thokhai vaiteh, Cathut lungyouk nahanlah kamkhuengnae lukkareiim takhang koe na poe han.
౩ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒక దాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకు రావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి.
4 Thueng e maito lû dawk amae kut a toung vaiteh, ahnie yontha nahanlah a dâw han.
౪దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది.
5 BAWIPA hmalah hote maito a thei awh hnukkhu, Aron e capanaw ni a thi hah a sin awh vaiteh, kamkhuengnae lukkareiim takhang teng sathei thuengnae khoungroe van petkâtue lah thi a kahei han.
౫తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు.
6 Thuengnae ka sak e tami ni saring e pho a hlip vaiteh, thoukthouk a tâtueng han.
౬తరువాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి.
7 Aron e capa vaihmanaw ni sathei thuengnae khoungroe van, thing a paruen hnukkhu hmai a patawi vaiteh,
౭తరువాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి.
8 Thing van vah a lû, athaw hoi a takpatinaw na ta han.
౮అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి.
9 A khok hoi a ruenthinnaw hah tui hoi hmaloe na pâsu han. Vaihma ni hote sathei abuemlahoi khoungroe van hmai hoi a sawi han. Hetteh, hmai hoi sathei thuengnae doeh. BAWIPA koe hmuitui hanlah hmai hoi thuengnae lah ao.
౯కానీ దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది.
10 Tu, hmae hah hmaisawi thuengnae lah sak han na ngai pawiteh, kacueme a na tongpa na thokhai vaiteh,
౧౦గొర్రెల, మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకు రావాలి.
11 BAWIPA hmalah khoungroe atunglah na thei hnukkhu, Aron e capa, vaihmanaw ni a thi hah khoungroe petkâtue lah a kahei han.
౧౧బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి.
12 Thuengnae ka sak e tami ni thoukthouk a tâtueng han. A lû hoi a moi hah a pâkhueng vaiteh vaihma ni khoungroe van e thing van a ta han.
౧౨అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి.
13 A khok hoi a ruenthinnaw hah tui hoi hmaloe a pâsu han. Vaihma ni abuemlahoi a sin vaiteh khoungroe van hmai a sawi han. Hetteh, BAWIPA koe hmaisawi hmuitui thuengnae lah ao.
౧౩దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠం పై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది.
14 BAWIPA koe tava hoi hmaisawi thuengnae sak hanlah na ngai pawiteh, bakhu thoseh, âbakhu thoseh, na thokhai vaiteh na poe han.
౧౪ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వని గానీ పావురం పిల్లని గానీ తీసుకురావాలి.
15 Vaihma ni khoungroe koe a thokhai hnukkhu, a lahuen a kapen vaiteh khoungroe van hmai a sawi han. A thi teh khoungroe teng a pacâ han.
౧౫యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి.
16 A yoncapo hoi a cuekcaduen dawk e rawcanaw hah na la hnukkhu hraba tanae hmuen, khoungroe hmalah a tâkhawng han.
౧౬తరువాత దాని పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారెయ్యాలి.
17 A rathei khuehoi tava a sei vaiteh vaihma ni khoungroe van e thing van hmai a sawi han. Hetteh, BAWIPA koe hmaisawi hmuitui thuengnae lah ao.
౧౭అతడు దాని రెక్కల సందులో చీల్చాలి గానీ రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి, అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది.”