< Ezekiel 11 >
1 Hottelah Muitha ni na tawm teh, kanîtholah kangvawi e BAWIPA im longkha koe na pha sak. Kâennae takhang dawk tami 25 touh ao. Ahnimanaw thung dawk maya kahrawikungnaw Azzur capa Jaazaniah hoi Benaiah capa Pelatiah ka hmu.
౧ఆ తరువాత ఆత్మ నన్ను పైకి ఎత్తి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గరికి తీసుకు వచ్చాడు. ద్వారం దగ్గర వాకిట్లో ఇరవై ఐదు మంది నాకు కనిపించారు. వాళ్ళలో అజ్జూరు కొడుకు యజన్యా, బెనాయా కొడుకు పెలట్యా, ఇంకా ప్రజల నాయకులూ ఉన్నారు.
2 Kai koe a dei e lawk teh tami capa, hetnaw heh hete khopui dawk payonnae ka thokhai e hoi ka payon e khokhannae katâcawtsakkung hoi ka yon e khokhannae ka tâcawtsakkungnaw doeh.
౨దేవుడు నాకిలా చెప్పాడు. “దురాలోచనలు చేస్తూ పట్టణంలో దుర్మార్గపు ఆలోచనలు చేసేది వీళ్ళే.
3 Im saknae tueng nahoeh rah. Hete khopui heh ka tangdawk e moi hlaam lah ao. Kaimanaw heh a moi lah ka o awh telah katetkungnaw doeh.
౩వాళ్ళిలా అంటున్నారు, ‘ఇల్లు కట్టడానికి ఇది సమయం కాదు. ఈ పట్టణం పాత్ర అయితే మనం దానిలో ఆహారం’
4 Hatdawkvah, Oe tami capa, ahnimouh koe lah profet lawk dei loe telah ati.
౪కాబట్టి వాళ్లకి విరోధంగా ప్రవచనం పలుకు. నరపుత్రుడా, ప్రవచించు.”
5 Hatnavah, BAWIPA e Muitha kaie lathueng a pha teh, kai koevah, BAWIPA ni hettelah a dei telah dei pouh. Hettelah ouk na dei awh, Oe Isarel imthungnaw, na muitha e lakhout hai ka panue.
౫ఆ తరువాత యెహోవా ఆత్మ నా పైకి వచ్చాడు. ఆయన నాకిలా చెప్పాడు. “నువ్వు ఇలా చెప్పు, యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు అలాగే ఆలోచిస్తున్నారు. మీ మనస్సుల్లోకి వచ్చే ఆలోచనలు నాకు తెలుసు.
6 Nangmouh ni hete khopui dawk thei e lahoi na pung sak awh teh, khothung lamnaw hah thei e naw hoi na kawi sak awh toe.
౬ఈ పట్టణంలో మీ చేతుల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెంచుతున్నారు. మీ వల్ల చనిపోయిన వాళ్ళతో పట్టణ వీధులు నిండిపోయాయి.
7 Hatdawkvah, Bawipa Jehovah ni hettelah a dei, na thei e a lungui na hruek e hah a moi doeh. Hete khopui teh moi hlaam ka tangdawk e doeh, hateiteh khopui thung hoi rasa lah na o han.
౭కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు చంపి పట్టణంలో పడవేసిన శవాలే ఆహారం. ఈ పట్టణం వంట పాత్ర. కానీ మిమ్మల్ని మాత్రం పట్టణంలో ఉండకుండాా తీసివేస్తాను.
8 Na takipoung e tahloi hah na lathueng ka pha sak han. Bawipa Jehovah ni ati.
౮మీరు కత్తికి భయపడుతున్నారు. కాబట్టి మీ పైకి కత్తినే పంపుతాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
9 Kai ni nangmouh teh khopui thung hoi na rasa vaiteh, Jentelnaw e kut dawk na poe han, lawk na ceng awh han.
౯“నేను మిమ్మల్ని పట్టణంలో నుండి తీసివేస్తాను. మీకు శిక్ష విధిస్తాను. మిమ్మల్ని విదేశీయుల చేతులకు అప్పగిస్తాను.
10 Nangmouh teh tahloi hoi na due awh vaiteh, Isarel khori koe lawk na ceng awh han, Kai teh BAWIPA doeh tie na panue awh han.
౧౦మీరు కత్తి చేత కూలిపోతారు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
11 Hete khopui teh ka tangdawk e hlaam nahoeh, nangmouh hai a thung e moi na hoeh, Isarel khori dawk lawk na ceng awh han.
౧౧ఈ పట్టణం మీకు వంటపాత్రగా ఉండదు. మీరు దానిలో ఆహారంగా ఉండరు. ఇశ్రాయేలు సరిహద్దుల్లోనే మీకు తీర్పు తీర్చి శిక్షిస్తాను.
12 BAWIPA doeh tie na panue awh han. Bangkongtetpawiteh, ka phunglam na tarawi awh hoeh. Ka lawk ka dei e hai na tarawi awh hoeh. Na tengpam e Jentelnaw phunglam law teh na tarawi awh telah ati.
౧౨అప్పుడు ఎవరి చట్టాలను అనుసరించి మీరు జీవించకుండా, ఎవరి శాసనాలను పాటించకుండా మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల శాసనాలను పాటించారో ఆ యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.”
13 Lawk ka pâpho lahun nah Benaiah capa Pelatiah hah a due. Hottelah hoi pakhup lah ka rawp teh, kacaipounglah ka hram. Aya! Bawipa Jehovah kacawirae Isarelnaw hah na pâmit han na maw telah ka ti.
౧౩నేను ఆ ప్రకారమే ప్రవచిస్తూ ఉండగా బెనాయా కొడుకైన పెలట్యా చచ్చిపోయాడు. దాంతో నేను సాష్టాంగపడి పెద్ద స్వరంతో “అయ్యో! ప్రభూ, యెహోవా, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్ళని సమూలంగా నాశనం చేస్తావా?” అన్నాను.
14 Hahoi, BAWIPA e lawk hah kai koe a pha.
౧౪అప్పుడు యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా అన్నాడు.
15 Tami capa na hmaunawngha, na imthung, na miphun hoi Isarel imthung abuemlahoi Jerusalem karingkungnaw hah BAWIPA koehoi kahlat lah cet awh. Hete ram heh kai koe na poe toe, katetnaw doeh.
౧౫“నీ సోదరులను గూర్చీ నీ గోత్రం వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు ప్రజలందరిని గూర్చీ యెరూషలేము పట్టణవాసులు ‘మీరంతా యెహోవాకు చాలా దూరంగా ఉన్నారు. ఈ దేశాన్ని దేవుడు మాకు స్వాధీనం చేశాడు’ అని చెప్తున్నారు.”
16 Hatdawkvah, Bawipa Jehovah ni hettelah a dei, ka hlatpoung lah Jentel miphun koehoi na puen teh ram tangkuem kahei nakunghai, a phanae ram dawkvah, ahnimouh han kathounge hmuen kathoung lah dongdeng ka o han.
౧౬కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పు. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, దూరంగా ఉన్న జాతుల్లోకి నేను వారిని తొలగించినా, ఇతర దేశాల్లోకి వాళ్ళని నేను చెదరగొట్టినా వాళ్ళు చెదరిపోయిన దేశాల్లో నేను వారికి కొంతకాలం పరిశుద్ద ఆలయంగా ఉంటాను”
17 Hatdawkvah, Bawipa Jehovah ni hettelah a dei. Jentelnaw koe bout na pâkhueng han, na kâkaheinae hmuen koehoi na pâkhueng vaiteh, Isarel ram hah na poe awh han.
౧౭కాబట్టి ఇలా చెప్పు “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. నేను ఇతర జనాల మధ్యలో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు చెదిరిపోయిన దేశాలనుండి మిమ్మల్ని నేను సమీకరిస్తాను. మీకు తిరిగి ఇశ్రాయేలు దేశాన్ని ఇస్తాను
18 Hawvah, a tho awh vaiteh, kamhnawng e hoi panuettho e pueng teh haw e hmuen koehoi koung a raphoe han.
౧౮వారు అక్కడికి తిరిగి వస్తారు. వాళ్ళు ప్రతి అసహ్యమైన దాన్నీ నీచమైన దాన్నీ అక్కడనుండి తీసివేస్తారు.
19 Lungthin buet touh na poe awh vaiteh, nangmouh thung muitha ka hruek han, na takthai thung e talung patetlah kate e lungthin hah ka la vaiteh, tak patetlah kanem e lungthin hah na poe han.
౧౯వాళ్ళు నా దగ్గరకి వచ్చినప్పుడు వాళ్లకి ఏక హృదయాన్ని ఇస్తాను. వాళ్ళలో కొత్త ఆత్మను ఉంచుతాను. వాళ్ళ శరీరంలోనుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను.
20 Ka phunglam a tarawi teh lawkcengnae a coe awh teh, a sak thai awh nahan, hottelah ka tami lah ao awh vaiteh, kai hai a Cathut lah ka o han.
౨౦దానివల్ల వాళ్ళు నా చట్టాలను అనుసరిస్తారు. నా శాసనాలను పాటిస్తారు. అప్పుడు వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు. నేను వాళ్ళ దేవుడిగా ఉంటాను.
21 Hateiteh, panuetthopounge ngainae koe lungthin hoi katarawinaw e yon hah ahnimae a lû dawk ka pha sak han telah Bawipa Jehovah ni ati.
౨౧అయితే అసహ్యమైన వాటిపట్ల, నీచమైన వాటిపట్ల అనురక్తితో నడిచే వాళ్ళ విషయంలో వాళ్ళ ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేలా చేస్తాను.” ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
22 Hatnavah, Cherubim ni a rathei a kadai awh teh, lengkhoknaw ni hai ahnimouh koe ao awh. Isarel Cathut a bawilennae teh ahnimae lathueng ao.
౨౨అప్పుడు కెరూబులు తమ రెక్కలు చాపాయి. చక్రాలు వాటి పక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా ఉంది.
23 BAWIPA a bawilennae teh, khopui lungui hoi a luen teh, khopui kanîtholah ka rasang e mon dawk a kangdue.
౨౩తరువాత యెహోవా మహిమ తేజస్సు పట్టణంలో నుండి పైకి వెళ్ళి తూర్పున ఉన్న పర్వతంపై నిలిచింది.
24 Muitha ni vision lahoi na tawm teh, Cathut e Muitha ni Khaldean ram e sankatoungnaw koevah na phakhai. Kai ni ka hmu e vision hah kai koehoi luen.
౨౪తరువాత దేవుని ఆత్మ నాకనుగ్రహించిన దర్శనంలో ఆత్మ నన్ను పైకి ఎత్తి కల్దీయ దేశంలోని బందీల దగ్గరికి చేర్చాడు. నేను చూసిన దర్శనం నన్ను విడిచి వెళ్ళింది.
25 BAWIPA ni na patue e naw pueng hah sankatoungnaw koe ka dei pouh.
౨౫అప్పుడు యెహోవా నాకు తెలియజేసిన సంగతులన్నిటినీ అక్కడి బందీలకు వివరించాను.