< 2 Kawrin 1 >
1 Kai Pawl, Cathut ngainae lahoi Jisuh Khrih e guncei lah kaawm e, hoi ka nawngha Timote ni Kawrin kho kaawm e Cathut e kawhmoun hoi Akhaia ram pueng dawk kaawm e tami kathoungnaw koe ca na patawn awh.
౧కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు.
2 Maimae Pa Cathut koehoi Bawipa Jisuh Khrih koe e lungmanae hoi roumnae teh nangmouh koe awm lawiseh.
౨మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
3 Maimae Bawipa Jisuh Khrih e Pa Cathut pahrennae hoi ka kawi e maimae na Pa, kabawmkung Bawi lah kaawm e Cathut teh yawhawinae awm lawiseh.
౩మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
4 Maimouh ni reithainae a phunphun khang awh navah, lung na pahawi awh. Bangkongtetpawiteh maimouh ni coe awh e lungpahawinae hoiyah reithainae aphunphun kakhangnaw hah lungpahawi thai nahane doeh.
౪ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
5 Hote Khrih ni a khang e reithainae teh moipap dawkvah, Khrih kecu dawk maimouh ni coe e lungpahawinae hai moipap van.
౫క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.
6 Maimouh ni reithai patang khang awh pawiteh nangmouh lungpahawinae hoi rungngangnae doeh. Kaimouh ni hawinae ka hmu awh e hai nangmouh ni hawinae na hmu awh nahane doeh. Hote hawinae teh kaimouh ni ka hmu e reithainae koe nangmouh ni lungdonae hoi khang thai nahan thaonae lah ao.
౬మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
7 Hatdawkvah nangmouh koe ka ngaihawinae a cak. Bangkongtetpawiteh, nangmouh ni reithai khangnae na phukhai e patetlah ahawinae hai reirei na khangkhai awh, tie ka panue awh.
౭మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.
8 Hmaunawnghanaw, Asia ram vah kaimouh koe runae ka phat e hah, nangmouh panuek laipalah o sak han ka ngai hoeh. Kaimouh ni a rucatnae khang thai hoeh totouh ka kâhmo awh dawk hring hane patenghai ngaihawinae awmhoeh.
౮సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.
9 Kaimouh due han totouh lawk a tâtueng awh toe telah ka panue. Hatei telah bout onae teh kaimouh ni mahoima kâuepnae tho laipalah kadoutnaw kathâw sakkung, Cathut kângue nahane doeh.
౯వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది.
10 Cathut ni hettelah e taki kaawm e duenae koehoi kaimouh na hlout sak. Hmalah hai bout na hlout sak han telah Bawipa dawk ka ngaihawi.
౧౦ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు.
11 Nangmouh ni hai ratoumnae hoi kaimouh hah na kabawp teh, taminaw e ratoumnae dawk kaimouh ni ka hmu awh e poehnonaw khet navah, taminaw ni kaimae yueng lah lunghawinae lawk a dei awh han.
౧౧మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.
12 Kaimouh ni kâoup kawi e teh talaivan lungangnae laipalah Cathut e lungmanae dawk Cathut koehoi ka tho e lungthin thoungnae hoi kahring awh e hah lawkpanuesaknae lung ni na panue sak.
౧౨మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము.
13 Kaimouh ni nangmouh koe ca ka thut awh navah, nangmouh ni na touk thai hane hoi na thai thai nahane hloilah alouke ka thut hoeh.
౧౩మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు.
14 Atuvah nangmouh ni kaimouh be na panuek awh hoeh ei, maimae Bawipa Jisuh e hnin nah kaimouh teh nangmouh hanlah kâoupnae lah na o awh e patetlah, nangmouh hai kaimouh hanelah, kâoupnae lah na o awh e hah na panue awh han telah ka ngaihawi.
౧౪మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం.
15 Hettelah mangkhak katang dawkvah nangmouh teh hawinae bout na coe awh hanlah nangmouh koe ahmaloe ka tho han telah ka kâcai.
౧౫ఈ నమ్మకంతో నేను మొదట మీ దగ్గరికి రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.
16 Nangmouh koe lah ka cei vaiteh Masidonia ram lah ka cei hnukkhu, haw hoi nangmouh koe ka tho vaiteh, Judah ram totouh nangmouh ni na thak a han telah ka pouknae ao.
౧౬మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను.
17 Hottelah ka kâcai e heh a vanlong lah ka pouk e maw. Hoe pawiteh talai ngainae dawkvah ka titeh, Oe teh Oe hoi, nahoeh teh nahoeh telah ka tet boi e na maw.
౧౭నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా?
18 Cathut teh yuemkamcu e patetlah nangmouh koe ka dei awh e lawk teh vai touh dawk, bokheiyah hoi, nahoeh telah nahoehmaw.
౧౮అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం.
19 Kaimouh hoi Silvanas, Timote tinaw ni nangmouh koe ka dei awh e Cathut Capa Jisuh Khrih dawk vai touh hoi, Oe hoi Oe nahoeh telah awm laipalah Bawipa dawk, Oe telah doeh ao.
౧౯నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు.
20 Hote Bawipa dawk Cathut e a lawk kam e naw pueng teh maimouh kecu dawk a bawilennae a kamnue nahanlah, Oe telah ati, Amen telah ati.
౨౦దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.
21 Nangmouh hoi kaimouh teh Khrih thung na o sak teh satui kaawikung teh Cathut doeh.
౨౧క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి
22 Hote Cathut ni maimouh hah tacik na kin teh maimae lungthung vah lawkawm lah Kathoung Muitha na poe toe.
౨౨మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.
23 Cathut teh kai kampangkhai e lah ao. Ama ni ka lungthin teh a panue. Kawrin kho lah cei hoeh nahan kho ka pouk teh nangmouh hane malam ka pouk dawk doeh.
౨౩మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి.
24 Kaimouh ni nangmae na yuemnae dawk kâ ka tawn awh hoeh. Nangmouh ni lunghawi nahanlah nangmouh hoi cungtalah thaw ka tawk awh e doeh. Nangmouh teh yuemnae hoi na kangdue thai awh toe.
౨౪మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.