< Thempu Dan 17 >
1 Pakaiyin, Mose henga hiti hin aseipeh in,
౧యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
2 Aaron le achapte chule Israel chate jouse henga aseipeh ding in, bannei chan dan hochu athupeh in ahi.
౨“నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ, ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట
3 Israel telah a koi hijong leh, Pakai, Pathen chenna ponbuh kot phung tailouva; Pakai adia kilhaina bong, kelngoi chule kelcha that pen pen in danthu apalkeh ahi.
౩ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దుని గానీ, మేకని గానీ, గొర్రె పిల్లని గానీ పట్టుకుని శిబిరం లోపలైనా, బయటైనా చంపి,
4 Ama chun thisan asotah jeh a, Pathen miteh lah a kona kisimtha lou ding ahi.
౪దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకు రాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు, కాబట్టి అలాంటి వాడు ప్రజల్లో లేకుండా పోవాలి.
5 Hiche thupeh in adeisah pen chu, gammang tollah a kithat gancha jouse chu, Pakai angsunga ahin kailut diuva thupeh ahi. Kotbul lama thempupa henga ahinkai lut diu, kiloikhomna thilto dia kithat ding ahi.
౫ఈ ఆదేశం వెనుక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇక పైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకి శాంతిబలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరికి తీసుకురావాలి.
6 Thisan chu thempu pan ki khop khomna ponbuh kot phung maicham kimvel jousea athe thang ding, Pakaiya dia sathao hochu gimnamtuiya agovam ding ahi.
౬యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం పైన రక్తాన్ని చిమ్మాలి. యెహోవాకి కమ్మని సువాసన కలిగేట్టు కొవ్వుని దహించాలి.
7 Israel chaten Pathen ajoulhep nauva kelcha limsemthu, doihou dinga gammang lah a gancha atha kitlou diu ahi. Hiche dan thupeh hi Israelten akhang akhanga ajui diu ahi.
౭ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకు ముందు వేశ్యల్లా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం.
8 Israel mite hihen amaho lah a cheng gamchom mi hijong leh pumgo thilto ahi.
౮నువ్వు వాళ్లకి ఇంకా ఇలా చెప్పు. ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా దహనబలిని గానీ, మరింకేదైనా బలి అర్పణ గానీ చేసి
9 Kikhop khomna ponbuh kotphung tailouva Pathen adia kilhaina sem jouse, Pathen mite holah a kona kisim thalou ding ahi.
౯దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవాకు అర్పించడానికి తీసుకు రాకపోతే ఆ వ్యక్తిని ప్రజల్లో లేకుండా చేయాలి.
10 Israel hihen gamchom mi hijong leh, thisan lhoh lha theng louva sa toh neh tha aum le, hichu Pakai, Pathen toh kidou ahin, amite lah akona simtha lou ding ahi.
౧౦ఇశ్రాయేలు జాతి వాడైనా, మీతో కలసి నివసించే విదేశీయుడైనా ఏరక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునే వాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను.
11 Ganhing jouse hinna hi thisan akon ahi, hiche jeh achu Pakaiyin mi jouse chonset suhmang ahitheina dinga, hichu maicham phunga asun lhah dinga thupeh ahi.
౧౧ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను. ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది. ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే.
12 Hijeh chun Pakaiyin Israel chate le alah uva cheng gamchom miho jaonaa, sa chu thisan jaonaa neh lou dia athupeh ahi.
౧౨కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను.
13 Israel mi hihen, gamchom mi alah uva cheng hi jong leh, gamlah a saham vacha ham, houtoh kitoh a atheng, hiche ho that pen pen chu thisanso ahitan, hichu leiset avuh khu ding ahi.
౧౩అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో, పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికీ దాని రక్తమూ, ప్రాణమూ ఒక్కటే. రక్తం, ప్రాణంతో కలసి ఉంటుంది.
14 Ganhing hinna kiti hi thisan ahin, hibanga chu sa kiti phot Israel chaten thisan jaonaa nehlou dia Pakai thupeh ahi, koi hileh anetha chu amite lah a kona pampeiya um ding ahi.
౧౪కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి ‘మీరు జంతువు రక్తాన్నీ ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది. దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను’ అని ఆదేశించాను.
15 Israel mi hihen gamchom mi hijong leh, gan thikam ahilouleh, sa hang ham in atha nekha aum le avon jouse akisop theng ding, ama jong kisil lha ding, nilhum keiya atheng louva um ding ahi.
౧౫స్థానికుడైనా, మీ మధ్యలో నివసించే విదేశీయుడైనా చనిపోయిన జంతువునో లేదా మృగాలు చీల్చివేసిన జంతువునో ఆహారంగా తీసుకుంటే, అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు.
16 Hichu abol tah louva ahileh, themmo chang ding ahi.
౧౬ఒకవేళ అతడు బట్టలు ఉతుక్కోకుండా, స్నానం చేయకుండా ఉంటే అపరాధిగా ఉండిపోతాడు.”