< Joshua 6 >
1 Tun Jericho mipite chun Israelte chu akichat jeh’un akhopiu kelkot chu akam chahkheh jengun ahi. Mi koimacha avadohsah pouvin lutjong alutsah pouvin ahi.
౧ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.
2 Ahinlah Pakaiyin Joshua kommah, “Hiche khopi leh alengpau chuleh asepaiteu jouse jong nakhutna kapehdoh ahitai.
౨అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “చూడూ, నేను యెరికోను దాని రాజును అందులోని పరాక్రమశాలురను నీ చేతికి అప్పగిస్తున్నాను.
3 Nangleh nasepai chengsetoh nigup sunga hi nisehleh khopihi khatvei naveldiu ahi.
౩మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి.
4 Thingkong masanga hi thempu sagi in kelchalki khatcheh akichoijuva kijotdiu ahi. Ni sagi channileh nanghon hiche khopihi sagivei naveldiu ahi.
౪అలా ఆరు రోజులు చేయాలి. ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని ముందుగా నడవాలి. ఏడవ రోజున మీరు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ యాజకులు బూరలు ఊదాలి.
5 Thempuhon kelchalki ho chu ahinmut mutnuleh mipiten na-o neichasun sunnuva sangtah'a nasapdiu ahi. Hiteng chuleh khopi kulpi chu chimlhading, hiteng chuleh mipiho chu khopi sunga chu nalhailutnuva nadelkhum jengdiu ahi,” ati.
౫మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు.
6 Hitichun Joshua in thempuho chu akoukhommin hiti hin aseipeh tai, “Pakai kitepna thingkong chu puuvinlang, thempu sagi chun kelchalki kichoi cheh’unlang mipi masanga khun kijotnun” ati.
౬నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి “మీరు నిబంధన మందసాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు యాజకులు యెహోవా మందసానికి ముందుగా ఏడు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి” అని వారితో చెప్పాడు.
7 Hijouchun aman mipiho chu thu apen, “Khopi vella chun kijotnun, galmanchah kichoi chengse chu Pakai thingkong masanga cheuhenlang mipichu lamkai juhen,” ati.
౭తరువాత అతడు “మీరు ముందుకు వెళ్ళి పట్టణం చుట్టూ ముట్టడి వేయండి, యోధులు యెహోవా మందసానికి ముందుగా నడవండి” అని ప్రజలతో చెప్పాడు.
8 Joshua’n mipiho komma thu anaseijouchun Thempu sagiho chun pengkul akichoi cheh’un Pakai masanga chun akijotnun pengkul ho chu amutnun ahi. Chuleh Pakai kitepna thingkong chu ajuijun ahi.
౮యెహోషువ ప్రజలకాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు, ఏడు పొట్టేలు కొమ్ము బూరలు యెహోవా సన్నిధిని పట్టుకుని ముందుకు వెళ్తూ, ఆ బూరలు ఊదుతుండగా యెహోవా నిబంధన మందసం కూడా వారి వెంట నడిచింది.
9 Galmanchah kichoi phabep chu pengkul kichoi thempuho masanga akijotnun, loikhatchu thingkong nunglanga akijotnun, thempuho chun pengkul chu amutjom jingun ahi.
౯యోధులు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. సైన్యం వెనక భాగం మందసం వెంట వచ్చింది. యాజకులు వెళ్తూ బూరలు ఊదుతున్నారు.
10 Joshua’n thu ahinpen, “Koimachan kholhang samhih’un, paojong paopoh hih’un, keiman sammun kati tokah’in thu chengkhatcha jong nakammuva kon in gindohsah hih’un,” ati.
౧౦యెహోషువ “మీరు కేకలు వేయండి అని నేను మీతో చెప్పే రోజు వరకూ మీరు కేకలు వేయవద్దు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోటి నుండి ఏ శబ్దమూ రాకూడదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి” అని ప్రజలకి ఆజ్ఞ ఇచ్చాడు.
11 Hitichun Pakai thingkong chu apuuvin hiche nikho chun khatvei khopi chu avellun, chujouvin abonchauvin ngahmun chu ajonnun agageh’un ahi.
౧౧ఆ విధంగా యెహోవా మందసం ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరిగిన తరువాత వారు శిబిరంలోకి వెళ్ళి రాత్రి గడిపారు.
12 Ajingin Joshua chu jingkah matah’in akipatdoh’in ahileh thempuho jongchun Pakai thingkong chu apukitnun ahi.
౧౨యెహోషువ ఉదయాన్నే లేచిన వెంటనే యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తికుని మోశారు.
13 Thempu sagi hochun pengkul chu akichoi cheh’un Pakai thingkong masanga chun akijotnun, pengkul chu amutnun ahi. Avellin, galmanchah kichoi hochu pengkul kichoi thempu ho masangleh Pakai thingkong puho nung’ah akijotnun ahi. Hiche sungse hin thempuho chun pengkul chu amut mutjingun ahi.
౧౩ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలుకొమ్ము బూరలు పట్టుకుని, ఆపకుండా యెహోవా మందసానికి ముందుగా నడుస్తూ బూరలు ఊదుతూ వచ్చారు. యోధులు వారికి ముందు నడిచారు. వెనక ఉన్న సైనికులు యెహోవా మందసాన్ని వెంబడిస్తూ వచ్చారు. యాజకులు వెళ్తూ మానకుండా బూరలు ఊదుతూ వచ్చారు.
14 Anini channa’in jong amahon khopi chu avelkitnun chujouvin ngahmunna ahung kile kitnun ahi. Hitobang hin nigup sungse chun abollun ahi.
౧౪ఆ విధంగా రెండవ రోజు వారు ఒకసారి పట్టణం చుట్టూ తిరిగి వారి శిబిరానికి మరలి వచ్చారు. ఆరు రోజులు వారు ఆ విధంగా చేస్తూ వచ్చారు.
15 Ni sagi channa’in Israelte chu khovahlhah’in akipatdoh’un tumasanga abol bang bangun khopi chu avel kitnun ahi. Ahin tuchung ahin khopi chu sagivei avellun ahi.
౧౫ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు.
16 Sagivei aveljouvun thempuhon pengkul thongjen junnin ahin mutphat uchun Joshua’n mipiho chu thu ahinpen, “Kholhang sammun! Pakaiyin hiche khopi hi nepeh’u ahitai!
౧౬ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”
17 Jericho khopi leh asunga umjouse hi Pakaiyin asuhmang sohkei ding ahitai: Rahab kijohnu leh ainsung mite jouse chu kihing hoiding ahi, ajeh chu amanun gamvelhi’a kibol hochu ana hoidoh sah’in ahi.
౧౭“ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు.
18 Suhmang dinga um thilho chu khatcha suloh hihbeh’un, achutilouleh nangho jong nakisuhmang tha dingu ahi, chuleh Israel ngahmunna hi hamsetna nahin lhutkhumlo diu ahi.
౧౮శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు.
19 Amavang dangka le sana, chule thih le sum-eng’a kisem thilho chu Pakaija atheng ahin hicheho chu Pakai sumkholna a lutding ahi,” tin thupeh ana neitai.
౧౯వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.”
20 Mipiho chun pengkul kimutgin chu ajahphatnun a-ou neichasunnun asammun ahileh Jericho kulpi chu achimlha jengin ahi. Hiche phat chun Israelten khopi sungchu anokhummun alatauve.
౨౦యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.
21 Amahon khopi sunga umho jouse, numei pasal, ateh akhang, bong, kelngoi, kelcha chuleh sangan abonchan asumang sohkeijun ahi.
౨౧వారు పురుషులనూ స్త్రీలనూ చిన్న పెద్దలనందరినీ యెద్దులనూ గొర్రెలనూ గాడిదలనూ ఆ పట్టణంలోని సమస్తాన్నీ కత్తితో చంపి వేశారు.
22 Hichun Joshua’n gamvelhia cheteni komma chun, nakitepna lhon dungjuijin akijohnu innachun lutlhonnin lang amanu le ainsung mite jouse chu gapuidoh lhonnin ati.
౨౨అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు.
23 Gamvelhia cheteni chu achelut lhonnin Rahab chu amatoh umkhom apale anu, asopiho le aisungmite jouse chutoh agapuidoh lhonnin ahi.
౨౩వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు.
24 Hijouchun, Israelten khopi chu asunga umjouse toh ahallhauvin asumanghel tauvin ahi. Ahin sumle sana, chule sum-eng le thih-a kisem thilho vang chu Pakai sumkholna munnah akoijun ahi.
౨౪తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్నవాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు.
25 Hitichun Joshua’n Rahab kijohnu chu insunga aumkhopi ainsung mite jouse toh ahuhdoh’in ahi, ajeh chu aman Jericho velhi dinga asolteni chu anaseldoh’a ana hoidohsah lhon ahi.
౨౫రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది.
26 Hichun, Joshua’n Jericho khopi chu anagaosap’in, “Koi hileh hiche Jericho khopi sapha go chanchu Pakai sapset changhen, tungdohgoa chu acha masapen’in loulo hen, akelkot tungdohgoa chu achapa lhumpen chaanlo hen,” ati.
౨౬అప్పుడు యెహోషువ ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించి వారికిలా ఆజ్ఞాపించాడు “ఎవడు యెరికో పట్టణాన్ని కట్టించడానికి పూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. దాని పునాది వేసిన వాడి పెద్దకొడుకు చనిపోతాడు. దాని తలుపులు నిలబెట్టినపుడు వాడి చిన్నకొడుకు మరణిస్తాడు.”
27 Hitichun Pakaiyin Joshua chu anaumpin hijeh chun gamsung pumpia chun amin ana kithanglheh jeng tan ahi.
౨౭యెహోవా యెహోషువకు తోడై ఉండడం వలన అతని కీర్తి ఆ కనాను దేశమంతటా వ్యాపించింది.