< Rom 3 >
1 Te dongah Judah hlang kah a banhman te balae? yahvinrhetnah kah a phu tah balae?
౧అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి?
2 A longim boeih ah a phu muep om. Pathen kah olrhuh te lamhma la amih Judah rhoek a paek ngawn coeng.
౨ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి.
3 Te dongah hlangvang loh a hnalval uh atah metlamlae? Amih kah hnalvalnah loh Pathen taengkah tangnah te hmil tang mahnim?
౩కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా?
4 Om mahpawh, om cakhaw Pathen tah thuem. Tedae a daek tangtae bangla hlang boeih he laithae ni. Te daengah ni na ol neh na tang vetih na laitloek vaengah na noeng eh.
౪కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.
5 Tedae mamih kah boethae loh Pathen kah duengnah a tueng sak atah balae n'thui eh? Kosi aka hong Pathen tah halang pawt nim? Hlang vanbangla ka thui lah eh.
౫మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను.
6 Tetlamte om mahpawh, om koinih metla Pathen loh Diklai he lai a tloek eh?
౬అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?
7 Tedae kai boethae he Pathen kah oltak loh a thangpomnah te a pungtai sak atah, balae hlangtholh bangla lai ka thui pueng?
౭నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు?
8 Tedae mamih ah hlangvang loh, “Boethae saii sih, te daengah ni a then ha pawk eh?,” a ti uh bangla soehsal uh boel sih. Laitloeknah tah amih ham om pah pai saeh.
౮మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.
9 Te koinih n'rhoei uh a te? Rhoei loeng loeng mahpawh. Judah khaw, Greek khaw, tholh hmuiah boeih om tila n'cawh coeng.
౯అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.
10 A daek tangtae vanbangla aka dueng om pawh, khat khaw om pawh.
౧౦దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.
11 Aka hmuhming te om pawh, Pathen aka tlap om pawh.
౧౧గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
12 Boeih taengphael uh tih rhenten poci uh coeng, boethen aka saii te om pawh. Pakhat khaw om pawh.
౧౨అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.
13 Amih kah olrhong te hlan bangla ah tih a lai neh thailat uh. A hmui dongah rhulthae kah sue om.
౧౩వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది.
14 A ka te thaephoeinah neh olkhaa bae.
౧౪వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
15 A kho loh thii long sak ham thui.
౧౫రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.
16 A longpuei ah pocinah neh ngaidaengnah om.
౧౬వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.
17 Te dongah ngaimongnah longpuei te ming uh pawh.
౧౭వారికి శాంతిమార్గం తెలియదు.
18 Amih mik ah Pathen rhihnah om pawh.
౧౮వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”
19 Tedae olkhueng loh olkhueng hmuikah rhoek a voek te m'ming uh. Te dongah a ka te boeih khuem saeh lamtah Diklai pum tah Pathen kah khotoh khobah la om ve.
౧౯ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు.
20 Olkhueng kah bibi loh amah hmaiah pumsa boeih tang sak mahpawh. Olkhueng lamloh tholh mingnah la om.
౨౦ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.
21 Tedae olkhueng neh tonghma rhoek lamloh a phong Pathen kah duengnah tah olkhueng voel ah phoe coeng.
౨౧ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి.
22 Pathen kah duengnah tah Jesuh Khrih kah tangnah lamloh aka tangnah rhoek boeih taengah hlihloehnah a om moenih.
౨౨అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి.
23 Hlang boeih he tholh uh tih Pathen kah thangpomnah te a phavawt uh.
౨౩భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు.
24 Jesuh Khrih ah tlannah rhangneh a lungvatnah loh a yoeyap la n'tang sak.
౨౪నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు.
25 Anih te Pathen loh a duengnah mingphnanah la a thii dongkah tangnah rhangneh dawthnah la a hmoel.
౨౫క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.
26 Pathen kah uehnah dongah tholhsainah rhuem te hmilhnah la, tahae tue vaengah a duengnah te mingphanah la, Jesuh tangnah dongkah rhoek te aka dueng neh aka tang la aka om sak la om.
౨౬ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
27 Te koinih hoemdamnah tah melam a khoe, ba olkhueng nen lae? mekah khoboe nen lae? Moenih, tangnah kah olkhueng nen dae ni.
౨౭కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.
28 Olkhueng kah khoboe voelah hlang he tangnah loh a tang sak ni m'poek uh.
౨౮కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
29 Te phoeiah Pathen tah Judah rhoek bueng kah a? Namtom rhoek kah van moenih a? Ue namtom rhoek kah van ta.
౨౯దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే.
30 A tangtang atah tangnah neh yahvinrhetnah khaw, tangnah neh pumdul khaw Pathen pakhat long ni a tang sak eh.
౩౦దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.
31 Te dongah tangnah lamloh olkhueng te m'hmil uh pawn a? A hmil pawt dongah olkhueng ni lat m'pai puei uh.
౩౧విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.