< 1 Khokhuen 27 >
1 Israel ca rhoek tah a hlangmi bangla a napa boeilu rhoek khaw, thawng khat neh yakhat mangpa rhoek khaw, boelnah olka cungkuem dongah manghai aka bong a rhoiboei rhoek khaw, kum khat kah hla takuem ah a hla, a hla ah aka kun neh aka vuenva rhoek khaw boelnah pakhat dongah thawng kul thawng li om.
౧ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.
2 Hla lamhmacuek ham boelnah pakhat dongkah Zabdiel capa Jashobeam neh anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౨మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
3 Perez koca lamkah te lahmacuek hla dongah caempuei mangpa boeih kah boeilu la om.
౩పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.
4 A hla bae kah boelnah dongah Akhohi Dodai tih anih boelnah neh rhaengsang Mikloth khaw om. Anih kah boelnah khuiah thawng kul neh thawng li om.
౪రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
5 A hla thum dongkah a pathum nah caempuei mangpa tah khosoih boeilu Jehoiada capa Benaiah tih anih kah boelnah khuiah thawng kul neh thawng li om.
౫మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
6 Benaiah he tah sawmthum khuikah hlangrhalh la a om dongah sawmthum soah om van. Anih kah boelnah khuiah a capa Ammizabad om.
౬ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.
7 A hla li dongkah a pali nah tah Joab mana Asahel. Anih phoeiah tah a capa Zebadiah tih a boelnah khuiah thawng kul thawng li om.
౭నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
8 A hla nga dongkah a panga nah ham te mangpa Izrah Shamhuth tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౮అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
9 A hla rhuk dongkah a parhuk nah ham te Tekoa Ikkesh capa Ira tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౯ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
10 A hla rhih dongkah a parhih nah ham te Ephraim koca lamkah Pelonee Helez tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౧౦ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
11 A hla rhet dongkah a parhet nah ham te Zarkhii kah Khushathi Sibbekhai tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౧౧ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
12 A hla ko dongkah a pako nah ham te Benjamin koca lamkah Anatoth Abiezer tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౧౨తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
13 A hla rha dongkah parha nah ham te Zarkhii lamkah Netophah Maharai tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౧౩పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
14 A hla hlai khat dongkah hlai khat nah ham te Ephraim koca lamkah Pirathon Benaiah tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౧౪పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
15 A hla hlai nit dongkah hlai nit nah ham te Othniel lamkah Netophah Heldai tih anih kah boelnah khuiah he thawng kul neh thawng li om.
౧౫పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
16 Israel koca rhoek so neh Reuben soah he Zikhri capa rhaengsang Eliezer om. Simeon soah tah Maakah capa Shephatiah om.
౧౬ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు, మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,
17 Levi soah Kemuel capa Hashabiah, Aaron soah Zadok.
౧౭కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.
18 Judah soah David manuca rhoek lamkah Elihu, Issakhar soah Michael capa Omri.
౧౮దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,
19 Zebulun soah Obadiah capa Ishmaiah, Naphtali soah Azriel capa Jerimoth.
౧౯ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.
20 Ephraim koca soah Azaziah capa Hosea, Manasseh koca rhakthuem soah Pedaiah capa Joel.
౨౦అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు. మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.
21 Gilead kah Manasseh rhakthuem soah Zekhariah capa Iddo. Benjamin soah Abner capa Jaasiel.
౨౧గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.
22 Dan soah Jeroham capa Azarel. He rhoek he Israel koca kah mangpa rhoek ni.
౨౨దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.
23 BOEIPA loh Israel te vaan kah aisi bangla ping sak ham a thui coeng dongah David loh camoe kum kul neh a hmui tah a hlangmi hlum pawh.
౨౩ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.
24 Zeruiah capa Joab loh soep hamla a tong coeng dae a khah moenih. Te vaengah Israel soah thinhul a tlak thil dongah a hlangmi te David manghai kah khokhuen olka dongah hlangmi la kun pawh.
౨౪ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
25 Manghai thakvoh soah Adiel capa Azmaveth. Thakvoh soah, khohmuen ah, khopuei ah, vangca ah, rhaltoengim ah, Uzziah capa Jonathan.
౨౫రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది. అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.
26 Khohmuen kah thothuengnah dongah lohma kah bitat aka saii soah Kelub capa Ezri.
౨౬పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.
27 Ramathi Shimei misurdum so neh misurdum lamkah misur thakvoh soah Shipmi Zabdi.
౨౭ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.
28 Kolrhawk kah olive neh thaihae soah Gadery Baalhanan. Situi thakvoh soah Joash.
౨౮షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.
29 Sharon ah aka luem saelhung soah Sharon Shitrai, kol kah saelhung soah Adlai capa Shaphat.
౨౯షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.
30 Kalauk soah Ishmael Obil, laak soah Meronoti Jedeiah.
౩౦ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.
31 Boiva soah Hagri Jaziz. He boeih he David manghai taengkah khuehtawn mangpa rhoek ni.
౩౧గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
32 Hlang aka uen David nupu Jonathan he aka yakming neh cadaek la om. Hakhomi capa Jehiel tah manghai koca rhoek neh om.
౩౨దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు. హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.
33 Ahithophel manghai taengah olrhoep la om tih Arkii Hushai tah manghai a hui nah.
౩౩అహీతోపెలు రాజుకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.
34 Ahithophel phoeiah tah Benaiah capa Jehoiada neh Abiathar tih Joab te manghai kah caempuei mangpa la om.
౩౪అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు. రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.