< Rom 14 >
1 Tangnah aka vawtthoek te doe uh lamtah poeknah neh boelhkhoehnah te khueh boeh.
౧విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు.
2 Pakhat long ngawn tah boeih caak ham a tangnah. Tedae tattloel long tah toian a caak.
౨ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు.
3 Aka ca loh aka ca pawt te hnaelcoe boeh. Aka ca pawt long khaw aka ca te kamkaih boeh. Anih te khaw Pathen loh a doe coeng.
౩తినేవాడు తినని వాణ్ణి తక్కువగా చూడకూడదు. తినని వాడు తినేవాడిపై నిందారోపణ చేయకూడదు. ఎందుకంటే దేవుడు అతణ్ణి అంగీకరించాడు.
4 Nang tah metlam na om aih tih hlanglang kah imkhut te na coel? Anih te a boei hut la pai tih yalh ta. Tedae Boeipa loh anih te a thoh thai dongah pai ngawn ni ta.
౪వేరొకరి సేవకుని విషయంలో న్యాయం చెప్పడానికి నువ్వెవరివి? అతడు నిలబడినా, పడిపోయినా అది అతని యజమాని బాధ్యత. కాని అతడు నిలబడతాడు. ప్రభువు అతణ్ణి నిలబెట్టడానికి శక్తి గలవాడు.
5 Te dongah pakhat loh khohnin pakhat lakah khohnin pakhat te a poek. Tedae pakhat loh khohnin boeih he tanglue la a poek. Pakhat rhip loh amah lungbuei ah tangnah saeh.
౫ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి.
6 Khohnin aka yaeh loh Boeipa ham a yaeh tih aka ca loh boeipa ham a caak dongah Pathen te a uem. Aka ca pawt long khaw Boeipa ham a caak pawt dongah Pathen te a uem.
౬ప్రత్యేకమైన రోజులను పాటించేవాడు ప్రభువు కోసమే ఆ పని చేస్తున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కాబట్టి ప్రభువు కోసమే తింటున్నాడు. అలాగే తిననివాడు కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ప్రభువు కోసమే తినడం మానేస్తున్నాడు.
7 Te dongah amah ham aka hing he mamih ah om pawt tih amah ham aka duek khaw om pawh.
౭మనలో ఎవరూ తన కోసమే బతకడు, తన కోసమే చనిపోడు.
8 N'hing uh atah Boeipa ham n'hing uh tih n'duek uh atah Boeipa ham n'duek uh. Te dongah hing akhaw duek akhaw Boeipa kah hut la n'om uh.
౮మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. కాబట్టి మనం జీవించినా, చనిపోయినా ప్రభువుకే చెంది ఉన్నాం.
9 Te ham te Khrih duek tih hing coeng. Te daengah ni aka duek neh aka hing kah boei la bok a om eh.
౯చనిపోయిన వారికీ సజీవులకూ ప్రభువుగా ఉండటానికే గదా క్రీస్తు చనిపోయి మళ్ళీ బతికింది?
10 Te koinih nang tah balae tih na manuca te na kamkaih. Nang tah balae tih na manuca te na hnaelcoe. Mamih boeih tah Pathen kah ngolkhoel ah m'pai uh ni.
౧౦అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.
11 A daek vanbangla Boeipa loh, “Kai tah ka hing. Te dongah Hlang boeih loh kai taengah khuklu cungkueng saeh lamtah olka boeih loh Pathen ming te phong saeh,” a ti.
౧౧“నిశ్చయంగా జీవిస్తున్న నేను చెప్పే దేమిటంటే, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది. ప్రతి నాలుకా దేవుని స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు” అని రాసి ఉంది.
12 Te dongah mamih khat rhip loh amah amah kah lannah te Pathen taengah a paek tangloeng ni.
౧౨కాబట్టి మనలో ప్రతి ఒక్కడూ తన గురించి దేవునికి లెక్క అప్పగించ వలసి ఉంది.
13 Te dongah khat neh khat soah laitloek uh thae boel sih. Tedae manuca taengah caehkoek neh thangkui khueh pawt ham he mah laitloek uh.
౧౩కాబట్టి ఇకమీదట మనం ఒకరికి ఒకరం తీర్పు తీర్చ వద్దు. దానికి ప్రతిగా, మన సోదరునికి అడ్డురాయిలాగా ఆటంకంగా ఉండకూడదని తీర్మానించుకుందాం.
14 Amah ah aka tanghnong he om pawh tila Boeipa Jesuh ah ka ngaitang tih ka ming dae khat khat loh mebang khaw tanghnong a ti atah anih ham tanghnong la om ni.
౧౪సహజంగా ఏదీ అపవిత్రం కాదని నేను ప్రభు యేసులో గ్రహించి గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేనినైనా అపవిత్రం అని నమ్మే వారికి అది అపవిత్రమే అవుతుంది.
15 Caak rhangneh na manuca te a khothet atah lungnah neh na caeh moenih. Anih ham aka duek Khrih te nang kah cakok neh na poci sak ham moenih.
౧౫నీ సోదరుడు నీవు తినేదాని విషయంలో బాధకు గురైతే నీలో ప్రేమ లేదన్నమాటే. ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతణ్ణి నీ ఆహారం చేత పాడు చేయవద్దు.
16 Te dongah nangmih ham aka then tah soehsal boeh.
౧౬మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి.
17 Pathen kah ram tah caak neh ook dongah pawt tih duengnah, rhoepnah, Mueihla Cim ah omngaihnah dongah ni a om.
౧౭దేవుని రాజ్యం తినడం, తాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కలిగించే ఆనందం.
18 Te dongah he nen he Khrih kah sal aka bi tah Pathen ham kolonah neh hlang ham ueppang koi la om.
౧౮ఈ విధంగా క్రీస్తుకు సేవ చేసేవాడు దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.
19 Te dongah rhoepnah koi neh khat neh khat ham hlinsainah koi te hnuktlak uh tangloeng sih.
౧౯కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలిగించే వాటిని ఆసక్తితో అనుసరించుదాం.
20 Caak ham dawk neh Pathen kah bibi te phae boeh. A cungkuem he caih ngawn dae caak rhangneh hlang ham caehkoek la a om te thae.
౨౦ఆహారం కోసం దేవుని పని పాడు చేయవద్దు. అన్ని ఆహార పదార్ధాలూ పవిత్రమైనవే. కానీ ఎవరైనా తాను తిన్న దాని మూలంగా ఇతరులకు తొట్రుపాటు కలిగిస్తే అది కీడు.
21 Maeh caak pawt khaw, misurtui a ok ham pawt rhangneh na manuca loh a tongtah pawt te then.
౨౧మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ సోదరుడు ఆటంకంగా భావిస్తే, దాన్ని మానివేయడం మంచిది.
22 Nang namah loh tangnah na khueh te Pathen hmaiah khueh. Amah loh a soepsoei tangtae te lai aka tloek thil pawt tah a yoethen.
౨౨ఈ విషయాల్లో నీ నమ్మకాలను నీకు, దేవునికి మధ్యనే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనపై తాను నిందారోపణ చేసుకోని వ్యక్తి ధన్యుడు.
23 Tedae a boelhkhoeh tih a caak atah tangnah lamkah pawt dongah boe coeng. Te dongah tangnah lamkah pawt boeih te tah tholhnah ni.
౨౩అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.