< Caeltueih 26 >
1 Paul te Agrippa loh, “Namah kawng na thui thai coeng,” a ti nah. Te dongah Paul loh kut a yueng tih,
౧అగ్రిప్ప పౌలుతో, “నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి నిచ్చాను” అన్నాడు. అప్పుడు పౌలు తాను మాట్లాడబోతున్నట్టు సూచిస్తూ చెయ్యి చాచి ఈ విధంగా జవాబు చెప్పాడు.
2 “Manghai Agrippa, Judah rhoek loh n'tingtoeh kawng boeih dongah tihnin kah namah hmaiah huul uh ham ka cai he yoethen la ka poek.
౨“అగ్రిప్ప రాజా, మీరు యూదుల ఆచారాలనూ వివాదాలనూ బాగా ఎరిగిన వారు.
3 Olpuei la Namah khaw Judah rhoek kah khosing neh oldawtnah boeih aka ming la na om. Ka ol he vawlhvawlh na hnatun ham kam bih.
౩యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి ఈ రోజు మీ ముందు జవాబు చెప్పుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. దయచేసి ఓపికతో నా మనవి వినండి.
4 A tongcuek lamloh ka namtu taengah ka om tih Jerusalem ah ka camoe lamkah ka om ka ih khaw Judah rhoek loh boeih a ming uh.
౪మొదట నా ప్రజల మధ్య తరువాత యెరూషలేములో బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.
5 Bawknah khuiah kaimih kah buhlaelh he a cuep kahlik vanbangla Pharisee pakhat la ka hing te, phong sak ham ngaih uh cakhaw kai he m'ming uh hlaai coeng.
౫వారు మొదటినుండీ నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.
6 Tahae ah he Pathen loh a khueh olkhueh, a pa rhoek taengkah ngaiuepnah dongah ka pai nen ni lai n'tloek thil.
౬అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణను బట్టి నన్నిక్కడ విమర్శకు గురి చేస్తూ నిలబెట్టారు.
7 Kamah pacaphung loh khoyin khothaih thahluenah neh a bawk tih pha hamla a ngaiuep. Manghai aw, te ngaiuepnah kawng dongah ni Judah rhoek loh n'tingtoeh.
౭మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.
8 Pathen loh aka duek a thoh coeng atah ba dongah lae nangmih loh aka tangnahmueh bangla lai na tloek uh.
౮దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?
9 Kai kamah khaw Nazareth Jesuh ming te a kingkalh la muep saii thil ham a kuek tila kana poek thil van.
౯నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను.
10 Jerusalem ah khaw ka saii tih, khosoihham rhoek taengkah saithainah ka dang dongah hlangcim te yet te thongim ah kamah loh ka uup coeng. Amih aka ngawn rhoek kah lungcang khaw ka kuk coeng.
౧౦యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేశాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను.
11 Tunim takuem ah khaw amih te tholhphu ka paek taitu tih, soehsal ham khaw ka tanolh coeng. Te vaengah taoe ka angsai tih kho voel duela amih te ka hnaemtaek.
౧౧చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.
12 Khosoihham rhoek kah saithainah, kotluepnah neh Damasku la ka cet.
౧౨“అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు
13 Manghai aw, longpuei kah khothun lung ah, vaan khomik kah a aa aka poe vangnah loh kamah neh ka taengkah aka cet hmaih rhoek te phuk n'tue te ka hmuh.
౧౩రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.
14 Diklai la boeih ka bung uh vaengah ol pakhat ka yaak tih Hebrew ol la kai taengah, “Saul, Saul, ba ham lae kai nan hnaemtaek, suehling thuih ham te na mangkhak aih mai,” a ti.
౧౪మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.
15 Te vaengah kamah loh u nang nim ca Boeipa,” ka ti nah. Te dongah Boeipa loh, 'Kai tah nang loh na hnaemtaek Jesuh ni.
౧౫అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని.
16 Tedae thoo lamtah namah kho dongah pai laeh. Kai taengla na moe tih nang taengla ka moe van vaengkah tueihyoeih neh laipai la nang coelh ham ni nang taengah ka phoe.
౧౬నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,
17 Pilnam neh namtom kut lamkah nang aka hlawt, kamah long ni amih mik dai sak ham,
౧౭నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను.
18 yinnah lamkah vangnah la, Satan kah saithainah lamloh Pathen taengla bal puei ham, amih te tholh khodawkngainah, kai dongah tangnah neh a ciim tangtae rhoek taengah hmulung dang sak ham amih taengla nang kan tueih,’ a ti.
౧౮వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.
19 Te dongah manghai Agrippa aw, vaan mangthui te aka lokhak la ka om moenih.
౧౯“కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి
20 Tedae lamhma la Damasku ah, te phoeiah Jerusalem, Judea paeng pum neh namtom rhoek taengah khaw tholh yut tih Pathen taengla mael sak ham, yutnah neh a tingtawk la khoboe hlawt ham ni ka puen pah.
౨౦మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.
21 Te dongah ni bawkim khuiah aka om kai he Judah rhoek loh n'tuuk tih ngawn ham m'moeh uh.
౨౧ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు.
22 Tedae Pathen taengkah bomnah ka dang dongah ni tihnin due tanoe kangham taengah ka pai tih ka laipai. Hmailong ah om hamla cai tih tonghma rhoek neh Moses loh a thui te a pueh la ka thui moenih.
౨౨అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకూ నిలిచి ఉన్నాను. క్రీస్తు హింసలు పొంది మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటివాడు కావడంచేత, యూదులకూ యూదేతరులకూ వెలుగు ప్రసరిస్తుందని ప్రవక్తలు, మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమీ కలపకుండా, అల్పులకూ ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను.”
23 Khrih loh patang cakhaw, pilnam neh namtom taengah vangnah te doek ham a cai dongah aka duek khuiah thohkoepnah loh a lamhma sak,” a ti nah.
౨౩
24 Te nen te a huul uh dongah Phesto loh ol ue neh, “Paul, na ang coeng, na cabu cungkuem loh lutlatnah la m'vil coeng,” a ti nah.
౨౪అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు.
25 Tedae Paul loh, “Hlangcong Phesto aw ka ang moenih, oltak neh cuepmueihnah ol ni ka thui.
౨౫అందుకు పౌలు ఇలా అన్నాడు, “మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.
26 He kawng he manghai loh a ming coeng dongah amah taengah khaw sayalh la ka thui. Anih ham pakhat khaw ka phah tih ka rhoih pawt moenih. Congket kah aka om khaw a saii mai he.
౨౬రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు.
27 Manghai Agrippa, tonghma rhoek ke na tangnah a? Na tangnah te ka ming,” a ti nah.
౨౭అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు.” అన్నాడు.
28 Te vaengah Paul te Agrippa loh, “Khrihca la saii ham kai khaw rhaih nan yoek coeng he,” a ti nah.
౨౮అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు.
29 Tedae Paul loh, “Nang bueng pawt tih tihnin kah kai ol aka hnatun rhoek boeih he khaw hloong kah a voel ah he kamah ka om bangla metlam a om poek eh tite Pathen taengah a toi a sen la ka thangthui,” a ti nah.
౨౯అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు.
30 Te vaengah manghai khaw, khoboei khaw, Bernike khaw, amih taengkah aka ngol rhoek khaw boeih thoo uh.
౩౦అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి
31 A khoe uh phoeiah tah pakhat pakhat taengah thui uh thae tih, “Hekah hlang loh a saii he pakhat pataeng dueknah nen khaw, hloong nen khaw a tiing moenih,” a ti uh.
౩౧“ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు” అని తమలో తాము మాట్లాడుకున్నారు.
32 Te dongah Agrippa loh Phesto taengah, “Hekah hlang loh Kaisar te pha voel pawt cakhaw hlah hamla coeng thai,” a ti nah.
౩౨అప్పుడు అగ్రిప్ప, “ఈ మనిషి సీజరు ముందు చెప్పుకొంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే” అని ఫేస్తుతో చెప్పాడు.