< 2 Khokhuen 14 >

1 Abijah he a napa rhoek taengla a khoem uh vaengah tah anih te David khopuei ah a up uh. Te phoeiah a capa Asa anih yueng la manghai. Anih tue vaengkah kum rha khui ah khohmuen khaw mong.
అబీయా చనిపోయి తన పూర్వీకులతో కూడా కన్నుమూశాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని స్థానంలో అతని కొడుకు ఆసా రాజయ్యాడు. ఇతని రోజుల్లో దేశం 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
2 Asa loh a Pathen BOEIPA mikhmuh ah hnothen neh a thuem ni a. saii.
ఆసా తన దేవుడు యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థంగా నడిచాడు.
3 Kholong hmueihtuk neh hmuensang te a khoe tih kaam te a phaek. Asherah khaw a top.
అన్యదేవుళ్ళ బలిపీఠాలను పడగొట్టి, ఉన్నత స్థలాలను పాడుచేసి, ప్రతిమలను పగులగొట్టి, దేవతాస్తంభాలను కొట్టి వేయించాడు.
4 A napa rhoek kah Pathen BOEIPA toem ham neh a olkhueng neh a olpaek vai ham khaw Judah rhoek te a uen.
వారి పూర్వీకుల దేవుడు అయిన యెహోవాను ఆశ్రయించాలనీ ధర్మశాస్త్రాన్నీ, ఆజ్ఞలనూ పాటించాలని యూదావారికి ఆజ్ఞాపించాడు.
5 Judah khopuei tom lamkah hmuensang neh bunglawn te a khoe tih a mikhmuh ah a ram khaw mong.
ఉన్నత స్థలాలనూ సూర్య దేవతా స్తంభాలనూ యూదా వారి పట్టాణాలన్నిటిలో నుండి తీసివేశాడు. అతని పాలనలో రాజ్యం ప్రశాంతంగా ఉంది.
6 Khohmuen te a mong dongah Judah kah kasam khopuei rhoek te a sak. Anih te BOEIPA loh a duem sak dongah te vaeng tue ah a taengah caemtloeknah om pawh.
ఆ సంవత్సరాల్లో అతనికి యుద్ధాలు లేకపోవడం చేత దేశం నెమ్మదిగా ఉంది. యెహోవా అతనికి విశ్రాంతి దయచేయడం వలన అతడు యూదాదేశంలో ప్రాకారాలు గల పట్టణాలను కట్టించాడు.
7 Te phoeiah Judah rhoek taengah, “Khopuei rhoek he sa uh sih lamtah vongtung neh rhaltoengim khaw, thohkhaih neh thohkalh khaw buen uh sih. Mamih kah Pathen BOEIPA te n'toem uh dongah khohmuen he mamih mikhmuh ah mong pueng. N'toem uh bangla a kaepvai taengah mamih he m'duem sak,” a ti nah. Te dongah a sak uh tangloeng tih thaihtak uh.
అతడు యూదా వారికి ఈ విధంగా ప్రకటన చేశాడు “మనం మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. అందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలిగించాడు. దేశంలో మనం నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనం ఈ పట్టణాలను కట్టించి, వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుదాం.” కాబట్టి వారు పట్టణాలను నిర్మించి వృద్ధి పొందారు.
8 Judah lamkah photlinglen neh cai aka muk tatthai thawng ya thum te Asa taengah om bal. Benjamin lamloh photling aka bai tih lii aka phu, tatthai hlangrhalh boeih he thawng yahnih thawng sawmrhet lo.
ఆ కాలంలో యూదా వారిలో డాళ్ళు, ఈటెలు పట్టుకొనే వారు 3,00,000 మంది ఉన్నారు. యూదావారితోనూ, కవచాలు ధరించి బాణాలు వేసే 2, 80,000 మంది బెన్యామీనీయులతోనూ కూడిన సైన్యం ఆసాకు ఉంది. వీరంతా పరాక్రమవంతులు.
9 Te phoeiah amih te Kushi Zerah loh tatthai thawng thawngkhat, leng ya thum neh a paan tih Mareshah la pawk.
ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకూ వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు.
10 Te dongah Asa te a hmai ah cet tih Mareshah kah kolrhawk ah caemtloek rhong a pai.
౧౦వారు మారేషా దగ్గర జెపాతా అనే లోయలో ఎదురుగా నిలిచి యుద్ధం చేశారు.
11 Te vaengah Asa loh amah kah Pathen BOEIPA te a khue tih, “Aw BOEIPA, thadueng aka tal te boeiping laklo ah bom ham khaw namah bang a om moenih. Kaimih kah Pathen BOEIPA aw kaimih m'bom lah. Namah dongah ka hangdang uh tih namah ming nen ni he hlangping taengla ka pawk uh. Namah te kaimih kah Pathen BOEIPA ni, namah taengah tah hlanghing loh ueh mahpawh,” a ti nah.
౧౧ఆసా తన దేవుడు యెహోవాకు మొర్రపెట్టి “యెహోవా, మహా సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేనివారికి సహాయం చేయడానికి నీకన్నా ఇంకెవరూ లేరు. మా దేవా, యెహోవా, మాకు సహాయం చెయ్యి. నిన్నే నమ్ముకున్నాము. నీ నామాన్ని బట్టే ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరాము. యెహోవా! నువ్వే మా దేవుడివి. మానవమాత్రులను నీ మీద జయం పొందనీయకు” అని ప్రార్థించాడు.
12 Te dongah BOEIPA loh Kushi te Asa mikhmuh neh Judah mikhmuh ah a yawk sak tih Kushi rhoek te rhaelrham uh.
౧౨అప్పుడు యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటా, యూదా వారి ఎదుటా నిలబడనియ్యకుండా వారిని దెబ్బ తీసిన కారణంగా వారు పారిపోయారు.
13 Amih te Asa neh a taengkah pilnam loh Gerar hil duela a hloem tih Kushi lamloh a cungku sak. Amih te hinglu hlawtnah a om pawt hil BOEIPA mikhmuh neh a caem mikhmuh ah a khah coeng tih kutbuem khaw a yet la muep a phueih uh.
౧౩ఆసా, అతనితో ఉన్నవారూ గెరారు వరకూ వారిని తరిమారు. కూషీయులు తిరిగి లేవలేక యెహోవా భయం చేతా ఆయన సైన్యం భయం చేతా పారిపోయారు. యూదా వారు విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకున్నారు.
14 Te vaengah amih soah BOEIPA taengkah birhihnah a om dongah Gerar kaepvai khopuei boeih te a ngawn uh. A khuiah kutbuem muep a om dongah khopuei tom te a poelyoe uh.
౧౪గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లోని వారందరి మీదికీ యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా సైన్యం వాటన్నిటినీ కొల్లగొట్టి, వాటిలో ఉన్న విస్తారమైన సొమ్మంతటినీ దోచుకున్నారు.
15 Boiva kah dap khaw a ngawn uh dongah boiva neh kalauk te a cungkuem la a sol uh tih Jerusalem la mael uh.
౧౫అక్కడి పశువుల శాలలను పడగొట్టి, విస్తారమైన గొర్రెలనూ ఒంటెలనూ సమకూర్చుకుని యెరూషలేముకు తిరిగి వచ్చారు.

< 2 Khokhuen 14 >