< 1 Thessalonika 1 >

1 Paul, Silvanas neh Timothyloha pa Pathen neh Boeipa Jesuh Khrih ah Tesalonika kah hlangboel te kan yaak sak. Nangmih taengah lungvatnah neh ngaimongnah om saeh.
తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక!
2 Nangmih boeih kongah Pathen te ka uem uh taitu. Kaimih kah thangthuinah dongah poekkoepnah ka saii uh.
మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం.
3 Nangmih kah tangnah bibi neh lungnah thakthaenah, a pa Pathen hmaiah Jesuh Khrih mamih Boeipa kah ngaiuepnah dongah uehnah te phat ka poek uh.
విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం.
4 Pathen kah a lungnah manucarhoek nangmih kah tueknah te ming uh.
దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
5 Kaimih kah olthangthen tah nangmih taengah olka bueng nen pawt tih thaomnah nen khaw Mueihla Cim nen khaw, ngaikhueknah soep nen khaw ha pawk. Na ming uh vanbangla nangmih khuiah ka om te khaw nangmih ham ni.
ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.
6 Nangmih khaw Boeipa neh kaimih mueiloh la na om uh dongah phacip phabaemte yet khuiah olthang te omngaihnah Mueihla Cim nehna doe uh.
మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు.
7 Te dongah Makedonia neh Akhaia kah aka tangnahrhoek boeih ham mueimae la na om uh.
కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు.
8 Boeipa kah olka tah nangmih lamloh ha humtih Makedonia neh Akhaia ah bueng pawt tih Pathen na tangnah te hmuen takuem la cet coeng. Te dongah kaimih kah thui ham pakhat khaw a ngoe moenih.
మీ దగ్గర నుండే ప్రభువు వాక్కు మాసిదోనియలో అకయలో వినిపించింది. అంతమాత్రమే కాకుండా ప్రతి స్థలంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
9 Amih loh Kaimih kawng ah nangmih taengah kunnah metla a om khaw, mueirhol lamloh aka hing oltak Pathen kah salbi ham Pathen taengah metlana mael uh khaw,
అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో,
10 vaan lamkah a capa rhingoel te khaw, anihte duek khui lamloh a thoh te khaw, aka thoeng ham kosi lamloh mamih aka hlawt Jesuh kawng te khaw ha puen uh coeng.
౧౦పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కోసం ఎలా వేచి ఉన్నారో చెబుతున్నారు. ఈ యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నాడు.

< 1 Thessalonika 1 >