< Рут 4 >
1 И Вооз възлезе на портата и седна там; и, ето, минаваше близкият сродник, за когото беше говорил Вооз. И рече: Господине, свърни, седни тук. И той свърна и седна.
౧బోయజు బేత్లెహేము పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు “ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు.
2 Тогава Вооз събра десет мъже от градските старейшини и рече: Седнете тук. И те седнаха.
౨బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.
3 После рече на сродника: Ноемин, която се върна от Моавската земя, продава нивата, дяла, който принадлежеше на брата ни Елимелеха;
౩తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను.
4 а аз рекох да ти известя и да ти кажа: Купи го пред седящите тука, пред старейшините на людете ми. Ако щеш да го откупиш като сродник, откупи го; но, ако не щеш да го откупиш, кажи ми, за да зная; защото освен тебе, няма друг да го откупи, като сродник; и аз съм подир тебе. И той рече: Аз ще го откупя.
౪ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే” అని అతనితో చెప్పాడు. అందుకతడు “నేను విడిపిస్తాను” అన్నాడు.
5 И рече Вооз: В деня, когато купиш нивата от ръката на Ноемин, трябва да я купиш и от моавката Рут, жена на умрелия, за да възстановиш името на умрелия над наследството му.
౫అప్పుడు బోయజు “నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం” అన్నాడు.
6 Тогава сродникът рече: Не мога да изпълня длъжността на сродник, да не би да напакостя на своето си наследство; ти приеми върху себе си моето право да откупя, защото не мога да откупя нивата.
౬దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.
7 А в старо време, за да се утвърди всяко дело по откупване и размяна в Израиля, ето що беше обичаят: човекът изуваше обувката си, та я даваше на ближния си: и така се свидетелствуваше в Израиля.
౭ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులో ఒక కట్టుబాటు ఉంది. బంధు ధర్మానికీ, క్రయ విక్రయాలకూ ఏదైనా విషయాన్ని ఖరారు చేయడానికీ ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వాడికివ్వడమే. ఈ పనిని ఇశ్రాయేలీయుల్లో ప్రమాణంగా ఎంచారు.
8 За това, сродникът като каза на Вооза: Купи го ти за себе си, изу си обувката.
౮ఆ బంధువు “నువ్వే దాన్ని సంపాదించుకో” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.
9 Тогава Вооз каза на старейшините и на всичките люде: Днес сте свидетели, че купувам от ръката на Ноемин всичко, що беше Елимелехово и всичко що беше Хелеоново и Маалоново.
౯అప్పుడు బోయజు “ఎలీమెలెకుకు కలిగిన సమస్తం-కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు ఈ రోజు సాక్షులుగా ఉన్నారు.
10 А още и моавката Рут Маалоновата жена, придобих за жена, за да възстановя името на умрелия над наследството му, за да се не изличи името на умрелия измежду братята му и из града на обитаването му; вие сте свидетели днес.
౧౦అలాగే చనిపోయినవాడి పేరట అతని వారసత్వాన్ని స్థిరపరచడానికీ, చనిపోయినవాడి పేరును అతని సోదరుల్లోనుండీ, అతని నివాస స్థలం నుండీ సమసి పోకుండా ఉండటానికి నేను మహ్లోను భార్య రూతు అనే మోయాబీ స్త్రీని సంపాదించుకుని పెళ్ళి చేసుకుంటున్నాను. దీనికీ మీరు ఈ రోజున సాక్షులుగా ఉన్నారు” అని పెద్దలతో, ప్రజలందరితో చెప్పాడు.
11 И всичките люде, които бяха в портата, и старейшините рекоха: Свидетели сме. Господ да направи жената, която влиза в дома ти, като Рахил и като Лия, двете, които са съградили Израилевия дом; и да станеш силен в Ефрата, и да бъдеш знаменит във Витлеем;
౧౧అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ “మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక!
12 и от потомството, което Господ ще ти даде от тая млада жена, нека бъде домът ти като дома на Фареса, когото Тамар роди на Юда.
౧౨ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబంలా ఉండుగాక!” అన్నారు.
13 И така, Вооз взе Рут, и тя му стана жена; и като влезе при нея, Господ й даде зачатие, и тя роди син.
౧౩బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది.
14 И жените казаха на Ноемин: Благословен Господ, Който днес не те остави без сродник; нека бъде прочуто Името Му в Израиля.
౧౪అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక.
15 Тоя син ще ти бъде обнова на живота и прехрана в старините ти; защото го роди снаха ти, която те обича, която е за тебе по-желателна от седем сина.
౧౫నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు” అని నయోమితో చెప్పారు.
16 И Ноемин взе детето и тури го в пазухата си, и стана му кърмилница.
౧౬అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది.
17 И съседките ме дадоха име казвайки: Син се роди на Ноемин. И рекоха го Овид; той е баща на Есея, Давидовия баща.
౧౭ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.
18 И ето Фаресовото родословие: Фарес роди Есрона,
౧౮పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను.
19 Есрон роди Арама, Арам роди Аминадава,
౧౯హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు.
20 Аминадав роди Наасона, Наасон роди Салмона,
౨౦అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.
21 Салмон роди Вооза, Вооз роди Овида,
౨౧శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు.
22 Овид роди Есея, а Есей роди Давида.
౨౨ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.