< Псалми 92 >
1 Псалом. Песен за съботния ден. Добро е да славословим Господа И да пеем хваление на Твоето име, Всевишни,
౧విశ్రాంతి దినం కోసం పాట, ఒక కీర్తన. యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడం, మహోన్నతుడా, నీ నామానికి స్తుతి పాడడం మంచిది.
2 Да възвестяваме на ранина милосърдието Ти, И верността Ти всяка нощ,
౨ఉదయాన నీ కృపను ప్రతి రాత్రీ నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.
3 С десетострунен инструмент и с псалтир, С тържествена мелодия на арфа;
౩పది తీగల వాయిద్యంతో, సితారా మాధుర్యంతో స్తుతించడం మంచిది.
4 Защото си ме развеселил, Господи, с деянията Си; С тържествена мелодия на арфа;
౪ఎందుకంటే యెహోవా, నీ పనులతో నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతిపనులబట్టి నేను ఆనందంగా పాడతాను.
5 Колко са велики Твоите дала, Господи! Твърде дълбоки са мислите Ти.
౫యెహోవా, నీ పనులు ఘనమైనవి! నీ ఆలోచనలు ఎంతో లోతైనవి.
6 Скотски човек не знае това, Нито го разбира безумен,
౬పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.
7 Че нечестивите изникват като тревата, И всички, които вършат беззаконие, цъфтят, Само за да се изтребят вечно.
౭దుర్మార్గులు పచ్చని గడ్డి మొక్కల్లాగా మొలిచినా చెడ్డపనులు చేసే వాళ్ళంతా వర్ధిల్లినా నిత్యనాశనానికే గదా!
8 Но Ти, Господи, до века си на високо,
౮అయితే యెహోవా, నువ్వే శాశ్వతంగా పరిపాలిస్తావు.
9 Защото, ето, враговете Ти ще погинат; Ще се разпръснат всички, които вършат беззаконие.
౯యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.
10 Но моя рог Ти ще въздигнеш като рог на дивия вол; Аз ще бъда помазан с прясно миро;
౧౦అడవి దున్న కొమ్ముల్లాగా నువ్వు నా కొమ్ము పైకెత్తావు. కొత్త నూనెతో నన్ను అభిషేకించావు.
11 И окото ми ще види повалянето на ония, които ме причакват; Ушите ми ще чуят за възмездието на злодейците, които се дигат против мене.
౧౧నా శత్రువుల అధోగతిని నా కన్నులు చూశాయి. దుష్టులైన నా విరోధుల పతనం నా చెవులు విన్నాయి.
12 Праведният ще цъфти като палма, Ще расте като кедър в Ливан;
౧౨నీతిమంతులు ఖర్జూర చెట్టులాగా అభివృద్ధి చెందుతారు. లెబానోనులోని దేవదారు చెట్టులాగా వాళ్ళు ఎదుగుతారు.
13 Насадени в дома Господен Ще цъфтят в дворовете на нашия Бог.
౧౩వాళ్ళు యెహోవా ఇంటిలో నాటుకుని ఉంటారు. వాళ్ళు మన దేవుని ఆవరణాల్లో వర్ధిల్లుతారు.
14 Ще бъдат плодоносни и в дълбока старост, Ще бъдат сочни и зелени;
౧౪యెహోవా యథార్థవంతుడని తెలియచేయడం కోసం వాళ్ళు ముసలితనంలో కూడా ఫలిస్తారు. తాజాగా పచ్చగా ఉంటారు.
15 За да възвестят, че е праведен Господ, Моята канара, у Когото няма неправда.
౧౫ఆయనే నా ఆధార శిల, ఆయనలో ఎలాంటి అన్యాయమూ లేదు.