< Псалми 55 >
1 За първия певец, на струнни инструменти. Давидово поучение. Послушай, Боже, молитвата ми. И не се крий от молбата ми.
౧ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాయిద్యాలపై పాడేది. దావీదు రాసిన దైవధ్యానం దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు.
2 Внимавай в мене и отговори ми. Безпокоя се в тъженето си, и стена;
౨నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు.
3 Поради гласа на неприятеля, Поради присъствието на нечестивия; Защото приписват на мене беззаконие, И с гняв ми враждуват,
౩ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు.
4 Сърцето ми тъжи дълбоко в мене, И смъртен ужас ме нападна;
౪నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది.
5 Страх и трепет дойдоха върху мене, И ужас ме потопи.
౫దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది.
6 И рекох: Дано да имах крила като гълъба! Щях да отлетя и да си почина.
౬ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను.
7 Ето, щях да бягам надалеч, Щях да живея в пустинята; (Села)
౭త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను.
8 Щях да ускоря бягането си От вихъра и от бурята.
౮పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను.
9 Опропасти ги, Господи, и раздели съвета им; Защото видях насилие и разпра в града.
౯పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.
10 Денем и нощем го обикалят по стените му, И беззаконие и зло има всред него;
౧౦రాత్రింబగళ్లు వారు పట్టణ సరిహద్దుల్లో తిరుగుతున్నారు. అక్కడ అంతా పాపం, చెడుతనం జరుగుతూ ఉంది.
11 Нечестие има всред него; Угнетение и измама не се отдалечават от улиците му.
౧౧అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి.
12 Понеже не беше неприятел, който ме укори, - Това бих претърпял, - Нито беше оня, що ме мразеше, който се подигна против мене, - Тогава бих се скрил от него;
౧౨నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.
13 Но ти, човек равен на мене, Другар мой, и мой близък приятел.
౧౩ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.
14 Заедно се разговаряхме сладко, С множеството ходехме в Божия дом.
౧౪మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.
15 Нека дойде ненадейно смърт на тях. Нека слязат живи в преизподнята; Защото в жилищата им, и в сърцата им има злодейство. (Sheol )
౧౫చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది. (Sheol )
16 Но аз към Бога ще извикам; И Господ ще ме избави.
౧౬అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.
17 Вечер и заран и на пладне ще се оплаквам и ще стена; И Той ще чуе гласа ми.
౧౭సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.
18 Ще избави душата ми и ще я успокои от боя, който е против мене; защото мнозина са с мене.
౧౮నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
19 Бог, Който се е възцарил преди вековете, Ще чуе и ще ги съкруши, (Села) Ще съкруши човеците, които неизменно Не се боят от Бога.
౧౯పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.
20 Всеки един от тях простира ръце против ония, които са в мир с него; Нарушава съюза си.
౨౦నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.
21 Устата му са по-мазни от масло, Но в сърцето му има война; Думите му са по-меки от дървено масло, Но пак са голи саби.
౨౧అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.
22 Възложи на Господа това, което ти е изложил и Той ще те подпре; Никога не ще допусне да се поклати праведният.
౨౨నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.
23 Но ти, Боже ще ги сведеш в гибелния ров; Мъже кръвопийци и измамници няма да стигнат и до половината на дните си; Но аз ще уповавам на Тебе.
౨౩దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.