< Матей 3 >
1 В ония дни дойде Йоан Кръстител и проповядваше в Юдейската пустиня, като казваше:
౧ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి యూదయ అరణ్యంలో
2 Покайте се понеже наближи небесното царство.
౨“పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాప పడండి” అని బోధిస్తూ ఉన్నాడు.
3 Защото този беше, за когото се е говорило чрез пророк Исаия, който казва: “Глас на един, който вика в пустинята: Пригответе пътя на Господа, прави направете пътеките за Него”.
౩పూర్వం యెషయా ప్రవక్త, అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే.
4 А тоя Йоан носеше облекло от камилска козина и кожен пояс около кръста си; а храната му беше акриди и див мед.
౪ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
5 Тогава излизаха при него Ерусалим, цяла Юдея и цялата Йорданска околност,
౫యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి,
6 и се кръщаваха от него в реката Йордан, като изповядваха греховете си.
౬తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.
7 А като видя, че мнозина от фарисеите и садукеите идеха да се кръстят от него, рече им: Рожби ехидни! Кой ви предупреди да бягате от идещия гняв?
౭చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 Затова, принасяйте плодове достойни за покаяние;
౮పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.
9 и не мислете да думате в себе си: Авраам е нашият баща; защото ви казвам, че Бог може и от тия камъни да въздигне чада на Авраама.
౯‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
10 А и брадвата лежи вече при корена на дърветата; и тъй всяко дърво, което не дава добър плод, отсича се и в огъня се хвърля.
౧౦ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
11 Аз ви кръщавам с вода за покаяние; а Оня, Който иде след мене, е по-силен от мене, Комуто не съм достоен да понеса обущата; Той ще ви кръсти със Святия Дух и с огън.
౧౧పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లతో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
12 Лопатата е в ръката Му, и Той здраво ще очисти гумното Си, и ще събере житото Си в житницата, а плявата ще изгори в неугасим огън.
౧౨తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.
13 Тогава идва Исус от Галилея на Йордан при Йоана за да се кръсти от него.
౧౩ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరికి వచ్చాడు.
14 А Йоан го възпираше, казвайки: Аз имам нужда да се кръстя от Тебе, и Ти ли идеш при мене?
౧౪అయితే యోహాను, “నేను నీచేత బాప్తిసం పొందవలసి ఉండగా, నీవు నా దగ్గరికి వస్తున్నావా?” అని ఆయనను నివారింపజూశాడు.
15 А Исус в отговор му рече: Остави сега, защото така ни е прилично да изпълним всичко що е право. Тогава Йоан Го остави.
౧౫కానీ యేసు, “ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే” అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.
16 И като се кръсти, Исус веднага излезе от водата; и, ето, отвориха Му се небесата и видя Божият Дух, че слиза като гълъб и се спускаше на Него;
౧౬యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
17 и ето глас от небесата, който казваше: Този е възлюбеният Ми Син, в Когото е Моето благоволение.
౧౭“ఇదిగో చూడండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం” అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.