< Исая 8 >
1 И Господ ми рече: Вземи си една голяма писателска дъска та пиши на нея с обикновени букви - За Махер-шалал-хаш-база;
౧యెహోవా “నీవు పెద్ద పలక తీసుకుని ‘మహేర్ షాలాల్ హాష్ బజ్’ అనే మాటలు దాని మీద రాయి.
2 и аз си избрах за верни свидетели свещеника Урия и Захария Еверехиевия син.
౨నా నిమిత్తం నమ్మకమైన సాక్ష్యం పలకడానికి యాజకుడైన ఊరియా, యెబెరెక్యా కుమారుడు జెకర్యాలను పిలుస్తాను” అని నాతో చెప్పాడు.
3 Прочее, отидох при пророчицата; и тя зачна и роди син. И Господ ми рече: Наречи го Махер-шалал-хаш-баз;
౩అప్పుడు నేను స్త్రీ ప్రవక్త దగ్గరికి పోయాను. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. యెహోవా “వాడికి ‘మహేర్ షాలాల్ హాష్ బజ్’ అనే పేరు పెట్టు.
4 Защото преди да се научи детето да вика - Татко мой! и - Майко моя! богатството на Дамаск и користите на Самария ще се занесат пред асирийския цар.
౪ఈ పిల్లవాడు నాన్నా, అమ్మా అనగలిగే ముందే అష్షూరు రాజు, అతని మనుషులు దమస్కు ఐశ్వర్యాన్నీ షోమ్రోను దోపుడు సొమ్మునూ ఎత్తుకు పోతారు” అన్నాడు.
5 И Господ ми говори пак, казвайки:
౫యెహోవా ఇంకా నాతో ఇలా సెలవిచ్చాడు.
6 Понеже тия люде се отказаха от тихо течащите силоамски води, И се радват за Расина и за Ромелиевия син,
౬“ఈ ప్రజలు మెల్లగా పారే షిలోహు నీళ్లు వద్దని, రెజీనును బట్టి, రెమల్యా కుమారుణ్ణి బట్టి సంతోషిస్తున్నారు.”
7 Затова, ето, Господ възвежда върху тях Силните и големи води на Ефрат, Асирийския цар и всичката му слава; И като прелее всичките си канали И наводни всичките си брегове,
౭కాబట్టి ప్రభువు బలమైన యూఫ్రటీసు నది వరద జలాలను, అంటే అష్షూరు రాజును అతని సైన్యమంతటిని వారి మీదికి రప్పిస్తాడు. అవి దాని కాలవలన్నిటి పైగా పొంగి తీరాలన్నిటి మీదా పొర్లి పారుతాయి.
8 Ще нахлуе и през Юда, ще наводни и ще прелее, ще стигне до гуша, И прострените му крила ще напълнят Ширината на земята ти, Емануиле.
౮అవి యూదా దేశంలోకి వచ్చి వరద పొంగులా ప్రవహిస్తాయి. అవి మెడలోతు అవుతాయి. ఇమ్మానుయేలూ, దాని రెక్కలు నీ దేశమంతా కప్పేస్తాయి.
9 Строшете се, народи, бъдете разломени, И (чуйте всички, които сте в далечни страни!) Опашете се; но ще бъдете разломени; Опашете се; но ще бъдете разломени.
౯ప్రజలారా, మీరు ముక్కలు చెక్కలై పోతారు. దూరదేశాల్లారా, మీరందరూ వినండి. మీరు యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలైపొండి. యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలై పొండి.
10 Съветвайте помежду си, но съветването ще се осуети; Говорете дума, но тя няма да стои; Защото Бог е с нас.
౧౦పథకం వేసుకోండి గానీ దాన్ని అమల్లో పెట్టలేరు. ఆజ్ఞ ఇవ్వండి గానీ ఎవరూ దాన్ని పాటించరు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు.
11 Защото така ми говори Господ със силна ръка, И научи ме да не ходя в пътя на тия люде, като каза:
౧౧తన బలిష్ఠమైన చేతిని నాపై ఉంచి ఈ ప్రజల దారిలో నడవకూడదని యెహోవా ఖండితంగా నాతో చెప్పాడు.
12 Да не наречете съюз всичко което тия люде наричат съюз, И да не се боите от това, от което те се боят, Нито да се плашите.
౧౨ఈ ప్రజలు కుట్ర అని చెప్పేదంతా కుట్ర అనుకోకండి. వారు భయపడే దానికి భయపడకండి. హడలి పోకండి.
13 Господа на Силите - Него осветете, От Него да се страхувате, и пред Него да треперите.
౧౩సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి. మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే.
14 И Той ще бъде за светилище, - Но и за камък, о който да се спъват, и за канара, поради която да се оскърбяват Двата Израилеви дома, - За мрежа и за примка на ерусалимските жители.
౧౪అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అయితే ఆయన ఇశ్రాయేలు రెండు కుటుంబాలకు తొట్రుపడజేసే రాయిగా తూలి పడేసే బండగా ఉంటాడు. యెరూషలేము నివాసులకు బోనుగా చిక్కుకునే వలగా ఉంటాడు.
15 И о Него мнозина ще се спънат, ще паднат и ще се съкрушат, И в нея ще се впримчат и ще се уловят.
౧౫చాలా మంది వాటికి తగిలి తొట్రుపడి కాళ్లు చేతులు విరిగి వలలో చిక్కి పట్టుబడతారు.
16 Завържи увещанието, Запечатай поуката между учениците Ми.
౧౬ఈ సాక్ష్య వాక్యాన్ని కట్టు. ఈ అధికారిక వార్తను సీలు వేసి నా శిష్యులకు అప్పగించు.
17 И аз ще чакам Господа, който крие лицето Си от Якововия дом, И на Него ще се надея.
౧౭యాకోబు వంశానికి తన ముఖం దాచుకున్న యెహోవా కోసం నేను ఎదురు చూస్తాను. ఆయన కోసం నేను ఎదురు చూస్తాను.
18 Ето, аз и децата, които ми е дал Господ, Сме за знамение и за предвещания в Израиля От Господа на Силите, Който обитава на хълма Сион.
౧౮ఇదిగో, నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు. సీయోను కొండ మీద నివసించే సేనల ప్రభువు యెహోవా మూలంగా సూచనలుగా, మహత్కార్యాలుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
19 И когато ви рекат: Допитвайте се до запитвачите на зли духове, И до врачовете, които шепнат и мърморят, отговорете: Не трябва ли един народ да се допита до своя Бог? Ще прибегне ли при мъртвите заради живите?
౧౯వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా? బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి?
20 Нека прибегнат при закона и при свидетелството! Ако не говорят според това слово, Наистина няма зазоряване за тях.
౨౦ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.
21 И ще минат през тая земя зле притискани и изгладнели; И когато огладнеят ще негодуват, Ще злословят царя си и Бога си. И ще погледнат нагоре.
౨౧అలాటి వారు ఇబ్బంది పడుతూ ఆకలితో దేశమంతా తిరుగులాడుతారు. ఆకలేసి కోపపడతారు. తమ ముఖాలు ఆకాశం వైపుకు ఎత్తి తమ రాజును, తమ దేవుణ్ణి దూషిస్తారు.
22 После ще се върнат в земята, И ето скръб и тъмнина, мрак на измъчване, И широко разпространена черна нощ.
౨౨భూమి వైపు తేరి చూసి, దురవస్థ, అంధకారం, భరించరాని వేదన అనుభవిస్తారు. ఇతరులు వారిని వారు గాఢాంధకార దేశంలోకి తోలివేస్తారు.