< Исая 6 >
1 В годината, когато умря цар Озия видях Господа седнал на висок и издигнат престол, и полите Му изпълниха храма.
౧రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి.
2 Над Него стояха серафимите, от които всеки имаше по шест крила; с две покриваше лицето си, с две покриваше нозете си, и с две летеше.
౨ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు.
3 И викаха един към друг, казвайки: - Свет, свет, свет Господ на Силите! Славата Му пълни цялата земя.
౩వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.
4 И основите на праговете се поклатиха от гласа на оня, който викаше, и домът се напълни с дим.
౪వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది.
5 Тогава рекох: Горко ми, защото загинах; понеже съм човек с нечисти устни, и живея между люде с нечисти устни, понеже очите ми видяха Царя, Господа на Силите.
౫నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను. నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను.
6 Тогава долетя при мене един от серафимите, като държеше в ръката си разпален въглен, що бе взел с щипци от олтара.
౬అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు.
7 И като го допря до устата ми, рече: Ето, това се допря до устните ти; и беззаконието ти се отне, и грехът ти се умилостиви.
౭“ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.
8 После чух гласа на Господа, който казваше: Кого да пратя? И кой ще отиде за Нас? Тогава рекох: Ето ме, изпрати мене.
౮అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను. అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను.
9 И рече: - Иди кажи на тия люде: С уши непрестанно ще чуете, но няма да схванете, И с очи непрестанно ще видите, но няма да разберете.
౯ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.
10 Направи да затлъстее сърцето на тия люде, И направи да натегнат ушите им, и затвори очите им, Дане би да гледат с очите си, и да слушат с ушите си, И да разберат със сърцето си, и да се обърнат та се изцелят.
౧౦వారు కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని, స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి, వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు.
11 Тогава рекох: Господи, до кога? И Той отговори: Докато запустеят градовете та да няма жител, И къщите та да няма човек, И страната да запустее съвсем,
౧౧“ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,
12 Докато отдалечи Господ човеците, И напуснатите места всред земята бъдат много.
౧౨యెహోవా ప్రజలను దూరప్రాంతానికి తీసుకు పోయే దాకా, దేశం నిర్జనమై చవిటిపర్ర అయ్యే దాకా.”
13 Но още ще остане в нея една десета част, И тя ще бъде погризена; Но както на теревинта и дъба Пънът им остава, когато се отсекат, Така светият род ще бъде пъна й.
౧౩దానిలో పదవ భాగం మాత్రం మిగిలిపోయినా అది కూడా నాశనమౌతుంది. సింధూర మస్తకి వృక్షాలను నరికి వేసినా తరువాత మిగిలి ఉండే మొద్దులాగా అది ఉంటుంది. అలాటి మొద్దులో పరిశుద్ధమైన చిగురు ఉంది.