< Исая 57 >
1 Праведният загива, и никой не взема това присърце; И благочестивите се отнемат от земята, без да размисли някой, Че праведният се отнема преди да дойде злото.
౧నీతిమంతులు చనిపోతున్నారు గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. నిబంధన ప్రజలు చనిపోతున్నారు గానీ ఎవరికీ అర్థం కావడం లేదు. కీడు చూడకుండా నీతిమంతులను తీసివేయడం జరుగుతూ ఉంది.
2 Той се успокоява; Те си почиват на леглата си, Всеки, който ходи в правотата си.
౨అతడు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాడు. యథార్ధంగా ప్రవర్తించేవారు తమ పడకల మీద విశ్రాంతి తీసుకుంటారు.
3 А вие, синове на врачка, Рожба на прелюбодеец и на блудница, приближете се тук.
౩మంత్రకత్తె కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరిక్కడికి రండి!
4 С него се подигравате? Против кого сте отворили широко уста и изплезили език? Не сте ли чада на престъпление, рожба на лъжа.
౪మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు? ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు? మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా?
5 Вие, които се разжегвате между дъбовете, Под всяко зелено дърво, Които колите чадата в деретата, Под разцепените канари?
౫సింధూర వృక్షాల కింద, పచ్చని ప్రతి చెట్టు కింద, కామంతో రగిలిపోయే మీరు, లోయల్లో రాతిసందుల కింద, మీరు మీ పిల్లలను చంపుతున్నారు.
6 Делът ти е между камъчетата на потоците; Те, те са твое наследство, И на тях си изливала възлияния, Принасяла си хлебен принос. Ще мога ли да се удовлетворя за тия неща?
౬లోయలోని రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు. వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యం అర్పిస్తున్నారు. వీటిలో నేను ఆనందించాలా?
7 На висока и издигната скала си издигнала леглото си, И там си се изкачвала да принасяш жертва.
౭ఉన్నత పర్వతం మీద నీ పరుపు వేసుకున్నావు. బలులు అర్పించడానికి నువ్వు అక్కడికే ఎక్కి పోయావు.
8 Зад вратите и стълбовете им си поставила спомена си; Защото си се открила другиму освен Мене, и си се възкачила; Разширила си леглото си, и съгласила си се с тях; Обикнала си тяхното легло, избрала си място за него.
౮తలుపు వెనుక ద్వారబంధాల వెనుక నీ గుర్తులు ఉంచావు. నన్ను వదిలిపెట్టి బట్టలు ఊడదీసి మంచమెక్కావు. నీ పరుపు వెడల్పు చేసుకున్నావు. నువ్వు వాళ్ళతో నిబంధన చేసుకున్నావు. వాళ్ళ మంచాలంటే నీకిష్టం. నువ్వు వాళ్ళ మానం చూశావు.
9 Отишла си и при царя с помади, И умножила си ароматите си, Пратила си далеч посланиците си, И унизила си се дори до преизподнята. (Sheol )
౯నువ్వు నూనె తీసుకుని రాజు దగ్గరికి వెళ్లావు. ఎన్నో పరిమళ ద్రవ్యాలను తీసుకెళ్ళావు. నీ రాయబారులను దూరప్రాంతాలకు పంపుతావు. పాతాళానికి దిగిపోయావు. (Sheol )
10 Уморила си се от дългия път, Но пак не си рекла: Няма надежда; Намерила си съживление на силата си, Затова не си примряла.
౧౦నీ దూర ప్రయాణాలతో నువ్వు అలసిపోయావు. అయితే “అది వ్యర్ధం” అని ఎన్నడూ అనలేదు. నువ్వు నీ చేతుల్లో బలం తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వు నీరసించిపోలేదు.
11 И от кого си се уплашила или убояла та да излъжеш, И да не си спомняш за Мене, Нито да Ме съхраняваш в сърцето си? Не е ли защото Аз млъкнах и то от дълго време. Гдето ти не се убоя от Мене?
౧౧ఎవరికి జడిసి, భయపడి అంత మోసం చేశావు? నా గురించి ఆలోచించలేదు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. చాలా కాలం నేను మౌనంగా లేను గదా! అయితే నువ్వు నన్నంతగా పట్టించుకోలేదు.
12 Аз ще изявя правдата ти; А колкото за делата ти, няма да те ползуват,
౧౨నీ నీతి ఎలాంటిదో నేనే వెల్లడిచేస్తాను. వాటివలన నీకేమీ ప్రయోజనం ఉండదు.
13 Когато извикаш, нека, те отърват сбирщината на идолите ти; Но вятърът ще ги отнесе всички, Един лъх ще ги помете; А който уповава на Мене ще владее земята, И ще придобие светия Ми хълм.
౧౩నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి! వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి. అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.
14 И ще се рече: Изравнете, изравнете, пригответе пътя, Отмахнете спънките от пътя на Моите люде.
౧౪ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి! నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.”
15 Защото така казва Всевишният и Превъзнесеният, Който обитава вечността, Чието име е Светий: Аз обитавам на високо и свето място, Още с онзи, който е със съкрушен и смирен дух, За да съживявам духа на смирените, И да съживявам сърцето на съкрушилите се,
౧౫ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.
16 Защото няма да се съдя с човеците вечно, Нито ще бъда винаги гневен; Понеже тогаз биха примрели пред Мене Духът и душите, които съм направил.
౧౬నేను ఎల్లప్పుడూ నిందించను. ఎప్పుడూ కోపంగా ఉండను. అలా ఉంటే మనిషి ఆత్మ నీరసించి పోతుంది. నేను సృష్టించిన మనుషులు నీరసించి పోతారు.
17 Поради беззаконното му лакомство се разгневих и го поразих, Отвърнах лицето Си и се разгневих; Но кой упорито последва пътя на сърцето си.
౧౭అక్రమంగా సంపాదించిన అతని పాపాన్ని బట్టి నేను కోపపడి అతన్ని శిక్షించాను. నా ముఖాన్ని కోపంతో చాటు చేశాను. అయితే అతడు తనకిష్టమైన దారిలోకి తిరిగి వెళ్ళిపోయాడు.
18 Видях пътищата му, и ще го изцеля; Още ще го водя, и пак ще утеша него и наскърбените му.
౧౮నేనతని ప్రవర్తన చూశాను కానీ అతన్ని బాగుచేస్తాను. అతనికి దారి చూపుతాను. అతన్నీ అతని కోసం దుఃఖించే వారినీ ఓదారుస్తాను.
19 Аз, Който създавам плода на устните, казва Господ, Ще река: Мир, мир на далечния и близкия: И ще го изцеля.
౧౯వారికి కృతజ్ఞతాపూర్వకమైన పెదాలు ఇస్తాను. దూరంగా ఉన్నవారికీ దగ్గరగా ఉన్నవారికీ శాంతి సమాధానాలుంటాయి” అని యెహోవా చెబుతున్నాడు. “నేనే వారిని బాగుచేస్తాను”
20 А нечестивите са като развълнувано море, Защото не може да утихне, И водите му изхвърлят тиня и кал.
౨౦అయితే దుర్మార్గులు అటూ ఇటూ కొట్టుకునే సముద్రం లాంటి వారు. దాని నీళ్ళు, బురద పైకి తెస్తూ ఉంటుంది.
21 Няма мир за нечестивите, казва Бог.
౨౧“దుర్మార్గులకు ప్రశాంతత ఉండదు” అని దేవుడు చెబుతున్నాడు.