< Евреи 13 >

1 Постоянствувайте в братолюбието.
సోదర ప్రేమను కొనసాగనియ్యండి.
2 Не забравяйте гостолюбието; понеже чрез него някои, без да знаят, са приели на гости ангели.
అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు.
3 Помнете затворените, като че сте с тях заедно затворени,
మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి.
4 Женитбата нека бъде на почит у всички, и леглото неосквернено; защото Бог ще съди блудниците и прелюбодейците.
వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.
5 Не се впримчвайте в сребролюбието; задоволявайте се с това, що имате, защото сам Бог е рекъл: "Никак няма да те оставя и никак няма да те забравя";
డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.
6 така щото дръзновено казваме: "Господ ми е помощник; няма да се убоя; Какво ще ми стори човек?"
కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం.
7 Помнете ония, които са ви били наставници, които са ви говорили Божието слово; и като се взирате в сетнината на техния начин на живеене, подражавайте вярата им.
మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి.
8 Исус Христос е същият вчера днес и до века. (aiōn g165)
యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. (aiōn g165)
9 Не се завличайте от разни и странни учения; защото е добре сърдцето да се укрепява с благодат, а не с наредби за ястия, от които не са се ползували ония, които не са се водили по ( Гръцки: Са ходили в ) тях.
అనేక రకాలైన కొత్త బోధలకు తిరిగిపోకండి. దైవకృపతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారనియమాలతో కాదు. వాటి ప్రకారం ప్రవర్తించిన వారికి వాటివల్ల ఏ ప్రయోజనం కలగదు.
10 Ние имаме олтар, от който нямат право да ядат служащите в скинията.
౧౦మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు.
11 Защото се изгарят вън от стана телата на животните, чиято кръв, първосвещенникът внася в светилището като жертва за греховете.
౧౧ఎందుకంటే పాప పరిహార బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు.
12 Затова и Исус, за да освети людете чрез собствената си кръв, пострада вън от градската порта.
౧౨కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగరద్వారం బయట హింసలు పొందాడు.
13 Прочее, нека излизаме и ние към Него вън от стана, понасяйки позор за Него.
౧౩కాబట్టి మనం ఆయన అపనిందను భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరికి వెళ్దాం.
14 Защото тук нямаме постоянен град, но търсим бъдещия.
౧౪ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం.
15 Прочее, чрез Него нека принасяме на Бога непрестанно хвалебна жертва, сиреч, плод от устни, които изповядват Неговото име.
౧౫యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం.
16 А не забравяйте да правите благодеяния и да споделяте с другите благата си; защото такива жертви са угодни на Бога,
౧౬ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.
17 бъдете послушни на вашите наставници и покорявайте им се, (защото те бдят за душите ви, като отговорни за тях), за да изпълнят това бдение с радост, а не с въздишане; защото да бдят с въздишане не би било полезно за вас.
౧౭మీ నాయకులకు విధేయులుగా ఉండండి. వారికి లోబడి ఉండండి. ఎందుకంటే వారు లెక్క అప్పజెప్పే వారిలా మీ ఆత్మల క్షేమం కోసం కావలివారుగా ఉన్నారు. మీ గురించి వారు విచారంతో కాకుండా సంతోషంగా కావలి కాసేవారుగా ఉండడానికి వారికి లోబడండి. వారు విచారంగా ఉండడం మీకు మేలుకరం కాదు.
18 Молете се за нас, защото сме уверени, че имаме чиста съвест и искаме да се обхождаме във всичко честно.
౧౮అన్ని విషయాల్లో యోగ్యంగా జీవించాలనే మంచి మనస్సాక్షి మాకుందని నమ్ముతున్నాం. మా కోసం ప్రార్ధించండి.
19 А особено ви се моля да правите това, за да ви бъда по-скоро повърнат.
౧౯మీ దగ్గరికి త్వరలో తిరిగి రాగలిగేలా మరింత ప్రార్థించాలని కోరుతున్నాను.
20 А Бог на мира, Който чрез кръвта на единия вечен завет е въздигнал от мъртвите великия Пастир на овцете, нашия Господ Исус, (aiōnios g166)
౨౦గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు (aiōnios g166)
21 дано ви усъвършенствува във всяко добро нещо, за да вършите Неговата воля, като действува във вас това, което е угодно пред Него чрез Исуса Христа, Комуто да бъде слава във вечни векове. Амин. (aiōn g165)
౨౧ప్రతి మంచి విషయంలో తన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తాడు గాక! తన దృష్టిలో ప్రీతికరమైన దాన్ని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తూ ఉంటాడు గాక! ఆ యేసు క్రీస్తుకు ఎప్పటికీ కీర్తి యశస్సులు కలుగుతాయి. ఆమెన్. (aiōn g165)
22 Но моля ви се, братя, да ви не бъде тежко това увещателно слово, защото накъсо ви писах.
౨౨సోదరులారా మీకు సంక్షిప్తంగా రాసిన ఈ ప్రోత్సాహవాక్కును సహించమని కోరుతున్నాను.
23 Знайте, че нашият брат Тимотей е пуснат, с когото ако дойде скоро, ще ви видя.
౨౩మన సోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరగా వస్తే అతనితో కలసి మిమ్మల్ని చూస్తాను.
24 Поздравете всичките ваши наставници и всичките светии. Поздравяват ви тия, които са от Италия.
౨౪మీ అధికారులందరికీ పరిశుద్ధులందరికీ అభివందనాలు తెలియజేయండి. ఇటలీలో ఉన్నవారు మీకు అభివందనాలు చెబుతున్నారు.
25 Благодат да бъде с всички вас. Амин.
౨౫మీకందరికీ కృప తోడై ఉండు గాక.

< Евреи 13 >