< Евреи 11 >
1 А вярата е даване твърда увереност в ония неща, за които се надяваме,
౧విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం.
2 Защото поради нея за старовременните добре се свидетелствуваше.
౨మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు.
3 С вяра разбираме, че световете са били създадени с Божието слово, тъй щото видимото не стана от видими неща. (aiōn )
౩విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం. (aiōn )
4 С вяра Авел принесе Богу жертва по-добра от Каиновата, чрез която за него се засвидетелствува, че е праведен, понеже Бог свидетелствува за даровете му; и чрез тая вяра той и след смъртта си още говори.
౪విశ్వాసం ద్వారా హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలిని దేవునికి అర్పించాడు. దీని వల్లనే అతణ్ణి నీతిమంతుడని పొగడడం జరిగింది. అతడు తెచ్చిన కానుకలను బట్టి దేవుడతణ్ణి మెచ్చుకున్నాడు. దాని వల్ల హేబెలు చనిపోయినా ఇప్పటికీ మాట్లాడుతున్నాడు.
5 С вяра Енох бе преселен, за да не види смърт, и не се намираше, защото Бог го пресели; понеже преди неговото преселване беше засвидетелствувано за него, че е бил угоден на Бога.
౫విశ్వాసాన్ని బట్టి దేవుడు హనోకును మరణం చూడకుండా తీసుకు వెళ్ళాడు. “దేవుడు తీసుకువెళ్ళాడు కనుక అతడు కనిపించలేదు.” దేవుడు తీసుకువెళ్ళక ముందు అతడు దేవుణ్ణి సంతోషపెట్టాడని అతని గురించి చెప్పారు.
6 А без вяра не е възможно да се угоди Богу, защото който дохожда при Бога трябва да вярва, че има Бог, и че Той възнаграждава тия, които го търсят.
౬విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
7 С вяра Ное, предупреден от Бога за неща, които още не се виждаха, подбуден от страхопочитание, направи ковчег за спасение на дома си; чрез която вяра той осъди света и стана наследник на правдата, която е чрез вяра.
౭విశ్వాసాన్ని బట్టి నోవహు అప్పటివరకూ తాను చూడని సంగతులను గూర్చి దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని పట్ల పూజ్య భావంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓడను నిర్మించాడు. ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు.
8 С вяра Авраам послуша, когато бе повикан да излезе и да отиде на едно място, което щеше да получи в наследство, и излезе без да знае къде отива.
౮దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు.
9 С вяра се засели в обещаната земя като в чужда, и живееше в шатри, както и Исаак и Яков, наследниците заедно с него на същото обещание.
౯విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు.
10 Защото очакваше града, който има вечни основи, на който архитект и строител е Бог.
౧౦ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు.
11 С вяра и сама Сара доби сила да зачене в преминала възраст, понеже счете за верен Този, Който се бе обещал.
౧౧విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది.
12 Затова само от един човек, и той замъртвял, се народи множество, колкото небесните звезди и като крайморския пясък, който не може да се изброи.
౧౨అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు.
13 Всички тия умряха във вяра, тъй като не бяха получили изпълнението на обещанията; но ги видяха и поздравиха отдалеч, като изповядаха, че са чужденци и пришелци на земята.
౧౩వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు.
14 А ония, които говорят така, явно показват, че търсят свое отечество;
౧౪ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు.
15 и ако наистина, така говорейки, са имали в ума си онова отечество, от което бяха излезли, намерили биха случай да се върнат.
౧౫ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది.
16 Но на дело желаят едно по-добро отечество, сиреч, небесното; затова Бог не се срамува от тях да се нарече техен Бог, защото им е приготвил град.
౧౬కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు.
17 С вяра Авраам, когато го изпитваше Бог, принесе Исаака жертва, да! оня, който беше получил обещанията принасяше единородния си син,
౧౭విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు.
18 оня, комуто беше казано: " По Исаака ще се наименува твоето потомство".
౧౮“ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు.
19 като разсъди, че Бог може да възкресява и от мъртвите,
౧౯దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
20 С вяра Исаак благослови, Якова и Исава даже за бъдещите неща.
౨౦విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల విషయమై యాకోబునూ, ఏశావునూ ఆశీర్వదించాడు.
21 С вяра Яков, на умиране, благослови всекиго от Йосифовите синове и поклони се Богу подпирайки се върху края на тоягата си.
౨౧విశ్వాసాన్ని బట్టి యాకోబు తాను చనిపోయే ముందు యోసేపు ఇద్దరు కుమారులను ఒక్కొక్కరుగా ఆశీర్వదించాడు. యాకోబు తన చేతికర్ర పైన ఆనుకుని దేవుణ్ణి ఆరాధించాడు.
22 С вяра Йосиф, на умиране, спомена за излизането на израилтяните и даде поръчка за костите си.
౨౨విశ్వాసాన్ని బట్టి యోసేపు తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి స్వదేశానికి ప్రయాణం కావాల్సిన విషయం గూర్చి మాట్లాడాడు. తన ఎముకలను వారితో తీసుకువెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
23 С вяра, когато се роди Моисей, родителите му го криха три месеца, защото видяха, че бе красиво дете; и не се боеха от царската заповед,
౨౩విశ్వాసాన్ని బట్టి మోషే తల్లిదండ్రులు అతడు పుట్టినప్పుడు ఆ పసివాడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచి పెట్టారు. రాజు ఆదేశాలకు వారు భయపడలేదు.
24 С вяра Моисей, като стана на възраст, се отказа да се нарича син на фараоновата дъщеря
౨౪విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు.
25 и предпочете да страда с Божиите люде, а не да се наслаждава за кратко време на греха,
౨౫కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు.
26 като разсъди, че укорът за Христа е по-голямо богатство от египетските съкровища; защото гледаше на бъдещата награда.
౨౬ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు.
27 С вяра напустна Египет, без да се бои от царския гняв; защото издържа, като един, който вижда Невидимия.
౨౭విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తును విడిచి పెట్టాడు. కంటికి కనిపించని దేవుణ్ణి చూస్తూ సహించాడు కనుక అతడు రాజు ఆగ్రహానికి జడియలేదు.
28 С вяра установи пасхата и поръсването с кръвта, за да се не допре до тях този, които погубваше първородните.
౨౮విశ్వాసాన్ని బట్టి అతడు పస్కా, రక్త ప్రోక్షణ ఆచరించాడు. దానివలన ప్రథమ సంతానాన్ని హతమార్చడానికి బయల్దేరిన వినాశకుడు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని ముట్టుకోలేదు.
29 С вяра израилтяните минаха през Червеното море като по сухо, на което като се опитаха и египтяните, издавиха се.
౨౯విశ్వాసాన్ని బట్టి పొడినేల మీద నడిచినట్టుగా వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్ళాలని చూశారు గానీ సముద్రం వారిని మింగివేసింది.
30 Чрез вяра ерихонските стени паднаха след седмодневно обикаляне около тях.
౩౦విశ్వాసాన్ని బట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ తిరిగాక అవి కూలిపోయాయి.
31 С вяра Раав блудницата не погина заедно с непокорните, като прие съгледателите с мир.
౩౧విశ్వాసాన్ని బట్టి రాహాబు అనే వేశ్య గూఢచారులకు ఆశ్రయం ఇచ్చి కాపాడింది కనుక అవిధేయులతో బాటు నశించలేదు.
32 И какво повече да кажа? Защото не ще ми стигне време да приказвам за Гедеона, Варака, Самсона и Иефтае, за Давида още и Самуила и пророците;
౩౨ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు.
33 които с вяра побеждаваха царства, раздаваха правда, получаваха обещания, затуляха устата на лъвове,
౩౩విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు.
34 угасваха силата на огъня, избягваха острото на ножа, оздравяха от болести, ставаха силни във война, обръщаха в бяг чужди войски.
౩౪అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు.
35 Жени приемаха мъртвите си възкресени; а други бяха мъчени, защото, за да получат по-добро възкресение, те не приемаха да бъдат избавени.
౩౫స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు.
36 Други пък изпитваха присмехи и бичувания, а още и окови и тъмници;
౩౬ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు.
37 с камъни биваха убити, с трион претрити, с мъки мъчени; умираха заклани с нож, скитаха се в овчи и кози кожи и търпяха лишение, бедствия и страдания;
౩౭వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు.
38 те, за които светът не беше достоен, се скитаха по пустините и планините, по пещерите и рововете на земята,
౩౮అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు.
39 Но всички тия, ако и да бяха засвидетелствувани чрез вярата им, пак не получиха изпълнението на обещанието,
౩౯వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు.
40 да не би да постигнат в съвършенство без нас; защото за нас Бог промисли нещо по-добро.
౪౦మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు.