< Данаил 9 >
1 В първата година на Дария Асуировия син, от рода на мидяните, който се постави цар над Халдейската държава,
౧మాదీయుడైన అహష్వేరోషు కుమారుడు దర్యావేషు కల్దీయులపై రాజయ్యాడు.
2 в първата година от царуването му аз Даниил разбрах от свещените книги числото на годините, за които дойде Господното слово към пророк Еремия, че запустението на Ерусалим ще трае седемдесет години.
౨అతని పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలు అనే నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయాకు ఇచ్చిన వాక్కు రాసి ఉన్న గ్రంథాలు చదువుతున్నాను. యెరూషలేము విడిచిపెట్టబడిన స్థితిలో ఉండవలసిన 70 సంవత్సరాలు పూర్తి కావచ్చాయని గ్రహించాను.
3 Тогава обърнах лицето си към Господа Бога, за да отправя към него молитва и молби с пост, вретище и пепел.
౩అప్పుడు నేను గోనెపట్ట కట్టుకుని, ఉపవాసముండి, ధూళిలో కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన దేవుని వైపుకు నా ముఖం తిప్పుకున్నాను.
4 Когато се помолих на Господа моя Бог и се изповядах, рекох: О, Господи, велики и страшни Боже, Който пазиш завета и милостта Си към ония, които Те любят и пазят Твоите заповеди!
౪నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి మా పాపాలు ఒప్పుకున్నాను. “ప్రభూ, మహాత్మ్యం, మహా శక్తి గల దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి పట్ల నీ నిబంధనను నీ కృపను నీవు జ్ఞాపకం చేసుకుంటావు.
5 Съгрешихме, постъпихме извратено, вършихме нечестие, бунтувахме се, и се отклонихме от Твоите заповеди и от Твоите съдби;
౫మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము.
6 и не послушахме слугите Ти пророците, които говориха в Твое име на царете ни и на началниците ни, на бащите ни и на всичките люде на земята ни.
౬నీ దాసులైన ప్రవక్తలు నీ నామాన్ని బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పూర్వికులకు, యూదయ దేశప్రజలందరికి చెప్పిన మాటలు మేము వినలేదు.
7 На Тебе, Господи, прилича правда, а на нас срам на лицето, както е и днес, на юдовите мъже, на ерусалимските жители, и на целия Израил, както и на ония, които са ближни, така и на ония, които са далечни по всички страни дето си ги изгонил подир престъплението, което извършиха против Тебе.
౭ప్రభూ, నీవే నీతిమంతుడవు. మేము నీ మీద తిరుగుబాటు చేశాము. యెరూషలేములో, యూదయ దేశంలో నివసిస్తున్న వారందరి ముఖాలకు, ఇశ్రాయేలీయులందరి ముఖాలకు సిగ్గే తగినది. నీవు చెదరగొట్టిన స్వదేశవాసులకు, పర దేశవాసులకు ఇదే శాస్తి. మేము నీ పట్ల చేసిన గొప్ప నమ్మక ద్రోహానికి ఇదే శిక్ష.
8 Господи, срам на лицето подобава на нас, на царете ни, на началниците ни, и на бащите ни, защото Ти съгрешихме.
౮ప్రభూ, నీకు విరోధంగా పాపం చేసినందున మాకు, మా రాజులకు, మా అధికారులకు, మా పూర్వీకులకు ముఖం చిన్నబోయేలా సిగ్గే తగినది.
9 На Господа нашия Бог принадлежат милост и прощение, защото се възбунтувахме против Него,
౯మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేశాము. అయితే ఆయన కృప, క్షమాగుణం ఉన్న దేవుడు.
10 и не послушахме гласа на Господа Нашия Бог да ходим по законите, които положи пред нас чрез слугите си пророците.
౧౦ఆయన తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పాడు. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు.
11 Да! Целият Израил престъпи закона Ти, като се отклони та не послуша гласа Ти; за която причина се изля върху нас проклетията и клетвата, написана в закона на Божия слуга Мойсей; защото му съгрешихме.
౧౧ఇశ్రాయేలీయులంతా నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినకుండా తిరుగుబాటు చేశారు. మేము పాపం చేశాము గనక శపిస్తానని నీవు నీ సేవకుడు మోషే ధర్మశాస్త్రంలో శపథం చేసి చెప్పినట్టు ఆ శాపాన్ని మా మీద కుమ్మరించావు.
12 Той потвърди думите, които изговори против нас, и против нашите съдии, които са ни съдили, като докара върху нас голямо зло; защото никъде под небето не е ставало това, което стана на Ерусалим.
౧౨యెరూషలేములో జరిగిన అరిష్టం మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి, మాకు పాలకులుగా ఉన్న మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు.
13 Всичкото това зло, както е написано в Мойсеевия закон, дойде върху нас; но пак не се молихме пред Господа нашия Бог, за да се върнем от беззаконията си и да постъпваме разумно според истината Ти.
౧౩మోషే ధర్మశాస్త్రంలో రాసిన కీడంతా మాకు సంభవించినా మేము మా చెడు నడవడి మానలేదు. నీ సత్యాన్ని అనుసరించి బుద్ధి తెచ్చుకునేలా మా దేవుడైన యెహోవాను జాలి చూపమని బతిమాలుకోలేదు.
14 Затова, Господ е бдял за това зло, и вече го е докарал върху нас; защото Господ нашият Бог е справедлив във всичките дела, които върши; и ние не послушахме гласа Му.
౧౪మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనక ఆయన తన కార్య కలాపాలన్నిటి విషయమై న్యాయవంతుడు గనక, సమయం కనిపెట్టి, ఈ కీడు మా మీదికి రప్పించాడు.
15 И сега, Господи Боже наш, който си извел людете си из египетската земя с мощна ръка, и си спечелил за себе си име, каквото имаш днес, съгрешихме и вършихме нечестие.
౧౫ప్రభూ మా దేవా, నీవు నీ బాహు బలం వలన నీ ప్రజను ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకూ నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేమైతే పాపం చేసి చెడునడతలు నడిచిన వాళ్ళం.
16 Господи, според всичката Твоя правда, моля се, нека гневът и яростта Ти се отвърнат от твоя град Ерусалим, светия Ти хълм; защото поради нашите грехове и поради беззаконията на бащите ни Ерусалим и твоите люде станахме за укор на всички, които са около нас.
౧౬ప్రభూ, మా పాపాలనుబట్టి, మా పూర్వీకుల దోషాన్ని బట్టి, యెరూషలేము నీ ప్రజల చుట్టుపక్కల ఉన్న జాతులన్నిటి ఎదుట నింద పాలయింది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపాన్ని నీ రౌద్రాన్ని మళ్లించుకోమని నీ నీతిగల కార్యాలన్నిటిని బట్టి విన్నపం చేసుకుంటున్నాను.
17 Сега прочее, послушай, Боже наш, молитвата на слугата ти и молбите му, и, заради Господа, осияй с лицето си върху запустялото си светилище.
౧౭మా దేవా, దీన్ని బట్టి నీ సేవకుడు చేసే ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారంగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖప్రకాశం రానియ్యి.
18 Боже мой, приклони ухото си и послушай; отвори очите си и виж опустошенията ни, и града, който се нарича с Твоето име; защото ние не принасяме прошенията си пред Тебе заради нашата правда, но заради многото Твои щедроти.
౧౮నీ మహా కనికరాన్ని బట్టి మాత్రమే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము గాని మా సొంత నీతి కార్యాలను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించడం లేదు. మా దేవా, ఆలకించు. నీ కళ్ళు తెరచి, నీ పేరు పెట్టిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనాన్ని, నీ పేరు పెట్టిన ఈ పట్టణాన్ని తేరి చూడు.
19 Господи, послушай; Господи, прости; Господи, дай внимание и подействай; да не закъснееш, заради Себе Си, Боже мой; защото с Твоето име се наричат града Ти и людете Ти.
౧౯ప్రభూ ఆలకించు, ప్రభూ క్షమించు, ప్రభూ ఆలస్యం చేయక విని నా మనవి ప్రకారం దయ చెయ్యి. నా దేవా, ఈ నగరం, ఈ ప్రజ నీ పేరున ఉన్నవే. నీ ఘనతను బట్టి మాత్రమే నా ప్రార్థన విను” అని వేడుకున్నాను.
20 И докато още говорех, и се молех, и изповядвах своя грях и греха на людете си Израиля, и принасях молбата си пред Господа моя Бог за светия хълм на моя Бог,
౨౦నేను ఇంకా పలుకుతూ ప్రార్థనచేస్తూ, పవిత్ర పర్వతం కోసం నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపాన్ని నా ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ నా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను.
21 дори като още говорех в молитвата, мъжът Гавриил, когото бях видял във видението по-напред, като летеше бързо се приближи до мене около часа на вечерната жертва.
౨౧నేను ఇలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా, మొదట నేను దర్శనంలో చూసిన మహా తేజోవంతుడైన గాబ్రియేలూ అనే ఆ వ్యక్తి సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను తాకాడు.
22 И вразуми ме като говори с мене, казвайки: Данииле, сега излязох да те направя способен да разбереш.
౨౨అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇలా అన్నాడు. “దానియేలూ, నీకు గ్రహించగలిగే శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను.
23 Когато ти почна да се молиш заповедта излезе; и аз дойдох да ти кажа това, защото си възлюбен; за това, размисли за работата и разбери видението.
౨౩నీవు చాలా ఇష్టమైన వాడివి గనక నీవు విన్నపం చేయడం మొదలు పెట్టినప్పుడే ఈ సంగతిని నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ వచ్చింది. కాబట్టి ఈ సంగతిని తెలుసుకుని నీకు వచ్చిన దర్శన భావాన్ని గ్రహించు.
24 Седемдесет седмици са определени за людете ти и за светия ти град за въздържането на престъплението, за довършване на греховете, и за правене умилостивение за беззаконието, и да се въведе вечна правда, да се запечата видението и пророчеството, и да се помаже Пресветия.
౨౪తిరుగుబాటును అణచి వేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని వెల్లడి చేయడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి.
25 Знай, прочее, и разбери, че от излизането на заповедта да се съгради изново Ерусалим до княза Месия ще бъдат седем седмици; и за шестдесет и две седмици ще се съгради изново, с улици и окоп, макар в размирни времена.
౨౫యెరూషలేమును మళ్ళీ కట్టించవచ్చని ఆజ్ఞ బయలు దేరిన సమయం మొదలుకుని అభిషిక్తుడైన నాయకుడు వచ్చే దాకా ఏడు ఏడులు, 62 ఏడులు పడుతుందని గ్రహించి అర్థం చేసుకో. దురవస్థ గల కాలం అయినప్పటికీ పట్టణం రాచవీధులను కందకాలను మళ్ళీ కడతారు.
26 И подир шестдесет и две седмици Месия ще бъде посечен, и не ще има кои да му принадлежат; и людете на княза, който ще дойде, ще погубят града и светилището; и краят му ще го постигне чрез потоп; и до края на войната има определени опустошения.
౨౬ఈ 62 వారాలు జరిగిన తరువాత అభిషిక్తుడు పూర్తిగా నిర్మూలం అయి పోతాడు. వస్తున్న రాజు ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. వాడి అంతం హఠాత్తుగా వస్తుంది. యుద్ధ కాలం సమాప్తమయ్యే వరకూ నాశనం జరుగుతుందని నిర్ణయం అయింది.
27 и той ще потвърди завет с мнозина за една седмица; а в половината на седмицата ще направи да престанат жертвата и приносът; и един, който запустява, ще дойде яздещ на крилото на мерзостите; и гняв ще се излее върху запустителя до определеното време.
౨౭అతడు ఒక వారం వరకూ చాలా మందితో నిబంధన చేసుకుంటాడు. అర్థవారానికల్లా బలి, నైవేద్యం నిలిపివేస్తాడు. అసహ్యమైన దానితో బాటే నాశనం చేసేవాడు వస్తాడు. నాశనం చేసేవాడి పైకి రావాలని నిర్ణయించిన నాశనం అంతా పూర్తిగా వచ్చే దాకా ఇలా జరుగుతుంది.”