< 2 Летописи 2 >
1 Тогава Соломон, като реши да построи дом на Господното име, и царска къща,
౧సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు.
2 Соломон изброи седемдесет, хиляди мъже за бременосци, и осемдесет хиляди за каменоделци в планините, и три хиляди и шестстотин за надзиратели долу.
౨అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు.
3 Тогава Соломон прати до тирския цар Хирам да кажат: Както си сторил на баща ми Давида, и си му пратил кедри, за да си построи къща, в която да живее, стори така и на мене.
౩అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు.
4 Ето, аз строя дом за името на Господа моя Бог, да го посветя Нему, за да се принася пред Него благоуханен темян и постоянните присъствени хлябове, и утринните и вечерните всеизгаряния, в съботите, на новолунията, и в празниците на Господа нашия Бог; това е всегдашна наредба в Израил.
౪నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను.
5 А домът, който строя, е голям, защото нашият Бог е велик повече от всичките богове.
౫మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది.
6 Но кой може да Му построи дом, когато небето и небето на небесата на са достатъчни да Го поберат? кой прочее съм аз, та да Му построя дом, освен само за да кадя пред Него?
౬అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.
7 Затова прати ми сега човек изкусен да работи злато и сребро, мед и желязо, мораво, червено и синьо, който знае да прави ваяни работи, и нека работи с изкусните човеци, които са с мене в Юда и в Ерусалим, който баща ми Давид е промислил.
౭కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.
8 Изпрати ми и кедрови дървета, елхови дървета и алмугови дървета от Ливан; защото зная, че твоите слуги умеят да секат дървета в Ливан; и, ето, моите слуги ще бъдат с твоите слуги,
౮ఇంకా లెబానోనులో చెట్లు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది.
9 за да ми приготвят изобилно дървета; защото домът, който строя, ще бъде голям и чудесен.
౯కాబట్టి లెబానోను నుండి సరళ మాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించబోయే దేవాలయం చాల గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు, నీ సేవకులు కలిసి పని చేస్తారు.
10 И ето, ще дам на твоите слуги, дървосечците, двадесет хиляди кора чукано жито, двадесет хиляди кора ечемик, двадесет хиляди вати вино и двадесет хиляди вати дървено масло.
౧౦కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.”
11 Тогава тирският цар Хирам отговори с писмо, което прати на Соломона: Понеже Господ люби людете Си, за това те е поставил цар над тях.
౧౧దానికి జవాబుగా తూరు రాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు.
12 Рече още Хирам: Благословен да бъде Господ Израилевият Бог, създател на небето и на земята, Който даде на цар Давида мъдър син, надарен с остроумие и разум, който да построи дом Господу и царска къща.
౧౨యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక.
13 Сега, прочее, пращам ти човек изкусен и разумен, майстора си Хирам,
౧౩తెలివీ వివేచనా గలిగిన హూరామబీ అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను.
14 син на една жена от Давидовите дъщери и на баща тирянин, изкусен и да изработва злато и сребро, мед и желязо, камъни и дърва, и мораво, синьо, висон и червено, тоже да прави всякакви ваяни работи и да изработва всякакво измишление каквото му се внуши, за да работи той заедно с твоите изкусни човеци и с изкусните човеци промислени от господаря ми баща ти Давида.
౧౪అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు.
15 Сега, прочее, нека господарят ми изпрати на слугите си житото и ечемика, дървено масло и виното, който е обещал;
౧౫ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు.
16 а ние ще насечим дърветата от Ливан, колкото ти са потребни, и ще ти ги докараме на салове по море до Иопия, а ти ще ги превозиш в Ерусалим.
౧౬మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు” అని జవాబిచ్చాడు.
17 И Соломон преброи всичките чужденци, които бяха в Израилевата земя, след преброяването, с което баща му Давид ги бе преброил; и намериха се сто и петдесет и три хиляди и шестстотин души.
౧౭సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు.
18 И от тях назначи седемдесет хиляди за бременосци, и осемдесет хиляди за каменоделци в планините, и три хиляди и шестстотин за надзиратели върху работенето на людете.
౧౮వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3, 600 మందినీ అతడు నియమించాడు.