< 2 Летописи 17 >
1 А вместо Аса се възцари син му Иосафат, който се засили против Израиля;
౧ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు.
2 защото тури военни сили във всичките укрепени градове на Юда, и постави гарнизони в Юдовата земя и в Ефремовите градове, които баща му Аса бе превзел.
౨అతడు యూదా దేశంలోని ప్రాకార పురాలన్నిటిలో సైన్యాలను ఉంచి, యూదా దేశంలో తన తండ్రి ఆసా పట్టుకొన్న ఎఫ్రాయిము పట్టణాల్లో కావలి దండులను ఉంచాడు.
3 И Господ бе с Иосафата, понеже той ходи в първите пътища на баща си Давида и не потърси ваалимите,
౩యెహోవా అతనికి సహాయం చేయగా యెహోషాపాతు తన పూర్వికుడు దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గంలో నడుస్తూ
4 но потърси Бога на бащите си, и в Неговите заповеди ходи, а не по делата на Израиля.
౪బయలు దేవుళ్ళను పూజించకుండా తన తండ్రి దేవునిపై ఆధారపడి, ఇశ్రాయేలువారి చర్యల ప్రకారం గాక దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు.
5 Затова Господ, утвърди царството в ръката му; и целият Юда даде подаръци на Иосафата; и той придоби богатство и голяма слава.
౫కాబట్టి యెహోవా అతని రాజ్యాన్ని స్థిరపరిచాడు. యూదావారంతా యెహోషాపాతుకు పన్ను కట్టారు. అతనికి ఐశ్వర్యం, ఘనత, సమృద్ధిగా కలిగింది.
6 При това, като се поощри сърцето му в Господните пътища, той отмахна от Юда високите места и ашерите.
౬యెహోవా మార్గాల్లో నడవడానికి అతడు తన మనస్సులో దృఢ నిశ్చయం చేసుకుని, ఉన్నత స్థలాలనూ దేవతా స్తంభాలనూ యూదాలో నుండి తీసివేశాడు.
7 Тоже в третата година от царуването си прати първенците си Венхаила, Авдия, Захария, Натанаила и Михаия да поучават в Юдовите градове,
౭తన పాలన మూడవ సంవత్సరంలో యూదా పట్టణాల్లోని ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించడానికి అతడు బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా అనే పెద్దలను పంపాడు.
8 и с тях левитите Семаия, Натания, Зевадия, Асаила, Семирамота, Ионатана, Адония, Товия и Товадония, левитите, и заедно с тях свещениците Елисама и Иорама.
౮వారితో షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, టోబీయా, టోబదోనీయా అనే లేవీయులనూ, ఎలీషామా, యెహోరాము అనే యజకులనూ పంపించాడు.
9 И те поучаваха в Юда, като имаха със себе си книгата на Господния закон; и обхождаха всичките Юдови градове та поучаваха людете.
౯వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని యూదావారి మధ్య ప్రకటిస్తూ, యూదా పట్టణాలన్నిటిలో సంచరిస్తూ ప్రజలకు బోధించారు.
10 И страх от Господа обзе всичките царства в земите, които бяха около Юда, та не воюваха против Иосафата.
౧౦యూదా దేశం చుట్టూ ఉన్న రాజ్యాలన్నిటి మీదికి యెహోవా భయం రావడం చేత ఎవరూ యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి తెగించలేదు.
11 Някои и от филистимците донесоха подаръци на Иосафата, и сребро като данък; арабите още му докараха стада: седем хиляди и седемстотин овена, и седем хиляди и седемстотин козли.
౧౧ఫిలిష్తీయుల్లో కొందరు యెహోషాపాతుకు పన్ను, కానుకలు ఇస్తూ వచ్చారు. అరబీయులు కూడా అతనికి 7, 700 గొర్రె పొట్టేళ్లను, 7, 700 మేకపోతులను సమర్పించేవారు.
12 И Иосафат продължаваше да се възвеличава твърде много; и съгради в Юда крепости и житници-градове.
౧౨యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడై యూదా దేశంలో కోటలనూ, సామగ్రి నిలవచేసే పట్టణాలనూ కట్టించాడు.
13 И имаше много работи в Юдовите градове, и военни мъже, силни и храбри, в Ерусалим.
౧౩యూదాదేశపు పట్టణాల్లో అతనికి విస్తారమైన సంపద సమకూడింది. అతని కింద పరాక్రమశాలురు యెరూషలేములో ఉండేవారు.
14 А ето броят им, според бащините им домове: от Юда хилядници: Адна, началникът, и с него триста хиляди души силни и храбри;
౧౪వీరి పూర్వీకుల వంశాల ప్రకారం వీరి సంఖ్య. యూదాలో సహస్రాధిపతులకు ప్రధాని అయిన అద్నా దగ్గర 3,00,000 మంది పరాక్రమశాలులున్నారు.
15 след него, Иоанан, началникът, и с него двеста и осемдесет хиляди души;
౧౫అతని తరువాత యెహోహానాను అనే అధిపతి. ఇతని దగ్గర 2, 80,000 మంది ఉన్నారు.
16 след него, Амасия Захриевият син, който драговолно принесе себе си Господу, и с него двеста хиляди силни и храбри мъже;
౧౬అతని తరువాత జిఖ్రీ కుమారుడు, యెహోవాకు తనను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొన్న అమస్యా. అతని దగ్గర 2,00,000 మంది పరాక్రమశాలులున్నారు.
17 а от Вениамина: Елиада, силен и храбър, и с него двеста хиляди души въоръжени с лъкове и щитчета;
౧౭బెన్యామీనీయుల్లో ఎల్యాదా అనే పరాక్రమశాలి ఒకడున్నాడు. ఇతని దగ్గర విల్లు, డాలు, పట్టుకొనేవారు 2,00,000 మంది ఉన్నారు.
18 а след него, Иозавад, и с него сто и осемдесет хиляди души въоръжени за война.
౧౮అతని తరువాత యెహోజాబాదు. ఇతని దగ్గర 1, 80,000 మంది యుద్ధ సన్నద్ధులున్నారు.
19 Тия бяха мъжете, които слугуваха на царя, освен ония, които царят постави в укрепените градове в целия Юда.
౧౯రాజు యూదా అంతటిలో ఉన్న ప్రాకార పురాల్లో ఉంచినవారు గాక వీరు రాజు పరివారంలో ఉన్నారు.