< 1 Коринтяни 8 >

1 А относно идоложертването: Знам, че ние всички уж имаме знание да разрешим въпроса! Но знанието възгордява, а любовта назидава.
ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది.
2 Ако някой мисли, че знае нещо, той още не е познал както трябва да познава.
ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని.
3 Но, ако някой люби Бога, той е познат от Него.
ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.
4 Прочее, относно яденето от идоложертвеното, знаем, че никакъв бог, изобразен от идол, няма на света, и че няма друг Бог освен един.
అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు.
5 Защото, ако и да има така наричани богове, било на небето или на земята, (както има много богове, и господари много),
దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ,
6 но за нас има само един Бог, Отец, от Когото е всичко, и ние за Него, и един Господ, Исус Христос, чрез Когото е всичко, и ние чрез Него.
మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
7 Но това знание го няма у всички; и някои, както и до сега имат съзнание за идолите, ядат месото като жертва на идолите; и съвестта им като слаба, се осквернява.
అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది.
8 А това що ядем, не ще ни препоръчва на Бога; нито ако не ядем, губим нещо; нито ако ядем, печелим нещо.
భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు.
9 Но внимавайте да не би по някакъв начин тая ваша свобода да стане спънка на слабите.
అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి.
10 Защото, ако някой види, че ти, който имаш знание, седиш на трапеза в идолско капище, не ще ли съвестта му да се одързости, ако е слаб, та и той да яде идоложертвено?
౧౦ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా?
11 И поради твоето знание слабият погива, братът, за когото е умрял Христос.
౧౧తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు.
12 А като съгрешавате така против братята, и наранявате слабата им съвест, вие съгрешавате против Христа,
౧౨ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
13 Затуй, ако това що ям съблазнява брата ми, аз няма да ям до века, за да не съблазня брата с. (aiōn g165)
౧౩కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను. (aiōn g165)

< 1 Коринтяни 8 >