< Ephesians 5 >
1 Huza Rji na mrli ma wa ani son ba'a.
౧కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
2 Ndi zren ni son, towa kristi santa nda nu tuma ni tu mbua.
౨క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
3 Ndu tie kan, ni kpe bi shan, na he ni mi mbi na bana kpi ni ndi ndi ni bi wa ba kpa tre Rjia na.
౩మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
4 Ndu tre ugbran sron, ni srantre ruru ma nahe ni mi mbina, bana kpi ndi ndi na. ki tie kpe u ngyri
౪కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.
5 Bi to, ndi bi tie kan kpe meme, tie shishi bi hu kpi bi brji bana heni bubu u son ni ko Rji na.
౫మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
6 Na ndu njiori gyruyi nitre u megan na, iki ni ndu Rji tie fu ni bi kawo trema (hanton).
౬పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
7 Nakima bi jana huba na.
౭కాబట్టి వారికి దూరంగా ఉండండి.
8 Bina bi bwu, u zizan bihe bi kpan ni mi Baci, biku zren na mrli bi kpan.
౮గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
9 I klo u kpan he ni kpe ndindi tsratsra, ni janji,
౯ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
10 ni kpatron wa Baci ni son'a
౧౦కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
11 na katu kabi ni klo bi memema na ni klo bi bwu, ngran ba yora.
౧౧పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
12 Ahi kpe u shan ni hla kpi wa batie ni bwu'a
౧౨ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
13 Ikpe nita ngranyo ni kpan, baka to ndindime.
౧౩ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
14 Ikpe wa batoa, ahi kpan. Nakima, batre ndi wlunde, biyi wa bisi kruna, ndi wlu ni khyu, u kristi ni kpan ni mi me
౧౪బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
15 Zren ni wrli, na zren na biwa bana wrli'a na zren na biwa ba wrli'a.
౧౫బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
16 Ta mlan zren mbi tie ni ton yi ngbu ngblu'a nani na.
౧౬సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
17 na kati ruru na to kpe w Irji ni sona
౧౭అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
18 Na hwa ma inabi na, ani ndu ndi katie meme, ndu Brji tsratsra shu ni yuwuu.
౧౮మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
19 Tre ni kpambi ni zabura ni se u brji tsratsra.
౧౯కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
20 Ngyri cacuu ni kpe wawuu, ni mi nde Baci Yesu kristi ru Rji tie mbu.
౨౦ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
21 Ndi ta ya kpambi ni sron ubi ni ndu wa bitie ni kristia.
౨౧క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
22 Imba kpa y'me ni ba lon mbi na ni Baci.
౨౨స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
23 Lilon atu uwa nawa kristi hi tu iklisiyaa.
౨౩క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
24 Wa iklisiya ni nu Baci tuma, imba game banu ba lon ba tumba.
౨౪సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
25 Lilon son mbabi na wa kristi son iklisiya nda nu tuma ni wua.
౨౫పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
26 a tite toki nda glau, na seu ni mma ni tre ma.
౨౬సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,
27 Nda nu tuma iklisiya ndindi, hamma ni shugru ni kpe bibi kima, ndu he tsra trame hamma ni latre
౨౭దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
28 Ni kon riri me ndu lilon son mba mba na kpambor lilon wa a son wwama, ason kpama.
౨౮అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
29 Injio na kran kpama na, ani mlanu tie, nawa kristi mlan iklisiya tiea.
౨౯ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
30 don kihi nghama kpama.
౩౦మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
31 Ahi ki ndu lilon ni ka tie ma, ni yima don nda kabi ni wama, hamba, ba kati kpa riri.
౩౧“ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”
32 Gbonji treyi riri (hidden) misi tre nitu kristi ni iklisiya.
౩౨ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
33 Toki, gbi gbi wawumbiu son wame na tume, gbigbi iwa ni nu lonma nikon
౩౩చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.