< 1 Yohana 2 >

1 Mri, mi si han kpi biyi ni yu'u du yina lahtre na. Uri ni ta lahtre ki hei ni di u kpa wo mbu ni wo timbu, wato yesu christy wa wu di riri wa ana latre na.
నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు.
2 Wa wu yi ni wur latre mbu laga ana'u mbu ni klembu na u gbugbu wawu.
మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం.
3 Kitoh di ki ye toh idan ki u tre ma.
ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది.
4 Indi wa atre di wawu toh Irji da na hu tre ma na a hi di wu che u jaji na hei ni suron ma na.
“నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు.
5 Indi wa a grji trema jaji hei wu ni Irji. Na yi ki toh di ki hei tare ni wu.
కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు.
6 Indi wa a tre di wa wu hei ni. Irji ka zre na wawu a zre a.
ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.
7 Mir ya, mina si han tre sisa ma ni yu'u na ahi cihe tre wa bi woh rimumal chiche tre a hi tre wa bi wo'a.
ప్రియులారా, నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు. ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే. ఈ పాత ఆజ్ఞ మీరు విన్న వాక్కే.
8 Misi han tre sa ma ni yu'u wa a jaji ni mi kristi ni mi mbi me, don ibwu a zren ka si hi kpama. u kpan u jaji a si kpan
అయినా, మీకు కొత్త ఆజ్ఞ రాస్తున్నాను. క్రీస్తులోనూ, మీలోనూ ఇది నిజమే. ఎందుకంటే చీకటి వెళ్ళిపోతూ ఉంది. నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తూ ఉంది.
9 Indi wa a tre di wawu hei ni mi kpan, da ni kran vayi ma ahei ni mi bwu, da si zre ni mi bwu har ni zizah.
తాను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు.
10 Indi wa a ni yiem vayi ma ahei ni mi kpan, ama kub zah na.
౧౦తన సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతడు తడబడి పడిపోయే అవకాశం లేదు.
11 Naki, i wa a nikra vayi ma ahei ni mi bwu da si zre ni mi bwu a na ton bubu wa a si hi na; don ibwu a ka shishi ma.
౧౧కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.
12 Mi si han ni yu'u mri, ba wur lahtre mbi hie ni yu'u ni tu de ma.
౧౨ప్రియమైన చిన్నపిల్లలారా! క్రీస్తు నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.
13 Mi si han ni yu'u bati dan bi yi bi toh wa ahei rji ni mumla, Mi si han ni yu'u mri ze don bi zan gbe ngbenlen ibrji, mi han ni yu'u mri don bi toh ti'a.
౧౩తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు సైతానుని ఓడించారు కాబట్టి మీకు రాస్తున్నాను.
14 Mi riga nan ni yuwu ba ti don bi toh ndia rji ni mumla, Mi riga han ni yu'u mrize don bi hei ni gbengbenlen, u tre Irji a hei ni yi, na ki bi zan gbengbenlen bi me me dri.
౧౪చిన్నపిల్లల్లారా, మీరు తండ్రిని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. తండ్రులారా, ఆరంభం నుంచీ ఉన్నవాడు మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో నిలిచి ఉంది, మీరు సైతానును ఓడించారు, అందుకే మీకు రాస్తున్నాను.
15 Na kpayiem ni kpi gbugbulu na, ni kpi bi wa ba hei ni mi gbugbulu 'a indi wa a ni son gbugbulu, i son 'u Irji na ni 'u na.
౧౫ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.
16 Du ikpi bi wa ba hei ni mi gbugbulu, ba bi nma kpa ba vo shishi, ni bi kpa di tsri, nu zu tu ba na rji ni ti na ba rji ni gbugbulu.
౧౬ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే.
17 Gbugbulun ni kpi bi wa a ni son ba si kle, indi wa a si ti du ni tre rji a ni son seisei nisei. (aiōn g165)
౧౭ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు. (aiōn g165)
18 Imir itoh a ye 'u kle, na wa bi woh bi kran kristi ba si ye zizan gbugbu'u ba ye. Na ki bi ka toh di itoh ye kle.
౧౮పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది.
19 Ba ryu ni mi mbu iki tsro di ba na hei ni ta na. Bana hei ni ta ba na san ni ta, da ba ni kpaba a tsro di bana hei ni ta na.
౧౯వారు మన దగ్గర నుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవారు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వారు మనకు సంబంధించినవారు కాదని కనబడుతూ ఉంది.
20 Bi hei ni anointing u rji ni tsa tsra ka bi toh wa wu bi.
౨౦కాని, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు.
21 Mi na han ni yuu di bina toh jaji na naki bi toh'o, iche na hei ni mi jaji na.
౨౧మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యం నుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను.
22 A hi gha hi ndi u'iche, a hi ndi wa ana kpayiem ni yesu da kristi na ndi ki ma hi wa ba kran yesu, wa ana toh ti'a mba ver a na.
౨౨యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి.
23 Indi wa ana yeini ni vre'a na a nato ti'a na. Indi wa a buh yun ma da kpa vre'a hei ni ti'a game.
౨౩కుమారుణ్ణి నిరాకరించిన ప్రతివాడికీ తండ్రి లేనట్టే. కుమారుణ్ణి ఒప్పుకున్న వాడికి తండ్రి ఉన్నట్టే.
24 Naki iwu du kpi wa'u woh rji ni mumla krie ni'u inde kpi wa u woh rji ni mumla ahei ni wu, in u' wu hei ni vre ba tima game.
౨౪మీరైతే, మొదటినుంచి ఏది విన్నారో అది మీలో నిలిచిపోయేలా చూసుకోండి. మొదటినుండీ విన్నది మీలో అలాగే నిలిచి ఉంటే, మీరు కుమారుడిలో, తండ్రిలో నిలిచి ఉంటారు.
25 Wa yi hi ikpie wa a chu yun ni ta wu ire u tutru. (aiōnios g166)
౨౫ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. (aiōnios g166)
26 Me han kpi bi yi yiwu du bari gru ye yi you ni nkon meme ma na.
౨౬ఇవన్నీ, మిమ్మల్ని తప్పు దారి పట్టించే వారిని గురించి రాశాను.
27 Naki u' ikpie wa'u kpa ni wu ahei ni wu, wuna si wa indio du ye tsro u na du Ruhu ma wa wu kpa tsro kpe ba wawu wa ba jaji bana che na, ni yada a tsro u son ni'u na ki me.
౨౭ఇక మీ విషయంలో, ఆయన నుండి అందుకున్న అభిషేకం మీలో నిలిచి ఉంది కాబట్టి, ఎవ్వరూ మీకు ఉపదేశం చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన అభిషేకం అన్నిటిని గూర్చి మీకు ఉపదేశం చేస్తుంది. ఆ అభిషేకం సత్యం. అది అబద్ధం కాదు. అది మీకు ఉపదేశం చేసిన విధంగా మీరు ఆయనలో నిలిచి ఉండండి.
28 Zizan mri son naki chachu wa aye ki hei ni gbengbenlen, ana shan ni tita niye ma na.
౨౮కాబట్టి పిల్లలూ, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం అయినప్పుడు, ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఆయనలో నిలిచి ఉండండి.
29 Inde wu toh da a hei ni kiklan suron, u ka toh di indi wa ani ti kpe wa a zizi ba grji di ki ma ni'u.
౨౯ఆయన నీతిమంతుడు అని మీకు తెలుసు కాబట్టి, నీతిని అనుసరించే వారందరూ ఆయన వల్ల పుట్టినవారని కూడా మీకు తెలుసు.

< 1 Yohana 2 >