< Gesami Hea:su 67 >
1 Gode! Ninima olofosu hou amola hahawane iasu hou ima. Ninima asigili ba: ma!
౧ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాద్యాలపై పాడేది. దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక
2 Amasea, osobo bagade fifi asi gala huluane da Dia hanai amo dawa: mu. Amola ilia huluane da Dia gaga: su hou dawa: mu.
౨భూమి మీద నీ మార్గాలు, జాతులన్నిటిలో నీ రక్షణ వెల్లడి అయ్యేలా అలా చేస్తాడు గాక.
3 Gode! Osobo bagade fifi asi gala dunu huluanedafa, ilia da Dima nodone sia: mu da defea.
౩దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక.
4 Osobo bagade fifi asi gala huluane da hahawane nodone gesami hea: mu da defea. Bai Dia da ilima fofada: su moloidafa hamosa. Amola Di da fifi asi gala huluane amo ilia ahoabe logo ilima olelesa.
౪ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు.
5 Gode! Osobo bagade fifi asi gala dunu huluanedafa, ilia da Dima nodone sia: mu da defea.
౫దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలందరు నిన్ను స్తుతిస్తారు గాక.
6 Ninia soge da ha: i manu gamima: ne denesi dagoi. Ninia Gode da ninima hahawane hamoi dagoi.
౬అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు.
7 Gode da ninima hahawane hamoi dagoi. Dunu huluanedafa habi esalebe Ema nodomu da defea.
౭దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.