< Süleymanin Məsəlləri 23 >
1 Bir ağa ilə süfrəyə əyləşəndə Qarşında olana yaxşı bax.
౧నీవు పరిపాలకునితో భోజనానికి కూర్చుంటే నీవెవరి సమక్షాన ఉన్నావో బాగా యోచించు.
2 İştahan çox olsa da, boğazına sərhəd qoy.
౨నీవు తిండిపోతువైనట్టయితే నీ గొంతుకకు కత్తి పెట్టుకో.
3 Onun ləziz xörəklərinə tamah salma, Çünki bu yemək adamı aldadar.
౩అతని రుచికరమైన భోజన పదార్థాలను ఆశించకు. అవి మోసకరమైనవి.
4 Sərvət qazanmaq üçün özünü əldən salma, İdraklı ol, bu fikirdən vaz keç.
౪ఐశ్వర్యవంతుడివి కావడానికి కాయకష్టం చేయకు. అలాటి ప్రయాస ఎప్పుడు చాలించుకోవాలో గ్రహించే జ్ఞానం నీకుండాలి.
5 Gözünü sərvətə diksən, yox olar, Birdən qanadlanar, uçub qartal tək göyə qalxar.
౫డబ్బుపై నీవు దృష్టి నిలిపినంతలోనే అది మాయమౌతుంది. హటాత్తుగా అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. గరుడ పక్షి ఆకాశానికి ఎగిరిపోయినట్టు అది ఎగిరి పోతుంది.
6 Xəsisin çörəyini yemə, Onun ləziz xörəklərinə tamah salma.
౬దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు.
7 O, ürəyində hər şeyin hesabını edər. Dilində sənə «ye, iç» deyər, Amma ürəyi ilə dili bir deyil.
౭ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు.
8 Yediyin loğmanı qusarsan, Dediyin bütün şirin sözlər boşa çıxar.
౮నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది.
9 Axmağın qulağına söz demə, Çünki sənin ağıllı sözlərinə xor baxar.
౯బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు.
10 Qədim sərhəd daşının yerini dəyişmə, Yetimlərin əkininə girmə.
౧౦పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేని వారి పొలంలోకి చొరబడవద్దు.
11 Çünki onların Hamisi qüvvətlidir, Səninlə olan münaqişəyə O baxar.
౧౧వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు.
12 Qəlbini tərbiyəyə, Qulaqlarını bilik sözlərinə ver.
౧౨ఉపదేశంపై మనస్సు ఉంచు. జ్ఞానయుక్తమైన మాటలు ఆలకించు.
13 Uşağa tərbiyə ver, bundan vaz keçmə, Tərbiyə kötəyi ona ölüm gətirməz.
౧౩నీ పిల్లలను శిక్షించడం మానవద్దు. బెత్తంతో వాణ్ణి కొట్టినట్టయితే వాడు చావడు.
14 Əgər sən onu kötəkləsən, Canını ölülər diyarından xilas edərsən. (Sheol )
౧౪బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. (Sheol )
15 Oğlum, ürəyin hikmətli olarsa, Mənim də ürəyim sevinər.
౧౫కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది.
16 Dilindən düz sözlər çıxarsa, Könlüm sevincdən cuşa gələr.
౧౬నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది.
17 Ürəyin günahkarlara qibtə etməsin, Ancaq bütün gün Rəbb qorxusu ilə yaşa.
౧౭పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు.
18 Sənin də bir aqibətin var, Ümidin boşa çıxmaz.
౧౮నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు.
19 Oğlum, dinlə, hikmətli ol, Qəlbini düz yola bağla.
౧౯కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో.
20 Şərab düşkünü olan əyyaşlara, Ət qapan qarınqululara qoşulma.
౨౦ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు.
21 Çünki əyyaş və qarınqulu yoxsullaşar, Yeyib-içib, məst olan cır-cındır içində qalar.
౨౧తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది.
22 Doğma atana qulaq as, Qoca anana xor baxma.
౨౨నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు.
23 Həqiqət al, onu satma, Hikməti, tərbiyəni, idrakı qoruyub-saxla.
౨౩సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో.
24 Salehin atası bolluca fərəhlənəcək, Hikmətlinin övladı onu sevindirəcək.
౨౪ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు.
25 Qoy ata-anan sevinsin, Səni doğan fərəhlənsin.
౨౫నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి.
26 Oğlum, ürəyini mənə yönəlt, Gözlərin mənim yollarımı nəzərdən keçirsin.
౨౬కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి.
27 Fahişə dərin bir çuxurdur, Yad arvad dar quyudur.
౨౭వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట.
28 Quldur kimi pusqu qurar, İnsanlar arasında xainləri artırar.
౨౮దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది.
29 Kimdir yaslı? Kimdir dərdli? Kimin münaqişəsi var? Kimin şikayəti var? Kim boş yerə yaralandı? Kimin gözləri qızarar?
౨౯ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు?
30 Şərab içməyə oturub qalxmayan, Gedib müxtəlif şərab dadanlar!
౩౦ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా.
31 Şərabın al rənginə, Qədəhdə parlamasına, rahat içilməsinə baxma.
౩౧ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు.
32 Axırda ilan kimi sancar, Əfi ilan kimi zəhərlər.
౩౨అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది.
33 Gözlərinə qəribə şeylər görünər, Qəlbinə əyri fikirlər gələr.
౩౩నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు.
34 Özünü dənizin ortasında sanarsan, Sanki gəmi dirəyinin başında yatmısan.
౩౪నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు.
35 Deyərsən: «Məni vurublar, hiss etməmişəm, Məni döyüblər, heç bilməmişəm. Yenə içmək üçün nə zaman ayılacağam?»
౩౫“నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు.