< أَيُّوبَ 19 >
فَأَجَابَ أَيُّوبُ وَقَالَ: | ١ 1 |
౧అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు,
«حَتَّى مَتَى تُعَذِّبُونَ نَفْسِي وَتَسْحَقُونَنِي بِٱلْكَلَامِ؟ | ٢ 2 |
౨మీరు నన్ను ఇలా ఎంతకాలం బాధపెడతారు? ఎంతకాలం మాటలతో నన్ను నలగగొడతారు?
هَذِهِ عَشَرَ مَرَّاتٍ أَخْزَيْتُمُونِي. لَمْ تَخْجَلُوا مِنْ أَنْ تَحْكِرُونِي. | ٣ 3 |
౩పదిసార్లు మీరు నన్ను నిందించారు. సిగ్గు లేకుండా నన్ను బాధిస్తూ ఉన్నారు.
وَهَبْنِي ضَلَلْتُ حَقًّا. عَلَيَّ تَسْتَقِرُّ ضَلَالَتِي! | ٤ 4 |
౪నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదికే వస్తుంది గదా?
إِنْ كُنْتُمْ بِٱلْحَقِّ تَسْتَكْبِرُونَ عَلَيَّ، فَثَبِّتُوا عَلَيَّ عَارِي. | ٥ 5 |
౫మిమ్మల్ని మీరే గొప్పచేసుకుంటున్నారా? నా మీద నేరం రుజువు చెయ్యాలని చూస్తున్నారా?
فَٱعْلَمُوا إِذًا أَنَّ ٱللهَ قَدْ عَوَّجَنِي، وَلَفَّ عَلَيَّ أُحْبُولَتَهُ. | ٦ 6 |
౬అయితే వినండి. దేవుడు నాపట్ల అన్యాయంగా ప్రవర్తించాడు. ఆయన తన వలలో నన్ను చిక్కించుకున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి.
هَا إِنِّي أَصْرُخُ ظُلْمًا فَلَا أُسْتَجَابُ. أَدْعُو وَلَيْسَ حُكْمٌ. | ٧ 7 |
౭నాకు అపకారం జరుగుతున్నదని నేను ఎంతగా మొరపెట్టినా ఎవ్వరూ నా మొర ఆలకించడం లేదు. సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను కానీ నాకు న్యాయం జరగడం లేదు.
قَدْ حَوَّطَ طَرِيقِي فَلَا أَعْبُرُ، وَعَلَى سُبُلِي جَعَلَ ظَلَامًا. | ٨ 8 |
౮ఆయన నా మార్గం చుట్టూ నేను దాట లేని కంచె వేశాడు. నా దారులన్నీ చీకటిమయం చేశాడు.
أَزَالَ عَنِّي كَرَامَتِي وَنَزَعَ تَاجَ رَأْسِي. | ٩ 9 |
౯ఆయన నా గౌరవ మర్యాదలను హీనంగా ఎంచాడు. నా తల మీద నుండి నా కిరీటం తొలగించాడు.
هَدَمَنِي مِنْ كُلِّ جِهَةٍ فَذَهَبْتُ، وَقَلَعَ مِثْلَ شَجَرَةٍ رَجَائِي، | ١٠ 10 |
౧౦అన్ని వైపుల నుండి ఆయన నన్ను దెబ్బతీశాడు. నేను పతనం అయ్యాను. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా ఆశాభావాన్ని పెళ్లగించాడు.
وَأَضْرَمَ عَلَيَّ غَضَبَهُ، وَحَسِبَنِي كَأَعْدَائِهِ. | ١١ 11 |
౧౧ఆయన తీవ్రమైన ఆగ్రహం నా మీద రగులుకుంది. నన్ను ఒక శత్రువుగా ఆయన భావించాడు.
مَعًا جَاءَتْ غُزَاتُهُ، وَأَعَدُّوا عَلَيَّ طَرِيقَهُمْ، وَحَلُّوا حَوْلَ خَيْمَتِي. | ١٢ 12 |
౧౨ఆయన సేనలు కూడి వచ్చి నా గుడారం చుట్టూ మాటువేశారు. నా చుట్టూ ముట్టడి దిబ్బలు వేశారు.
قَدْ أَبْعَدَ عَنِّي إِخْوَتِي، وَمَعَارِفِي زَاغُوا عَنِّي. | ١٣ 13 |
౧౩ఆయన నా బంధువర్గమంతా దూరమయ్యేలా చేశాడు. నా స్నేహితులు పూర్తిగా పరాయివాళ్ళు అయ్యారు.
أَقَارِبِي قَدْ خَذَلُونِي، وَٱلَّذِينَ عَرَفُونِي نَسُونِي. | ١٤ 14 |
౧౪నా బంధువులు నన్ను పరామర్శించడం లేదు. నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.
نُزَلَاءُ بَيْتِي وَإِمَائِي يَحْسِبُونَنِي أَجْنَبِيًّا. صِرْتُ فِي أَعْيُنِهِمْ غَرِيبًا. | ١٥ 15 |
౧౫నా యింటి దాసదాసీలు నన్ను పరాయివాణ్ణిగా చూస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఒక విదేశీయుడి వలే ఉన్నాను.
عَبْدِي دَعَوْتُ فَلَمْ يُجِبْ. بِفَمِي تَضَرَّعْتُ إِلَيْهِ. | ١٦ 16 |
౧౬నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడు పలకడం లేదు. నేను వాణ్ణి ప్రాధేయపడవలసి వచ్చింది.
نَكْهَتِي مَكْرُوهَةٌ عِنْدَ ٱمْرَأَتِي، وَخَمَمْتُ عِنْدَ أَبْنَاءِ أَحْشَائِي. | ١٧ 17 |
౧౭నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది. నా ఉనికి అంటేనే నా సొంత తోబుట్టువులకు ద్వేషం.
اَلْأَوْلَادُ أَيْضًا قَدْ رَذَلُونِي. إِذَا قُمْتُ يَتَكَلَّمُونَ عَلَيَّ. | ١٨ 18 |
౧౮చిన్నపిల్లలకు కూడా నేనంటే అసహ్యం. నేను కనబడితే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు.
كَرِهَنِي كُلُّ رِجَالِي، وَٱلَّذِينَ أَحْبَبْتُهُمُ ٱنْقَلَبُوا عَلَيَّ. | ١٩ 19 |
౧౯నా ప్రాణస్నేహితులందరూ నన్ను చూసి ఆసహ్యించుకుంటున్నారు. నేను ఇష్టపడిన వాళ్ళు నాకు శత్రువులయ్యారు.
عَظْمِي قَدْ لَصِقَ بِجِلْدِي وَلَحْمِي، وَنَجَوْتُ بِجِلْدِ أَسْنَانِي. | ٢٠ 20 |
౨౦నా ఎముకలు నా చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.
تَرَاءَفُوا، تَرَاءَفُوا أَنْتُمْ عَلَيَّ يَا أَصْحَابِي، لِأَنَّ يَدَ ٱللهِ قَدْ مَسَّتْنِي. | ٢١ 21 |
౨౧నా మీద జాలి పడండి. దేవుని హస్తం నన్ను పూర్తిగా దెబ్బతీసింది. నా స్నేహితులారా నా మీద జాలి చూపండి.
لِمَاذَا تُطَارِدُونَنِي كَمَا ٱللهُ، وَلَا تَشْبَعُونَ مِنْ لَحْمِي؟ | ٢٢ 22 |
౨౨నా శరీర మాంసం పూర్తిగా నాశనం అయ్యింది. ఇది చాలదన్నట్టు దేవుడు నన్ను హింసిస్తున్నట్టు మీరు కూడా నన్నెందుకు వేధిస్తున్నారు?
«لَيْتَ كَلِمَاتِي ٱلْآنَ تُكْتَبُ. يَا لَيْتَهَا رُسِمَتْ فِي سِفْرٍ، | ٢٣ 23 |
౨౩నా మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను.
وَنُقِرَتْ إِلَى ٱلْأَبَدِ فِي ٱلصَّخْرِ بِقَلَمِ حَدِيدٍ وَبِرَصَاصٍ. | ٢٤ 24 |
౨౪నా మాటలు నిరంతరం నిలిచి ఉండేలా శిలాక్షరాలై, ఇనుప గంటంతో చెక్కబడి, సీసం కరిగించి పోసి ఉంటే ఎంత బాగుంటుంది!
أَمَّا أَنَا فَقَدْ عَلِمْتُ أَنَّ وَلِيِّي حَيٌّ، وَٱلْآخِرَ عَلَى ٱلْأَرْضِ يَقُومُ، | ٢٥ 25 |
౨౫నా విమోచకుడు శాశ్వతంగా ఉండే వాడనీ, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడనీ నాకు తెలుసు.
وَبَعْدَ أَنْ يُفْنَى جِلْدِي هَذَا، وَبِدُونِ جَسَدِي أَرَى ٱللهَ. | ٢٦ 26 |
౨౬ఈ విధంగా నా చర్మం చీకి చీలికలైపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను.
ٱلَّذِي أَرَاهُ أَنَا لِنَفْسِي، وَعَيْنَايَ تَنْظُرَانِ وَلَيْسَ آخَرُ. إِلَى ذَلِكَ تَتُوقُ كُلْيَتَايَ فِي جَوْفِي. | ٢٧ 27 |
౨౭మరెవరో కాదు, నేనే నా కళ్ళతో స్వయంగా చూస్తాను. నా లోపలి భాగాలు కృశించిపోయాయి.
فَإِنَّكُمْ تَقُولُونَ: لِمَاذَا نُطَارِدُهُ؟ وَٱلْكَلَامُ ٱلْأَصْلِيُّ يُوجَدُ عِنْدِي. | ٢٨ 28 |
౨౮దీనంతటికీ మూల కారణం నాలోనే ఉన్నదన్న తప్పు భావంతో మీరు నన్ను ఎలా హింసిద్దామా అనుకుంటూ ఉండవచ్చు.
خَافُوا عَلَى أَنْفُسِكُمْ مِنَ ٱلسَّيْفِ، لِأَنَّ ٱلْغَيْظَ مِنْ آثَامِ ٱلسَّيْفِ. لِكَيْ تَعْلَمُوا مَا هُوَ ٱلْقَضَاءُ». | ٢٩ 29 |
౨౯అయితే మీరు ఖడ్గానికి భయపడాలి. దేవుడు పంపిన ఆగ్రహం అనే ఖడ్గం దోషులను శిక్షిస్తుంది. అప్పుడు దేవుని తీర్పు ఉంటుందని మీరు తెలుసుకుంటారు.