< Mikaⱨ 7 >
1 Mening ⱨalimƣa way! Qünki mǝn huddi yazdiki mewilǝr yiƣilip, Üzüm ⱨosulidin keyinki wasangdin keyin aq ⱪalƣan birsigǝ ohxaymǝn, Yegüdǝk sapaⱪ yoⱪtur; Jenim tǝxna bolƣan tunji ǝnjür yoⱪtur!
౧నాకెంతో బాధగా ఉంది! వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను.
2 Ihlasmǝn kixi zemindin yoⱪap kǝtti, Adǝmlǝr arisida durus birsimu yoⱪtur; Ularning ⱨǝmmisi ⱪan tɵküxkǝ paylimaⱪta, Ⱨǝrbiri ɵz ⱪerindixini tor bilǝn owlaydu.
౨భక్తులు దేశంలో లేకుండా పోయారు. ప్రజల్లో యథార్థపరుడు ఒకడూ లేడు. హత్య చేయడానికి అందరూ పొంచి ఉంటారు. ప్రతివాడూ తన తోటి దేశస్థుని వలలో చిక్కించాలని వేటాడుతూ ఉంటాడు.
3 Rǝzillikni puhta ⱪilix üqün, Ikki ⱪoli uningƣa tǝyyarlanƣan; Əmir «inam»ni soraydu, Soraⱪqimu xundaⱪ; Mɵtiwǝr janab bolsa ɵz jenining nǝpsini axkara eytip beridu; Ular jǝm bolup rǝzillikni toⱪuxmaⱪta.
౩వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి. అధికారి డబ్బులు అడుగుతాడు. న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు. గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు. ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.
4 Ularning ǝng esili huddi jiƣandǝk, Əng durusi bolsa, xohiliⱪ tosuⱪtin bǝttǝrdur. Əmdi kɵzǝtqiliring [ⱪorⱪup] kütkǝn kün, Yǝni [Huda] sanga yeⱪinlap jazalaydiƣan küni yetip kǝldi; Ularning alaⱪzadǝ bolup ketidiƣan waⱪti ⱨazir kǝldi.
౪వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, మీరు శిక్ష అనుభవించే రోజు. ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.
5 Ülpitinggǝ ixǝnmǝ, Jan dostungƣa tayanma; Aƣzingning ixikini ⱪuqiⱪingda yatⱪuqidin yepip yür.
౫ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు. ఏ స్నేహితుని మీదా నమ్మకం పెట్టుకోవద్దు. నీ కౌగిట్లో పడుకునే స్త్రీతో కూడా జాగ్రత్తగా మాట్లాడు.
6 Qünki oƣul atisiƣa biⱨɵrmǝtlik ⱪilidu, Ⱪiz anisiƣa, Kelin ⱪeyn anisiƣa ⱪarxi ⱪozƣilidu; Kixining düxmǝnliri ɵz ɵyidiki adǝmliridin ibarǝt bolidu.
౬కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు. కూతురు తన తల్లి మీద, కోడలు తన అత్త మీద ఎదురు తిరుగుతారు. తన సొంత ఇంటివారే తన శత్రువులు.
7 Biraⱪ mǝn bolsam, Pǝrwǝrdigarƣa ⱪarap ümid baƣlaymǝn; Nijatimni bǝrgüqi Hudani kütimǝn; Mening Hudayim manga ⱪulaⱪ salidu.
౭అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను. రక్షణకర్త అయిన నా దేవుని కోసం నేను కనిపెడతాను. నా దేవుడు నా మాట వింటాడు.
8 Manga ⱪarap hux bolup kǝtmǝ, i düxminim; Gǝrqǝ mǝn yiⱪilip kǝtsǝmmu, yǝnǝ ⱪopimǝn; Ⱪarangƣuluⱪta oltursam, Pǝrwǝrdigar manga yoruⱪluⱪ bolidu.
౮నా పగవాడా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినా తిరిగి లేస్తాను. నేను చీకట్లో కూర్చున్నపుడు యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు.
9 Mǝn Pǝrwǝrdigarning ƣǝzipigǝ qidap turimǝn — Qünki mǝn Uning aldida gunaⱨ sadir ⱪildim — U mening dǝwayimni sorap, mǝn üqün ⱨɵküm qiⱪirip yürgüzgüqǝ kütimǝn; U meni yoruⱪluⱪⱪa qiⱪiridu; Mǝn Uning ⱨǝⱪⱪaniyliⱪini kɵrimǝn.
౯నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, కాబట్టి ఆయన నా పక్షాన వాదించి నా పక్షాన న్యాయం తీర్చే వరకూ నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.
10 Wǝ mening düxminim buni kɵridu, Xuning bilǝn manga: «Pǝrwǝrdigar Hudaying ⱪeni» degǝn ayalni xǝrmǝndilik basidu; Mening kɵzüm uning [mǝƣlubiyitini] kɵridu; U koqidiki patⱪaⱪtǝk dǝssǝp qǝylinidu.
౧౦నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.
11 — Sening tam-sepilliring ⱪurulidiƣan künidǝ, Xu künidǝ sanga bekitilgǝn pasiling yiraⱪlarƣa yɵtkilidu.
౧౧నీ గోడలు కట్టించే రోజు వస్తుంది. ఆరోజు నీ సరిహద్దులు చాలా దూరం వరకూ విశాలమవుతాయి.
12 Xu künidǝ ular yeningƣa kelidu; — Asuriyǝdin, Misir xǝⱨǝrliridin, Misirdin [Əfrat] dǝryasiƣiqǝ, dengizdin dengizƣiqǝ wǝ taƣdin taƣƣiqǝ ular yeningƣa kelidu.
౧౨ఆ రోజు అష్షూరు దేశం నుంచి, ఐగుప్తు దేశపు పట్టణాల నుంచి, ఐగుప్తు మొదలు యూఫ్రటీసు నది వరకూ ఉన్న ప్రాంతం నుంచి, ఒక సముద్రం నుంచి మరో సముద్రం వరకూ ఒక పర్వతం నుంచి మరో పర్వతం వరకూ ఉన్న ప్రజలు నీ దగ్గరికి వస్తారు.
13 Biraⱪ yǝr yüzi bolsa ɵzining üstidǝ turuwatⱪanlar tüpǝylidin, Yǝni ularning ⱪilmixlirining mewisi tüpǝylidin harabǝ bolidu.
౧౩ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.
14 — Ɵz hǝlⱪingni, yǝni ormanda, Karmǝl otturisida yalƣuz turuwatⱪan Ɵz mirasing bolƣan padini, Tayaⱪ-ⱨasang bilǝn ozuⱪlandurƣaysǝn; Ⱪǝdimki künlǝrdikidǝk, Ular Baxan ⱨǝm Gilead qimǝnzarlirida ⱪaytidin ozuⱪlansun!
౧౪నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు.
15 — Sǝn Misir zeminidin qiⱪⱪan künlǝrdǝ bolƣandǝk, Mǝn ularƣa karamǝt ixlarni kɵrsitip berimǝn.
౧౫ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను ప్రజలకు అద్భుతాలు చూపిస్తాను.
16 Əllǝr buni kɵrüp barliⱪ ⱨǝywisidin hijil bolidu; Ⱪolini aƣzi üstigǝ yapidu, Ⱪulaⱪliri gas bolidu;
౧౬రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి. వాళ్ళు తమ నోటిమీద తమ చేతులు పెట్టుకుంటారు. వాళ్ళ చెవులు వినబడవు.
17 Ular yilandǝk topa-qangni yalaydu; Yǝr yüzidiki ɵmiligüqilǝrdǝk ɵz tɵxükliridin titrigǝn peti qiⱪidu; Ular ⱪorⱪup Pǝrwǝrdigar Hudayimizning yeniƣa kelidu, Wǝ sening tüpǝylingdinmu ⱪorⱪidu.
౧౭పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు. వాళ్ళు తమ గుహల్లోనుంచి భయంతో బయటికి వస్తారు. భయంతో మన యెహోవా దేవుని దగ్గరికి వస్తారు. నిన్నుబట్టి వాళ్ళు భయపడతారు.
18 Ⱪǝbiⱨlikni kǝqüridiƣan, Ɵz mirasi bolƣanlarning ⱪaldisining itaǝtsizlikidin ɵtidiƣan Tǝngridursǝn, U aqqiⱪini mǝnggügǝ saⱪlawǝrmǝydu, Qünki U meⱨir-muⱨǝbbǝtni huxalliⱪ dǝp bilidu. Kim sanga tǝngdax ilaⱨdur?
౧౮నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.
19 — U yǝnǝ bizgǝ ⱪarap iqini aƣritidu; Ⱪǝbiⱨliklirimizni U dǝssǝp qǝylǝydu; Sǝn ularning barliⱪ gunaⱨlirini dengiz tǝglirigǝ taxlaysǝn.
౧౯నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు. నీ పాదాల కింద మా అపరాధాలను నువ్వు తొక్కేస్తావు. మా పాపాలన్నిటినీ సముద్రం అడుగుకు నువ్వు పడవేస్తావు.
20 — Sǝn ⱪǝdimki künlǝrdin beri ata-bowilirimizƣa ⱪǝsǝm ⱪilƣan ⱨǝⱪiⱪǝt-sadaⱪǝtni Yaⱪupⱪa, Ɵzgǝrmǝs muⱨǝbbǝtni Ibraⱨimƣa yǝtküzüp kɵrsitisǝn.
౨౦నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.