< Єзекіїль 38 >

1 І було́ мені слово Господнє таке:
యెహోవా నాతో ఇలా చెప్పాడు.
2 „Сину лю́дський, зверни́ своє обличчя до Ґоґа, кра́ю Маґоґа, кня́зя Ро́шу, Мешеху та Тувалу, і пророкуй на нього
నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగు, అంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుని వైపు తిరిగి అతని గూర్చి ప్రవచించు.
3 та й скажеш: Так сказав Господь: Ось Я проти тебе, Ґоґу, кня́же Рошу, Мешеху та Тувалу!
“ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుడవైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
4 І заверну́ тебе, і вкладу́ гачки́ в ще́лепи твої, і ви́веду тебе та все ві́йсько твоє, ко́ней та верхівці́в, усі вони досконало озбро́єні, велике збо́рище, зо щита́ми та щитка́ми, усі озброєні меча́ми.
నేను నిన్ను వెనక్కి తిప్పి నీ దవడలకు గాలాలు తగిలించి, నిన్నూ నీ సైన్యాన్నీ గుర్రాలనూ ఆయుధ సామగ్రి అంతటితో నీ రౌతులందరినీ కవచాలు, డాళ్లు ధరించి ఖడ్గాలు చేతపట్టుకున్న వారందనీ మహా సైన్యంగా పంపిస్తాను.
5 Парас, Куш і Пут із ними, усі вони зо щито́м та з шо́ломом.
నీతో కూడ పర్షియా, కూషు, పూతు దేశాల వారినీ డాళ్ళు, శిరస్త్రాణాలు ధరించే వారినీ బయలుదేరదీస్తాను.
6 Ґомер і всі о́рди його, дім Тоґарми, кі́нці північні та всі відділи його, числе́нні наро́ди з тобою.
గోమెరు, అతని సైన్యం, ఉత్తరాన ఉండే తోగర్మా, అతని సైన్యం, ఇంకా అనేకమంది జనం నీతో వస్తారు.”
7 Приготу́йся, і приготу́й собі ти та все збо́рище твоє, зі́брані при тобі, і бу́деш для них сторо́жею.
“నీవు సిద్ధంగా ఉండడమే కాక, నీతో కలిసిన ఈ సమూహమంతటిని సిద్ధపరచి వారికి నాయకత్వం వహించు.
8 По багатьох днях ти бу́деш потрі́бний, у кінці ро́ків при́йдеш до Кра́ю, що пове́рнений від меча, що зі́браний від числе́нних наро́дів, на Ізраїлеві го́ри, що за́вжди були руїною, а він був ви́ведений від наро́дів, і всі вони сидять безпечно.
చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.
9 І ви́йдеш, при́йдеш як буря, будеш як хмара, щоб покрити землю, ти та всі відділи твої, та числе́нні наро́ди з тобою.
గాలివాన వచ్చినట్టు, మేఘం కమ్మినట్టు నీవు ఆ దేశం మీదికి వస్తావు. నీవు, నీ సైన్యం, నీతో కలిసిన విస్తారమైన జనాలు ఆ దేశం మీద కమ్ముకుంటారు.”
10 Так говорить Господь Бог: І станеться того дня, уві́йдуть слова́ на твоє серце, і ти бу́деш ду́мати злу ду́мку,
౧౦ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, ఆ కాలంలో నీ మనస్సులో చెడు తలంపులు కలుగుతాయి.
11 та й скажеш: Піду́ на неукріплений край, знайду́ спокійних, що безпечно сидять, усі вони сидять в оса́дах без муру, і нема в них за́сува та ворі́т,
౧౧నువ్వు దురాలోచనతో ఇలా అనుకుంటావు, నేను ప్రాకారాలు, అడ్డగడియలు, ద్వారాలు లేని దేశం పైకి వెళ్తాను. విశ్రాంతిగా, నిర్భయంగా నివసించే వారి మీదికి వెళ్తాను.
12 щоб набрати здо́бичі, і чинити грабу́нок, щоб повернути свою руку на заселені руїни, і на наро́д, зібраний з народів, що набувають добу́ток та маєток, що сидять посеред землі.
౧౨గతంలో పాడై మళ్ళీ నివాసయోగ్యమైన స్థలాల మీదికి వెళ్ళి, వారిని దోచుకుని కొల్లసొమ్ముగా పట్టుకుంటాను. వివిధ జనాల్లోనుండి తిరిగివచ్చి, పశువులు, ఆస్తులు సంపాదించి, భూమి నట్టనడుమ నివసించే ప్రజల మీదికి వెళ్తాను.
13 Шева та Дедан, і купці Таршішу, і всі левчуки́ його скажуть тобі: Чи ти прийшов набрати здо́бичі, чи ти зібрав своє збо́рище, щоб чинити грабу́нок, щоб ви́нести срібло та золото, щоб набрати добу́тку та маєтку, щоб набрати великої здо́бичі?
౧౩సెబావారు, దదానువారు, తర్షీషు వర్తకులు, వారి యోధులందరు నిన్ను చూసి “సొమ్ము దోచుకోడానికి వచ్చావా? కొల్లగొట్టడానికీ వెండి బంగారాలు, పశువులు, సరుకులు పట్టుకుపోడానికీ సైన్యం సమకూర్చుకుని వచ్చావా?” అని అడుగుతారు.
14 Тому́ пророкуй, сину лю́дський, та й скажеш до Ґоґа: Так говорить Господь Бог: Чи того дня, коли наро́д Мій сидітиме безпечно, ти не довідаєшся про це?
౧౪“కాబట్టి నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు, ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నిర్భయంగా జీవించే సమయం కనిపెట్టావు కదా?
15 І при́йдеш із свого місця, із півні́чних кінців, ти та числе́нні народи з тобою, — всі вони гарцю́ють на ко́нях, зборище велике й ві́йсько числе́нне!
౧౫దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి
16 І зді́ймешся на наро́д Мій Ізраїлів, як хмара, щоб покрити землю. Буде це на кінці днів, і ви́веду тебе на Мій Край, щоб наро́ди пізнали Мене, коли Я покажу́ Свою святість тобі, Ґоґу, на їхніх оча́х.
౧౬మేఘం భూమిని కమ్మినట్లు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పడతారు. చివరి రోజుల్లో అది జరుగుతుంది. గోగూ, అన్యజనాలు నన్ను తెలుసుకొనేలా నేను నా దేశం మీదికి నిన్ను రప్పించి నిన్నుబట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను.”
17 Так говорить Господь Бог: Чи ти той, що про нього говорив Я за давніх днів через Моїх рабів, Ізра́їлевих пророків, що пророкували за тих днів про роки́, щоб приве́сти тебе на них?
౧౭ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే “గతంలో ప్రతి సంవత్సరం నిన్ను వారిమీదికి రప్పిస్తానని నా సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చింది నేనే గదా?
18 І станеться того дня, у дні прихо́ду Ґоґа на Ізраїлеву землю, говорить Господь Бог, — уві́йде ревність Моя в ніздрі Мої.
౧౮ఆ రోజున, అంటే గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబోయే రోజున, నా కోపం విపరీతంగా మండుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
19 І в ревності своїй, в огні Свого гніву Я сказав: цього дня буде великий трус на Ізраїлевій землі.
౧౯“కాబట్టి నేను రోషంతో, మహా రౌద్రంతో ఈ విధంగా ప్రకటించాను, ఇశ్రాయేలీయుల దేశంలో గొప్ప భూకంపం కలుగుతుంది.
20 І затремтя́ть перед Моїм лицем мо́рські риби та птаство небесне, і польова́ звірина́, всяке гаддя́, що плазу́є по землі, і всяка люди́на, що на поверхні землі, і будуть поруйно́вані го́ри, і поваляться у́рвища, і всякий мур на землю впаде́.
౨౦సముద్రపు చేపలు, ఆకాశపక్షులు, భూజంతువులు, భూమిమీద పాకే పురుగులన్నీ, భూప్రజలంతా నాకు భయపడి వణుకుతారు. పర్వతాలు నాశనమౌతాయి, కొండ శిఖరాలు కూలిపోతాయి, గోడలన్నీ నేలకూలుతాయి.
21 І покличу проти нього меча на всіх го́рах Моїх, — говорить Господь Бог, — меч кожного буде на брата його!
౨౧నా పర్వతాలన్నిటిలో అతని మీదికి ఖడ్గం వచ్చేలా చేస్తాను. ప్రతి ఒక్కరి ఖడ్గం అతని సోదరుని మీద పడుతుంది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
22 І буду судитися з ними моровице́ю та кров'ю, і пущу́ заливни́й дощ та камі́нний град, огонь та сі́рку на нього та на відділи його, та на числе́нні народи, що з ним.
౨౨తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను.
23 І звели́чуся, і покажу́ Свою святість, і буду пі́знаний на оча́х числе́нних народів, і вони пізнають, що Я — Госпо́дь!
౨౩అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.

< Єзекіїль 38 >