< Nnwom 19 >
1 Wɔde ma dwomkyerɛfoɔ. Dawid dwom. Ɔsoro ka Onyankopɔn animuonyam ho asɛm! Ewiem pae mu ka ne nsa ano adwuma,
౧ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!
2 Ɛda biara, wɔkasa; anadwo biara, wɔkyerɛ nimdeɛ.
౨రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.
3 Ɔkasa anaa nsɛm nnim na wɔnnte wɔn nne.
౩వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.
4 Nanso wɔn asɛm akɔduru asase so mmaa nyinaa, wɔn nsɛm nso akɔduru asase ano. Wɔ ɔsoro hɔ, wasi ntomadan ama owia,
౪అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.
5 a ɔte sɛ ayeforɔkunu a ɔfiri ne pia mu, te sɛ ɔbrane a ne ho pere no sɛ ɔbɛtu ne mmirika.
౫సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.
6 Ɛpue wɔ ɔsoro fa baabi na atwa ne ho akɔsi ano; biribiara nhinta ne hyeɛ.
౬ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
7 Awurade mmara yɛ pɛ, ɛkanyane ɔkra no. Ahotosoɔ wɔ Awurade nhyehyɛeɛ mu, ɛma deɛ ɔnnim nyansa hunu nyansa.
౭యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
8 Awurade ahyɛdeɛ tene; ɛma akoma mu anigyeɛ. Awurade ɔhyɛ nsɛm mu da hɔ; na ɛbue ani.
౮యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.
9 Awurade suro yɛ kronn, ɛte hɔ daa. Awurade mmaransɛm yɛ nokorɛ na ne nyinaa tene.
౯యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.
10 Ɛsom bo sene sikakɔkɔɔ sene sikakɔkɔɔ amapa mpo; ɛyɛ dɛ sene ɛwoɔ, sene ɛwoɔ a ɛfiri ɛwokyɛm mu.
౧౦అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
11 Wɔnam so bɔ wo ɔsomfoɔ kɔkɔ sɛ, ɛsodie so akatua yɛ bebree.
౧౧వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
12 Hwan na ɔhunu nʼankasa mfomsoɔ? Fa me mfomsoɔ a ahinta kyɛ me.
౧౨తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.
13 Bɔ wʼakoa ho ban firi ɔboayɛ bɔne ho, na anhyɛ me so. Ɛno na ɛbɛma madi bem, a merenni fɔ wɔ bɔne akɛseɛ ho.
౧౩దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.
14 Ma mʼanom nsɛm ne mʼakoma mu mpaeɛbɔ nyɛ deɛ ɛsɔ wʼani, Ao Awurade me Botan ne me Gyefoɔ.
౧౪యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.