< Yeremia 42 >
1 Afei, asraafoɔ mpanimfoɔ no nyinaa a Karea babarima Yohanan ne Hosaia babarima Yesania ka ho ne nnipa no nyinaa, ɛfiri akumaa so kɔsi ɔkɛseɛ so kɔɔ
౧అప్పుడు కారేహ కుమారుడు యోహానానూ, హోషేయా కుమారుడు యెజన్యా, సైన్యాధిపతులందరూ ఇంకా గొప్పవారూ, సామాన్యులూ ప్రజలందరూ కలసి ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి వచ్చారు.
2 odiyifoɔ Yeremia nkyɛn kɔka kyerɛɛ no sɛ, “Yɛsrɛ wo, tie yɛn adesrɛ yi na bɔ Awurade wo Onyankopɔn mpaeɛ ma saa nkaeɛfoɔ yi nyinaa. Sɛdeɛ wohunu no, kane no na yɛdɔɔso nanso afei yɛaka kakraa bi.
౨వాళ్ళు అతనితో ఇలా అన్నారు. “నువ్వు చూస్తున్నట్టు మేం చాలా తక్కువ మందిమి. మా మనవిని చెవినబెట్టి మిగిలిన ఈ ప్రజల కోసం నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు.
3 Bɔ mpaeɛ sɛdeɛ Awurade wo Onyankopɔn bɛkyerɛ yɛn baabi a ɛsɛ sɛ yɛkɔ ne deɛ ɛsɛ sɛ yɛyɛ.”
౩మేం ఏ మార్గాన వెళ్ళాలో, ఏం చేయాలో నీ దేవుడైన యెహోవాను అడిగి మాకు తెలియజేయి.”
4 Yeremia buaa wɔn sɛ, “Mate mo asɛm no, na ɛkwan biara so mɛbɔ Awurade mo Onyankopɔn mpaeɛ sɛdeɛ mo asrɛ no; mɛka deɛ Awurade bɛka biara akyerɛ mo na meremfa hwee nsie mo.”
౪కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా వాళ్లకిలా చెప్పాడు. “మీరు చెప్పింది విన్నాను. చూడండి, మీరు అభ్యర్ధించినట్టే నేను మీ దేవుడైన యెహోవాను ప్రార్ధిస్తాను. యెహోవా ఏం జవాబిచ్చాడో అది ఏదీ దాచకుండా మీకు చెప్తాను.”
5 Na afei, wɔka kyerɛɛ Yeremia sɛ, “Sɛ yɛanyɛ deɛ Awurade wo Onyankopɔn soma wo sɛ ka kyerɛ yɛn no a, ma ɔnyɛ ɔdanseni nokwafoɔ ntia yɛn.
౫వాళ్ళు యిర్మీయాతో ఇలా అన్నారు. “నీ దేవుడైన యెహోవా మాకు చెప్పినదంతా మేం చేయకపోతే అప్పుడు యెహోవా మాకు వ్యతిరేకంగా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటాడు గాక.
6 Sɛ yɛpɛ o, sɛ yɛmpɛ o, yɛbɛyɛ ɔsetie ama Awurade yɛn Onyankopɔn a yɛresoma wo wɔ ne nkyɛn no, sɛdeɛ ɛbɛsi yɛn yie, na yɛbɛdi Awurade yɛn Onyankopɔn asɛm so.”
౬అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.”
7 Dadu akyi no, Awurade asɛm baa Yeremia hɔ.
౭పది రోజుల తర్వాత యెహోవా వాక్కు యిర్మీయా దగ్గరికి వచ్చింది.
8 Enti, ɔfrɛɛ Karea babarima Yohanan ne asraafoɔ mpanimfoɔ a wɔka ne ho ne nnipa no nyinaa; ɛfiri akumaa so kɔsi ɔkɛseɛ so.
౮కాబట్టి అతడు కారేహ కొడుకు యోహానానునూ, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, ఇంకా గొప్పవారూ, సామాన్యులూ అయిన ప్రజలందర్నీ తన దగ్గరికి పిలిచాడు.
9 Na ɔka kyerɛɛ wɔn sɛ, “Yei ne deɛ Awurade, Israel Onyankopɔn a mosomaa me sɛ memfa mo adesrɛ nkɔto nʼanim no seɛ:
౯వారికిలా చెప్పాడు. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దగ్గర మీ కోసం ప్రార్ధించడానికి మీరు నన్ను పంపారు. ఆయన ఇలా చెప్పాడు.
10 ‘Sɛ motena asase yi so a, mɛsiesie mo na merensɛe mo, mɛdua mo na merentu mo ase, ɛfiri sɛ me werɛ aho wɔ amanehunu a mama aba mo so no ho.
౧౦‘మీరు వెనక్కి వెళ్లి ఈ దేశంలోనే నివసించినట్లయితే నేను మిమ్మల్ని నిర్మిస్తాను. మిమ్మల్ని చీల్చివేయను. మిమ్మల్ని నాటుతాను గానీ పెకలించి వేయను. మీ పైకి నేను తెచ్చిన విపత్తును తప్పిస్తాను.
11 Monnsuro Babiloniahene a seesei mosuro noɔ no. Monnsuro no, Awurade na ɔseɛ, ɛfiri sɛ, me ne mo wɔ hɔ, mɛgye mo, na mayi mo afiri ne tumi ase.
౧౧మీరు బబులోను రాజుకు భయపడుతూ ఉన్నారు. అతనికి భయపడకండి.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘మిమ్మల్ని రక్షించడానికీ, అతని చేతిలో నుండి తప్పించడానికీ నేను మీతో ఉన్నాను కాబట్టి అతనికి భయపడకండి.
12 Mɛhu mo mmɔbɔ na ɔno nso ahu mo mmɔbɔ na ɔde mo asane aba mo asase so.’
౧౨నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ పైన కనికరపడతాను. మీ దేశానికి తిరిగి మిమ్మల్ని తీసుకువస్తాను.’
13 “Nanso sɛ moka sɛ, ‘Yɛrentena saa asase yi so,’ na ne saa enti moanyɛ ɔsetie amma Awurade mo Onyankopɔn,
౧౩అయితే ఒకవేళ మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో మీ దేవుడైన యెహోవానైన నా మాట వినకుండా ‘మేం ఈ దేశంలో నివసించం,’ అన్నారనుకోండి,
14 na moka sɛ, ‘Dabi, yɛbɛkɔ akɔtena Misraim, baabi a yɛrenhunu ɔko, na yɛrente totorobɛnto nnyegyeeɛ na aduanekɔm nne yɛn a,’
౧౪లేదా మీరు ‘ఇక్కడ కాదు. మనం ఐగుప్తు దేశానికి వెళ్దాం. అక్కడ ఎలాంటి యుద్ధమూ చూడం, అక్కడ యుద్ధ భేరీనాదం వినం, ఆహారం కోసం ఆకలితో ఉండం. మనం అక్కడే నివసిద్దాం’ అనుకోవచ్చు కూడా.
15 ɛnneɛ tie Awurade asɛm, Ao Yuda nkaeɛfoɔ. Yei ne deɛ Asafo Awurade Israel Onyankopɔn seɛ, ‘Sɛ moayɛ mo adwene sɛ mobɛkɔ akɔtena Misraim, na sɛ monya kɔtena hɔ a,
౧౫యూదా ప్రజల్లో మిగిలి ఉన్న వారు యెహోవా చెప్పే ఈ మాట వినండి. సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. మీరు ఒకవేళ ఐగుప్తులో నివసించడానికి వెళ్లాలని నిర్ణయం చేసుకుంటే,
16 ɛnneɛ akofena a mosuro no bɛto mo wɔ hɔ na ɛkɔm a mo akoma tu wɔ ho no bɛdi mo akyi akɔ Misraim, na ɛhɔ na mobɛwuwu.
౧౬మీరు భయపడుతున్న కత్తి ఐగుప్తులో మిమ్మల్ని కలుసుకుంటుంది. మీరు చింతించే కరువు మీ వెనుకే ఐగుప్తు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు అక్కడే చనిపోతారు.
17 Nokorɛm, wɔn a wɔasi wɔn adwene pi sɛ wɔbɛkɔ Misraim akɔtena hɔ no bɛwuwu wɔ akofena, ɛkɔm ne ɔyaredɔm ano, na wɔn mu baako mpo renka anaa ɔrennwane mfiri amanehunu a mede bɛba wɔn so no mu.’
౧౭కాబట్టి ఐగుప్తులో నివసించాలని నిర్ణయం తీసుకుని అక్కడకు వెళ్ళే వాళ్ళు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. నేను వాళ్ళ పైకి పంపించే ఆపద నుండి ఎవరూ తప్పించుకోరు. ఎవరూ మిగిలి ఉండరు.”
18 Yei ne deɛ Asafo Awurade, Israel Onyankopɔn seɛ, ‘Sɛdeɛ mʼabufuo ne mʼabufuhyeɛ hwie guu nnipa a wɔwɔ Yerusalem soɔ no, saa ara na sɛ mokɔ Misraim a, mʼabufuhyeɛ bɛhwie agu mo so. Mobɛyɛ nnomedeɛ, ahodwiredeɛ, afɔbuo ne ahohora; morenhunu saa beaeɛ yi bio.’
౧౮ఎందుకంటే సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “యెరూషలేము నివాసుల పైకి నా తీవ్ర కోపమూ, నా ఉగ్రతా వచ్చినట్టే, మీరు ఐగుప్తుకు వెళ్ళినట్టయితే మీ మీద కూడా నా క్రోధాన్ని కుమ్మరిస్తాను. మీరు శాపానికి గురౌతారు. మీరు భయాన్ని పుట్టించే వాళ్ళుగా ఉంటారు. దూషణ పాలవుతారు. ఈ స్థలాన్ని మీరు ఇక మీదట చూడరు.
19 “Ao Yuda nkaeɛfoɔ, Awurade aka akyerɛ mo sɛ, ‘Monnkɔ Misraim.’ Mommma mo werɛ mfiri. Ɛnnɛ merebɔ mo kɔkɔ
౧౯యూదా ప్రజల్లో మిగిలి ఉన్న మీ కోసం యెహోవా చెప్తున్నాడు. ఐగుప్తుకు వెళ్ళకండి! ఈ రోజు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం నేనే అని మీకు తెలుసు.
20 sɛ moyɛɛ mfomsoɔ a ɛyɛ hu yie ɛberɛ a mosomaa me kɔɔ Awurade mo Onyankopɔn hɔ, na mokaa sɛ, ‘Bɔ Awurade yɛn Onyankopɔn mpaeɛ ma yɛn, na ka deɛ ɔka biara kyerɛ yɛn, na yɛbɛyɛ,’ no.
౨౦‘మా కోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు. మన దేవుడైన యెహోవా చెప్పినదంతా మాకు తెలియజెయ్యి. మేం దాన్ని జరిగిస్తాం’ అంటూ మీరే యిర్మీయా అనే నన్ను మీ దేవుడైన యెహోవా దగ్గరికి పంపించారు. కాబట్టి మీరు మీ ప్రాణాలనే చెల్లించాల్సి ఉంటుంది.
21 Ɛnnɛ, maka akyerɛ mo, nanso monyɛɛ ɔsetie mmaa Awurade mo Onyankopɔn ara wɔ biribiara a ɔhyɛɛ me sɛ menka nkyerɛ mo no ho.
౨౧ఈ రోజు నేను మీకు తెలియజేశాను. కానీ మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు. ఆయన నా ద్వారా మీకు తెలియజేసిన వాటిలో దేనినీ వినలేదు.
22 Enti, afei mommma mo werɛ mfiri sɛ mobɛwuwu wɔ akofena, ɛkɔm ne ɔyaredɔm ano wɔ baabi a mopɛ sɛ mokɔtena hɔ no.”
౨౨కాబట్టి ఎక్కడ నివాసముండాలని మీరు కోరుకుంటున్నారో అక్కడే మీరు కత్తి మూలంగానో, కరువు మూలంగానో, వ్యాధి మూలంగానో చనిపోతారు. అది మీకు తప్పకుండా తెలుసుకోవాలి.”