< Nnwom 141 >
1 Dawid dwom. Awurade, misu frɛ wo, bra me nkyɛn ntɛm so. Sɛ misu frɛ wo a, gye me so.
౧దావీదు కీర్తన యెహోవా, నేను నీ కోసం ఆక్రోశిస్తున్నాను. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను ఆదుకో. నేను మొరపెడుతున్నాను, నేను చెప్పేది ఆలకించు.
2 Ma me mpaebɔ mmra wʼanim sɛ aduhuam; ma me nsa a mema so no nyɛ sɛ anwummere afɔrebɔ.
౨నా ప్రార్థన నీకు ధూపం లాగా నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యం లాగా ఉండు గాక.
3 Awurade, ma ɔwɛmfo nwɛn mʼano; na wɛn mʼano pon.
౩యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.
4 Mma wɔnntwe me koma nnkɔ nea ɛyɛ bɔne ho, na ankɔyɛ nea amumɔyɛfo yɛ no bi, mma me ne abɔnefo nni wɔn nnɔkɔnnɔkɔwade.
౪నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక.
5 Ma ɔtreneeni mmɔ me, ɛyɛ ayamye; ma ɔnka mʼanim, ɛyɛ me ti so ngo. Me ti rempo. Me mpaebɔ da so tia abɔnefo nneyɛe daa.
౫నీతిమంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే. వాళ్ళు నన్ను మందలిస్తే అది నా తలకి నూనె రాసినట్టే. అలాంటి దాన్ని నేను అంగీకరిస్తాను. నా ప్రార్థనలు మాత్రం దుర్మార్గుల క్రియలకు వ్యతిరేకంగా ఉంటాయి.
6 Wɔbɛtow wɔn sodifo afi ɔbotan so abɛhwe fam; na amumɔyɛfo behu sɛ me nsɛm no yɛ nokware.
౬దుర్మార్గుల నాయకులను కొండల అంచుల నుండి పడదోస్తారు. అప్పుడు ప్రజలు నా ఇంపైన మాటలు వినేందుకు వస్తారు.
7 Wɔbɛka se, “Sɛnea obi funtum na otutu asase no, saa ara na wɔabɔ yɛn nnompe ahwete ɔda ano.” (Sheol )
౭వారు అంటారు, ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. (Sheol )
8 Nanso Otumfo Awurade, mʼani wɔ wo so; wo mu na mihintaw, nnyaw me mma owu.
౮యెహోవా, నా ప్రభూ, నా కళ్ళు నీవైపే చూస్తున్నాయి. నిన్నే శరణు వేడుకొంటున్నాను. నా ప్రాణానికి భద్రత కలిగించు.
9 Bɔ me ho ban fi mfiri a wɔasunsum me no ho, mfiri a abɔnefo asunsum no.
౯నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు.
10 Ma amumɔyɛfo no ankasa ɔtan nyi wɔn, bere a mitwa mu kɔ dwoodwoo no.
౧౦నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక.