< కీర్తనల~ గ్రంథము 94 >
1 ౧ ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
Boże zemsty, PANIE Boże zemsty, objaw się!
2 ౨ లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు.
Powstań, Sędzio [całej] ziemi, odpłać pysznym.
3 ౩ యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు?
Jak długo niegodziwi, PANIE, jak długo niegodziwi będą się radować?
4 ౪ వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
[Jak długo] będą pleść, mówić zuchwale i chełpić się wszyscy czyniący nieprawość?
5 ౫ యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు.
Depczą twój lud, PANIE, i gnębią twoje dziedzictwo.
6 ౬ వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు.
Mordują wdowy i przybysza, zabijają sieroty.
7 ౭ వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు.
I mówią: PAN tego nie widzi, nie dostrzega tego Bóg Jakuba.
8 ౮ బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు?
Zrozumcie, nierozumni wśród ludu! A wy, głupcy, kiedy zmądrzejecie?
9 ౯ చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా?
Czy ten, który wszczepił ucho, nie słyszy? Czy ten, który ukształtował oko, nie widzi?
10 ౧౦ రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.
Czy ten, który chłoszcze narody, nie będzie karał? [Ten], który uczy człowieka wiedzy, [czy nie wie]?
11 ౧౧ మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు.
PAN zna myśli ludzkie; [wie], że są marnością.
12 ౧౨ యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
Błogosławiony mąż, którego ty chłoszczesz, PANIE, i uczysz go twym prawem;
13 ౧౩ దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు.
Aby dać mu odpocząć od złych dni, aż będzie wykopany dół dla niegodziwego.
14 ౧౪ యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
PAN bowiem nie odrzuci swego ludu i nie opuści swego dziedzictwa.
15 ౧౫ న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు.
Ale sąd powróci do sprawiedliwości, a wszyscy serca prawego [pójdą] za nim.
16 ౧౬ దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు?
Któż stanie przy mnie przeciwko złoczyńcom? Kto ujmie się za mną przeciwko czyniącym nieprawość?
17 ౧౭ యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
Gdyby PAN nie przyszedł mi z pomocą, moja dusza przebywałaby w milczeniu.
18 ౧౮ నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
Gdy powiedziałem: Moja noga się chwieje, twoje miłosierdzie, PANIE, mnie wsparło.
19 ౧౯ నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
W niezliczonych myślach mego serca twoje pociechy rozweselają moją duszę.
20 ౨౦ దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.
Czy sprzymierzy się z tobą tron nieprawości, który wyrządza krzywdę pod pozorem prawa?
21 ౨౧ వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు.
Zbierają się przeciw duszy sprawiedliwego i krew niewinną potępiają.
22 ౨౨ అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
Lecz PAN jest moją twierdzą, mój Bóg – skałą mojej ucieczki.
23 ౨౩ ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.
On obróci przeciwko nim ich nieprawość i za ich zło ich wytraci; wytraci ich PAN, nasz Bóg.