< కీర్తనల~ గ్రంథము 49 >
1 ౧ ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
Zborovođi. Sinova Korahovih. Psalam. Poslušajte ovo, svi narodi, čujte, svi stanovnici zemlje,
2 ౨ అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
vi, djeco puka, i vi, odličnici, bogati i siromašni zajedno!
3 ౩ నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
Moja će usta zboriti mudrost, i moje srce misli razumne.
4 ౪ ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
K poučnoj izreci priklonit ću uho, uz harfu ću izložit' svoju zagonetku.
5 ౫ నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
Što da se bojim u danima nesreće kad me opkoli zloba izdajica
6 ౬ వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
koji se u blago svoje uzdaju i silnim se hvale bogatstvom?
7 ౭ వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
TÓa nitko sebe ne može otkupit' ni za se dati Bogu otkupninu:
8 ౮ ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
životu je cijena previsoka, i nikada je neće platiti
9 ౯ ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
tko želi živjeti dovijeka i ne vidjeti jamu grobnu.
10 ౧౦ వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
Jer, i mudri umiru, pogiba i luđak i bezumnik: bogatstvo svoje ostavlja drugima.
11 ౧౧ వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
Grobovi im kuće zasvagda, stanovi njihovi od koljena do koljena, sve ako se zemlje nazivale imenima njihovim.
12 ౧౨ కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
Čovjek koji nerazumno živi sličan je stoci koja ugiba.
13 ౧౩ ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.
Takav je put onih koji se ludo uzdaju, to je konac onih koji uživaju u sreći:
14 ౧౪ వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది. (Sheol )
Poput stada redaju se u Podzemlju, smrt im je pastir, a dobri njima vladaju. Njihova će lika brzo nestati, Podzemlje će im biti postojbina. (Sheol )
15 ౧౫ అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు. (Sheol )
A moju će dušu Bog ugrabiti Podzemlju iz pandža i milostivo me primiti. (Sheol )
16 ౧౬ ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.
Ne boj se ako se tko obogati i ako se poveća blago doma njegova:
17 ౧౭ ఎందుకంటే వాడు చనిపోయేటప్పుడు దేన్నీ తీసుకువెళ్ళడు. వాడి ప్రభావం వాడి వెంట దిగిపోదు.
kad umre, ništa neće ponijeti sa sobom, i blago njegovo neće s njime sići.
18 ౧౮ మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
Ako se u životu držao sretnim - “Govorit će se da ti je dobro bilo!” -
19 ౧౯ అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు.
i on će doći u skup otaca svojih, gdje svjetlosti više vidjeti neće.
20 ౨౦ ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు.
Čovjek koji nerazumno živi sličan je stoci koja ugiba.