< కీర్తనల~ గ్రంథము 19 >
1 ౧ ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!
Zborovođi. Psalam. Davidov. Nebesa slavu Božju kazuju, naviješta svod nebeski djelo ruku njegovih.
2 ౨ రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.
Dan danu to objavljuje, a noć noći glas predaje.
3 ౩ వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.
Nije to riječ, a ni govor nije, nije ni glas što se može čuti,
4 ౪ అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.
al' po zemlji razliježe se jeka, riječi sve do nakraj svijeta sežu. Ondje suncu razape šator,
5 ౫ సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.
te ono k'o ženik iz ložnice ide, k'o div kliče kad prelijeće stazu.
6 ౬ ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
Izlazi ono od nebeskog kraja, i put mu se opet s krajem spaja, ne skriva se ništa žaru njegovu.
7 ౭ యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
Savršen je Zakon Jahvin - dušu krijepi; pouzdano je Svjedočanstvo Jahvino - neuka uči;
8 ౮ యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.
prÓava je naredba Jahvina - srce sladi; čista je zapovijed Jahvina - oči prosvjetljuje;
9 ౯ యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.
neokaljan strah Jahvin - ostaje svagda; istiniti sudovi Jahvini - svi jednako pravedni,
10 ౧౦ అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
dragocjeniji od zlata, od zlata čistoga, slađi od meda, meda samotoka.
11 ౧౧ వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
Sluga tvoj pomno na njih pazi, vrlo brižno on ih čuva.
12 ౧౨ తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.
Ali tko propuste svoje da zapazi? Od potajnih grijeha očisti me!
13 ౧౩ దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.
Od oholosti čuvaj slugu svoga da mnome ne zavlada. Tad ću biti neokaljan, čist od grijeha velikoga.
14 ౧౪ యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.
Moje ti riječi omiljele i razmišljanje srca moga pred licem tvojim. Jahve, hridi moja, otkupitelju moj!