< కీర్తనల~ గ్రంథము 144 >

1 దావీదు కీర్తన నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి. నా చేతులకు, వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే.
مزمور داود خداوند که صخره من است، متبارک باد! که دستهای مرا به جنگ وانگشتهای مرا به حرب تعلیم داد!۱
2 నీవే నా నిబంధన విశ్వసనీయుడివి, నా దుర్గానివి. ఆయనే నన్ను కాపాడే ఎత్తయిన నా గోపురం. నేను దాగి ఉండే నా డాలు ఆయనే. ఆయన పైనే నేను ఆధారపడతాను. జాతులు నాకు లోబడేలా అణిచేవాడు యెహోవానే.
رحمت من اوست و ملجای من و قلعه بلند من و رهاننده من وسپر من و آنکه بر او توکل دارم، که قوم مرا در زیراطاعت من می‌دارد.۲
3 యెహోవా, నువ్వు మనుషులను లక్ష్యపెట్టడానికి వాళ్ళు ఎంతటి వాళ్ళు? వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళకున్న అర్హత ఏమిటి?
‌ای خداوند، آدمی چیست که او را بشناسی؟ و پسر انسان که او را به حساب بیاوری؟۳
4 మనిషి కేవలం శ్వాస వంటివాడు. వాళ్ళ రోజులు కదిలిపోతున్న నీడలాగా ఉన్నాయి.
انسان مثل نفسی است و روزهایش مثل سایه‌ای است که می‌گذرد.۴
5 యెహోవా, ఆకాశాలను కృంగజేసి కిందికి దిగిరా. పర్వతాలను తాకి అవి పొగలు వెళ్ళగక్కేలా చెయ్యి.
‌ای خداوند آسمانهای خود را خم ساخته، فرود بیا. و کوهها را لمس کن تا دود شوند.۵
6 మెరుపులు మెరిపించి శత్రువులను చెదరగొట్టు. నీ బాణాలు వేసి వాళ్ళను ఓడించు.
رعدرا جهنده ساخته، آنها را پراکنده ساز. تیرهای خود را بفرست و آنها را منهزم نما.۶
7 ఆకాశం నుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు.
دست خودرا از اعلی بفرست، و مرا رهانیده، از آبهای بسیارخلاصی ده، یعنی از دست پسران اجنبی.۷
8 వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి.
که دهان ایشان به باطل سخن می‌گوید، و دست راست ایشان، دست دروغ است.۸
9 దేవా, నిన్ను గురించి నేనొక కొత్త గీతం పాడతాను. పదితంతుల సితారా మోగిస్తూ నిన్ను కీర్తిస్తాను.
‌ای خدا، تو راسرودی تازه می‌سرایم. با بربط ذات ده تار، تو راترنم خواهم نمود.۹
10 ౧౦ రాజులకు విజయం ఇచ్చేది నువ్వే. దుర్మార్గుల కత్తివేటు నుండి నీ సేవకుడైన దావీదును తప్పించే వాడివి నువ్వే.
که پادشاهان را نجات می‌بخشی، و بنده خود داود را از شمشیر مهلک می‌رهانی.۱۰
11 ౧౧ విదేశీయుల చేతుల్లోనుంచి నన్ను విడిపించు. వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి.
مرا از دست اجنبیان برهان و خلاصی ده، که دهان ایشان به باطل سخن می‌گوید. و دست راست ایشان دست دروغ است.۱۱
12 ౧౨ యవ్వనంలో ఉన్న మా కొడుకులు మొక్కల్లాగా ఏపుగా ఎదగాలి. మా కూతుళ్ళు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లాగా ఉండాలి.
تا پسران ما در جوانی خود نمو کرده، مثل نهالها باشند. ودختران ما مثل سنگهای زاویه تراشیده شده به مثال قصر.۱۲
13 ౧౩ మా గోదాముల్లో రకరకాల ధాన్య నిధులు నిండాలి. మా పచ్చిక మైదానాల్లో మా గొర్రెలు వేలు, పదివేలు పిల్లలు పెట్టాలి.
و انبارهای ما پر شده، به انواع نعمت ریزان شوند. و گله های ما هزارها و کرورهادر صحراهای ما بزایند.۱۳
14 ౧౪ అప్పుడు మా పశువులు ఎన్నో దూడలు ఈనతాయి. అవేవీ మా కంచెలు విరగ్గొట్టుకుని పరుగులెత్తకుండా ఉండాలి. మా వీధుల్లో ఎలాటి గలాటా ఉండకూడదు.
و گاوان ما باربردارشوند و هیچ رخنه و خروج و ناله‌ای درکوچه های ما نباشد.۱۴
15 ౧౫ ఇలాంటి దీవెనలు గల ప్రజలు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో వాళ్ళు ధన్యజీవులు.
خوشابحال قومی که نصیب ایشان این است. خوشابحال آن قوم که یهوه خدای ایشان است.۱۵

< కీర్తనల~ గ్రంథము 144 >