< కీర్తనల~ గ్రంథము 127 >
1 ౧ సొలొమోను రాసిన యాత్రల కీర్తన యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టే వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా ఉండకపోతే దాన్ని కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉండడం వ్యర్ధం.
Hodočasnička pjesma. Salomonova. Ako Jahve kuću ne gradi, uzalud se muče graditelji. Ako Jahve grad ne čuva, uzalud stražar bdi.
2 ౨ మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.
Uzalud vam je ustat prije zore i dugo u noć sjediti, vi što jedete kruh muke: miljenicima svojim u snu on daje.
3 ౩ చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
Evo: sinovi su Jahvin dar, plod utrobe njegova je nagrada.
4 ౪ యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు.
Strelica u ruci ratnika - to su sinovi mladosti.
5 ౫ వారితో తన అంబులపొది నింపుకున్న మనిషి ధన్యుడు. వాళ్ళు గుమ్మంలో తమ విరోధులను ఎదిరించి నిలబడినప్పుడు అవమానం పాలు కారు.
Blago čovjeku koji njima napuni tobolac, neće se postidjeti kad se prÓeo bude s dušmanom na vratima.