< సామెతలు 6 >
1 ౧ కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు,
Sine moj, kad jamčiš bližnjemu svojem i daš svoju ruku drugome,
2 ౨ నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.
vezao si se vlastitim usnama, uhvatio se riječima svojih usta;
3 ౩ కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.
učini onda ovo, sine moj: oslobodi se! Jer si dopao u ruke bližnjemu svojemu; idi, baci se preda nj i salijeći bližnjega svoga.
4 ౪ నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.
Ne daj sna svojim očima ni drijema svojim vjeđama;
5 ౫ వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.
otmi se kao gazela iz mreže i kao ptica iz ruku ptičaru.
6 ౬ సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో.
Idi k mravu, lijenčino, promatraj njegove pute i budi mudar:
7 ౭ వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు.
on nema vođe, nadzornika, ni nadstojnika,
8 ౮ అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి.
ljeti se sebi brine za hranu i prikuplja jelo u doba žetve.
9 ౯ సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు?
A ti, dokle ćeš, lijenčino, spavati? Kad ćeš se dići oda sna svoga?
10 ౧౦ ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు?
Još malo odspavaj, još malo odrijemaj, još malo podvij ruke za počinak
11 ౧౧ అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది.
i doći će tvoje siromaštvo kao skitač i tvoja oskudica kao oružanik.
12 ౧౨ కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు.
Nevaljalac i opak čovjek hodi s lažljivim ustima;
13 ౧౩ వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు.
namiguje očima, lupka nogama, pokazuje prstima;
14 ౧౪ వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.
prijevare su mu u srcu, snuje zlo u svako doba, zameće svađe.
15 ౧౫ అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు.
Zato će mu iznenada doći propast, i učas će se slomiti i neće mu biti lijeka.
16 ౧౬ యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు.
Šest je stvari koje Gospod mrzi, a sedam ih je gnusoba njegovu biću:
17 ౧౭ అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు,
ohole oči, lažljiv jezik, ruke koje prolijevaju krv nevinu,
18 ౧౮ దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు,
srce koje smišlja grešne misli, noge koje hitaju na zlo,
19 ౧౯ లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.
lažan svjedok koji širi laži, i čovjek koji zameće svađe među braćom.
20 ౨౦ కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.
Sine moj, čuvaj zapovijedi oca svoga i ne odbacuj nauka matere svoje.
21 ౨౧ వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో పదిలం చేసుకో. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.
Priveži ih sebi na srce zauvijek, ovij ih oko svoga grla;
22 ౨౨ నీ రాకపోకల్లో, నువ్వు నిద్రపోయే సమయంలో అవి నిన్ను కాపాడతాయి. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవి నీతో సంభాషిస్తాయి.
da te vode kada hodiš, da te čuvaju kada spavaš i da te razgovaraju kad se probudiš.
23 ౨౩ దేవుని ఆజ్ఞలు దీపం లాంటివి. ఉపదేశం వెలుగు వంటిది. క్రమశిక్షణ కోసం చేసే దిద్దుబాట్లు జీవానికి సోపానాలు.
Jer je zapovijed svjetiljka, pouka je svjetlost, opomene stege put su života;
24 ౨౪ వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళకుండా, చెడ్డ స్త్రీ చెప్పే మోసపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడతాయి.
da te čuvaju od zle žene, od laskava jezika tuđinke.
25 ౨౫ దాని అందం చూసి నీ హృదయంలో మోహించకు. అది తన కనుసైగలతో నిన్ను లోబరుచుకోవాలని చూస్తే దాని వల్లో పడవద్దు.
Ne poželi u svom srcu njezine ljepote i ne daj da te osvoji trepavicama svojim,
26 ౨౬ వేశ్యలతో సాంగత్యం చేసేవాళ్ళకు కేవలం రొట్టెముక్క మాత్రమే మిగులుతుంది. వ్యభిచారి నీ విలువైన ప్రాణాన్ని వేటాడుతుంది.
jer bludnici dostaje i komad kruha, dok preljubnica lovi dragocjeni život.
27 ౨౭ ఒకడు తన ఒడిలో నిప్పు ఉంచుకుంటే వాడి బట్టలు కాలిపోకుండా ఉంటాయా?
Može li tko nositi oganj u njedrima a da mu se odjeća ne upali?
28 ౨౮ ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా?
Može li tko hoditi po živom ugljevlju a svojih nogu da ne ožeže?
29 ౨౯ తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు ఆ విధంగానే నాశనం అవుతాడు. ఆమెను తాకిన వాడికి శిక్ష తప్పదు.
Tako biva onomu tko ide k ženi svoga bližnjega: neće ostati bez kazne tko god se nje dotakne.
30 ౩౦ బాగా ఆకలి వేసిన దొంగ భోజనం కోసం దొంగతనం చేసినప్పుడు వాణ్ణి ఎవ్వరూ తిరస్కారంగా చూడరు గదా.
Ne sramote li lupeža sve ako je krao da gladan utoli glad:
31 ౩౧ అయినప్పటికీ వాడు దొరికిపోతే వాడు దొంగిలించిన దానికి ఏడు రెట్లు చెల్లించాలి. అందుకోసం తన యింటిని అమ్మివేయాలిసి వచ్చినా దాన్ని అమ్మి తప్పక చెల్లించాలి.
uhvaćen, on sedmerostruko vraća i plaća svim imanjem kuće svoje.
32 ౩౨ వ్యభిచారం చేసేవాడు కేవలం బుద్ధి లేనివాడు. ఆ పని చేసేవాడు తన సొంత నాశనం కోరుకున్నట్టే.
Nerazuman je, dakle, tko se upušta s preljubnicom; dušu svoju gubi koji tako čini.
33 ౩౩ వాడు గాయాలకు, అవమానాలకు గురి అవుతాడు. వాడికి కలిగే అవమానం ఎప్పటికీ తొలగిపోదు.
Bruke i sramote dopada i rug mu se nikad ne briše.
34 ౩౪ భర్తకు వచ్చే రోషం తీవ్రమైన కోపంతో కూడి ఉంటుంది. ప్రతీకారం చేసే సమయంలో అతడు కనికరం చూపించడు.
Jer bijesna je ljubomornost u muža: on ne zna za milost u osvetni dan;
35 ౩౫ ప్రాయశ్చిత్తంగా నువ్వు ఇచ్చే దేనినీ అతడు లక్ష్యపెట్టడు. ఎన్ని విలువైన కానుకలు ఇచ్చినా అతడు తీసుకోడు.
ne pristaje ni na kakav otkup i ne prima ma kolike mu darove dao.