< ఫిలిప్పీయులకు 1 >

1 ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యేసుకు చెందిన పరిశుద్ధులందరికీ సంఘ నాయకులకూ పరిచారకులకూ క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న సంగతులు.
פולוס וטימותיוס עבדי המשיח ישוע אל כל הקדשים במשיח ישוע אשר הם בפילפי עם הפקידים והשמשים׃
2 మన తండ్రి దేవుని నుండీ ప్రభువైన యేసు క్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలుగు గాక.
חסד לכם ושלום מאת האלהים אבינו ואדנינו ישוע המשיח׃
3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా నా దేవునికి వందనాలు చెబుతాను.
אודה לאלהי מדי זכרי אתכם׃
4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ అది ఆనందభరితమైన ప్రార్థనే.
ותמיד בכל תפלותי אתחנן בשמחה בעד כלכם׃
5 సువార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీ సహవాసానికి వందనాలు.
על התחברותכם אל הבשורה למן היום הראשון ועד הנה׃
6 మీలో ఈ మంచి పని మొదలు పెట్టినవాడు యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పని కొనసాగించి పూర్తి చేస్తాడు. ఇది నా గట్టి నమ్మకం.
ובטח אני כי המתחיל בכם המעשה הטוב גם יגמרנו עד יום ישוע המשיח׃
7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.
כאשר ראוי לי לחשב ככה על כלכם בעבור שאתי אתכם בלבבי במוסרי ובהצדיקי ובחזקי את הבשורה באשר כלכם חברי בחסד׃
8 క్రీస్తు యేసు ప్రేమ లోతుల్లో నుంచి, మీ కోసం నేనెంత తపిస్తున్నానో దేవుడే నాకు సాక్షి.
כי האלהים לי לעד אשר לכלכם נכספתי באהבת ישוע המשיח׃
9 మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
ועל זאת מתפלל אנכי כי תרבה ותגדל אהבתכם בהשכל ובכל דעת׃
10 ౧౦ దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన
למען תבחנו את המבחרות והייתם זכים ובלי מכשול עד יום המשיח׃
11 ౧౧ అంతేకాక దేవునికి మహిమ, స్తుతి కలిగేలా, మీరు యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతి ఫలాలతో నిండి ఉండాలి.
מלאים פרי הצדקה על ידי ישוע המשיח לכבוד אלהים ותהלתו׃
12 ౧౨ సోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా వ్యాపించడానికే అని మీరు తెలుసుకోవాలని ఇప్పుడు కోరుతున్నాను.
והנני מודיע אתכם אחי כי אשר מצאתני היתה אך ליתרון הבשורה׃
13 ౧౩ ఎలాగంటే, నా సంకెళ్ళు క్రీస్తు కోసమే కలిగాయని రాజ భవనం కావలి వారికీ తక్కిన వారందరికీ తెలిసిపోయింది.
עד אשר נגלו מוסרותי במשיח בכל שער המלך ולכל הנשארים׃
14 ౧౪ అంతేకాక, ప్రభువులోని సోదరుల్లో ఎక్కువమంది నా బంధకాలను బట్టి స్థిర విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్కు ప్రకటించడానికి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.
ורב האחים באדנינו הוסיפו אמץ במוסרותי והתחזקו יותר בלבבם לדבר את הדבר בלי פחד׃
15 ౧౫ కొంతమంది అసూయతో కలహబుద్ధితో, మరి కొంతమంది మంచి ఉద్దేశంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
הן יש מגידים את המשיח מקנאה וריב ויש מגידים בכונה טובה׃
16 ౧౬ ప్రేమతో క్రీస్తును ప్రకటించేవారికి నేను సువార్త పక్షాన వాదించడానికి నియామకం పొందానని తెలుసు.
אלה ממריבה מגידים את המשיח לא בלב טהור כי חשבים להוסיף צרה על מוסרי׃
17 ౧౭ అయితే మిగతా వారు బంధకాల్లో ఉన్న నాకు మరింత బాధ కలిగించాలని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు.
ואלה מאהבה באשר הם ידעים כי נתון אנכי להצדיק את הבשורה׃
18 ౧౮ అయితేనేం? కపటంతో గానీ సత్యంతో గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా ఆనందిస్తాను.
אך מה בכך הלא בכל אופן אם בעלילה או באמת יגד המשיח ואני הנני שמח בזאת וגם אשמח׃
19 ౧౯ మీ ప్రార్థనల వలన, యేసు క్రీస్తు ఆత్మసాయం వలన, నా విడుదల కోసం ఇదంతా జరుగుతూ ఉందని నాకు తెలుసు.
כי יודע אני שתהיה לי זאת לישועה בתפלתכם ובעזרת רוח ישוע המשיח׃
20 ౨౦ నేను ఏ విషయంలోనైనా సిగ్గుపాలు కానని నాకు నిబ్బరమైన ఆశాభావం ఉంది. అయితే, ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా నా జీవితం వలన గానీ, చావు వలన గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం ఉంది.
ואוחיל ואקוה שלא אבוש בכל דבר כי אם בכל בטחון כאשר מאז כן גם עתה יתגדל המשיח בגופי אם בחיי אם במותי׃
21 ౨౧ నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే.
כי המשיח הוא חיי והמות רוח לי׃
22 ౨౨ అయినా శరీరంలో నేనింకా బతుకుతూ నా ప్రయాసకు ఫలితం ఉంటే, అప్పుడు నేనేం కోరుకోవాలో నాకు తెలియడం లేదు.
אולם אם לחיות בבשר עוד יוסיף לי פרי עמלי אין לי להגיד במה אבחר׃
23 ౨౩ ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయాను. నేను లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. అన్నిటికంటే అదే ఉత్తమం.
כי משוך אני מן השנים נפשי אותה להפטר ולהיות עם המשיח כי זה המבחר׃
24 ౨౪ అయినా నేను శరీరంతో ఉండడం మీకోసం మరింత అవసరం.
אבל לעמד עוד בבשר צריך יתר בעבורכם׃
25 ౨౫ తద్వారా, నేను మీ దగ్గరికి తిరిగి రావడంవల్ల క్రీస్తు యేసులో నన్ను బట్టి మీరు గర్వ పడతారు. మీరు విశ్వాసంలో అభివృద్ధి, ఆనందం పొందడానికి నేను జీవిస్తూ మీ అందరితో ఉంటానని నాకు గట్టి నమ్మకం ఉంది.
ואני בטח וידע כי אותר ואעמד עם כלכם יחד לאמץ אתכם ולהגדיל שמחת אמונתכם׃
26 ౨౬
למען תרבה על ידי תהלתכם במשיח ישוע בשובי לבוא אליכם׃
27 ౨౭ నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, అందరూ కలిసికట్టుగా సువార్త విశ్వాసం పక్షంగా పోరాడుతూ, ఏక భావంతో నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినేలా, మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి.
רק חתנהגו כראוי לבשורת המשיח למען אשמע עליכם אם בבואי לראותכם אם בהיותי רחוק כי קימים אתם ברוח אחת ועזרים אתי בנפש אחת להלחם בעד אמונת הבשורה׃
28 ౨౮ మిమ్మల్ని ఎదిరించే వారికి ఏ విషయంలోనూ భయపడవద్దు. మీ ధైర్యం వారికి నాశనం, మీకు రక్షణ కలుగుతాయని తెలిపే సూచన. ఇది దేవుని వలన కలిగే విడుదల.
ואינכם חרדים מאומה מפני המתקוממים אשר זאת להם אות לאבדם ולכם לישועתכם ומאת האלהים היא׃
29 ౨౯ గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి వింటున్నారు. మీరు కూడా అదే పోరాటంలో ఉన్నారు. కాబట్టి దేవుడు మీకు కేవలం క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం కూడా కలిగించాడు.
כי נתן לכם בעד המשיח לא לבד להאמין בו כי אם גם להתענות בעדו׃
30 ౩౦
כי גם לכם המלחמה אשר ראיתם בי ואשר עתה שמעים אתם עלי׃

< ఫిలిప్పీయులకు 1 >