< నెహెమ్యా 1 >
1 ౧ హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు. నేను 20 వ సంవత్సరం కిస్లేవు నెలలో షూషను కోటలో ఉన్న సమయంలో
Słowa Nehemijasza, syna Hachalijaszowego. I stało się miesiąca Chyslew, roku dwudziestego (Aswerusa króla) gdym był na zamku w Susan,
2 ౨ నా సోదరుల్లో హనానీ అనే ఒకడు, ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని, అక్కడ మిగిలిపోయిన యూదుల గురించీ యెరూషలేమును గురించీ నేను వారిని అడిగాను.
Że przyszedł Chanani, jeden z braci moich, a z nim niektórzy mężowie z Judy, którychem się pytał o Żydów, którzy pozostali i wyszli z więzienia, i o Jeruzalem.
3 ౩ అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.
I odpowiedzieli mi: Te ostatki, które pozostały z więzienia tam w onej krainie, są w wielkiem utrapieniu, i w zelżywości: nadto mur Jeruzalemski rozwalony jest, i bramy jego spalone są ogniem.
4 ౪ ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను.
A gdym usłyszał te słowa, siadłszy płakałem i narzekałem przez kilka dni, poszcząc i modląc się przed obliczem Boga niebieskiego.
5 ౫ “ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు.
I rzekłem; Proszę Panie, Boże niebieski, mocny, wielki i straszny! który strzeżesz umowy, i miłosierdzia z tymi, którzy cię miłują, i strzegą przykazania twego.
6 ౬ నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం.
Niech będzie proszę ucho twoje nakłonione, a oczy twoje otworzone, abyś usłyszał modlitwę sługi twego, którą się ja dziś modlę przed tobą we dnie i w nocy za synami Izraelskimi, sługami twymi, i wyznaję grzechy synów Izraelskich, któremiśmy zgrzes zyli przeciw tobie; i ja i dom ojca mego zgrzeszyliśmy.
7 ౭ నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గానీ చట్టాలను గానీ విధులను గానీ మేము పాటించలేదు.
Srodześmy wystąpili przeciwko tobie, i nie przestrzegaliśmy przykazań, i ustaw, i sądów, któreś przykazał Mojżeszowi, słudze twemu.
8 ౮ నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. ‘మీరు అపరాధం చేస్తే లోక జాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను.
Wspomnij proszę na słowo, któreś przykazał Mojżeszowi, słudze twemu, mówiąc: Jeżli wy wystąpicie, tedy Ja was rozproszę między narody;
9 ౯ అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకూ మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి, నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకు వస్తాను’ అని చెప్పావు గదా.
Ale jeżli się nawrócicie do mnie, a strzedz będziecie przykazań moich, i czynić je, choćbyście byli wygnani na kraj świata, tedy i stamtąd was zgromadzę, i przyprowadzę was na miejsce, którem obrał, aby tam przebywało imię moje.
10 ౧౦ మరి, నీవు నీ మహా బల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా.
Wszak oni są słudzy twoi, i lud twój, któryś odkupił mocą twoją wielką, i ręką twą silną.
11 ౧౧ యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈ రోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి, ఈ మనిషి నాపై దయ చూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను.” నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని.
Proszę o Panie! niech teraz będzie ucho twoje nakłonione ku modlitwie sługi twego i ku modlitwie sług twoich, którzy mają wolę bać się imienia twego; a zdarz dziś, proszę, słudze twemu, i spraw mu miłosierdzie przed tym mężem. A jam był podczaszym królewskim.