< మార్కు 11 >
1 ౧ వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు.
Paŵaliji nkuŵandichila ku Yelusalemu, ŵaiche mmisinda ja ku Besefage ni ku Besania, chiŵandi ni Chikwesya cha Miseituni. Pelepo Che Yesu ŵaatumile ŵakulijiganya ŵao ŵaŵili.
2 ౨ “మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి.
Ni ŵaasalile, “Njaule pansinda wauli mmbujo mwenu, pachinkajinjileje po chinkansimane mwanambunda jwanganakwelekwe ni mundu kose, ali ataŵikwe, nkangopole ni kunnyika nawo apano.
3 ౩ అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.”
Ambusyaga mundu, ‘Ligongo chi nkutenda yeleyo?’ Mwasalile, ‘Ambuje akunsaka, ni chaachimmusya mwachitema pe.’”
4 ౪ శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా
Nipele, ŵakulijiganya wo ŵajawile ni kunsimana mwanambunda ali ataŵikwe pachiŵandi ni nnango, muumbali mwa litala. Paŵangopolaga,
5 ౫ అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు.
ŵandu ŵampepe ŵaŵajimi pelepo ŵausisye, “Uli, mbona nkungopola mwanambunda jo?”
6 ౬ శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు.
Ŵakulijiganya ŵajanjile mpela iŵatite pakusalilwa ni Che Yesu, ni ŵandu ŵala ŵaalesile ajaule najo.
7 ౭ వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు.
Ŵampelechele Che Yesu mwanambunda jula. Ŵatandiche iwalo yao pangongo wa mwanambunda jula, ni Che Yesu ŵatemi pachanya pakwe.
8 ౮ చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు.
Ŵandu ŵajinji ŵatandiche iwalo yao mwitala, ni ŵane ŵatemenye nyambi sya mwana sya itela mmigunda ni kutandika mwitala kwa kwachimbichisya.
9 ౯ ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు!
Nipele ŵandu ŵaŵalongolele ni ŵane ŵaŵakuyaga panyuma ŵanyanyisye achitiji, “Alapikwe Akunnungu! Akunnungu ampe upile jwelejo jwakwika mu liina lya Ambuje!
10 ౧౦ రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు.
Akunnungu aupe upile umwenye waukwika wa atati ŵetu Mwenye che Daudi. Ajinichilwe Akumanani!”
11 ౧౧ యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న అన్నిటినీ చూశాడు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వెళ్ళాడు.
Che Yesu wajinjile mmusi wa ku Yelusalemu, ni ŵapelengenye pa Nyuumba ja Akunnungu, ni ŵalolesyelolesye. Nambo pakuŵa jaliji ligulo, ŵajawile kunsinda wa ku Besania pamo ni ŵakulijiganya ŵao likumi ni ŵaŵili.
12 ౧౨ మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
Malaŵi jakwe, paŵatyochelaga ku Besania, Che Yesu jakwete sala.
13 ౧౩ కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు.
Nipele, ali kwakutalichila ŵachiweni chitela cha ntini chana masamba gamajinji. Ŵajawile kukuchilola, alole iŵaga chakombole kupata chisogosi chachili chose. Paŵaiche pachitela pala ŵachisimene masamba pe pangali chisogosi, ligongo nganikaŵa katema kakwe ka kusogola.
14 ౧౪ ఆయన ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు. (aiōn )
Pelepo Che Yesu ŵachisalile chitela chila, “Chitandile sambano ni kuendelechela, ngapagwa mundu juchalye sooni isogosi yenu!” Ni ŵakulijiganya ŵao ŵampilikene paŵaŵechete gelego. (aiōn )
15 ౧౫ వారు యెరూషలేము వచ్చినప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేస్తున్నవారిని తరిమి వేయడం ప్రారంభించాడు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్ముతున్న వారి పీటలు పడదోశాడు.
Nipele paŵaiche ku Yelusalemu, Che Yesu ŵajinjile pa Nyuumba ja Akunnungu. Ni ŵatandite kwatopolela paasa, ŵandu ŵaŵaliji nkusumisya ni kusuma indu mwelemo. Ŵapikwile mesa sya ŵakutindanya mbiya ni itengu ya ŵandu ŵaŵasumisyaga nguunda.
16 ౧౬ దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోకుండా చేశాడు.
Iyoyo, ŵakanyisye mundu jwalijose akajigala chachili chose kutyochela pa Nyuumba ja Akunnungu.
17 ౧౭ ఆయన వారికి బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జాతులకూ ప్రార్థనా ఆలయం అంటారు’ అని రాసి లేదా? కానీ మీరు దాన్ని దోపిడి దొంగల గుహగా చేశారు” అన్నాడు.
Nipele, ŵajiganyisye, “Mmalembelo ga Akunnungu, Akunnungu akuti, ‘Nyuumba jangu chijiŵilanjikwe nyuumba ja kupopelela kwa ŵandu wose ŵa pachilambo!’ Nambo ŵanyamwe njitesile jiŵe mbugu ja kulisisila ŵa wiyi!”
18 ౧౮ ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని ఆయనను ఎలా చంపాలా అని ఆలోచించారు గానీ అక్కడ ఉన్న ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఉండడం వల్ల ఆయనకు భయపడ్డారు.
Achakulu ŵambopesi ni ŵakwiganya Malajisyo paŵapilikene yelei, ŵatandite kusosa litala lya kwaulaga Che Yesu. Nambo ŵanjogwepe, ligongo ŵandu ŵajinji ŵaliji nkusimonga wiganye wakwe.
19 ౧౯ సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు.
Pakwaswele, Che Yesu ni ŵakulijiganya ŵao ŵakopweche musi wo.
20 ౨౦ తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు.
Kundaŵi jakwe, paŵapitaga ŵachiweni chitela cha ntini chila chili chijumwile koo, kutandilila mmichiga mpaka ku nyambi.
21 ౨౧ అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అన్నాడు.
Che Petulo ŵagakumbuchile agala gaŵaŵechete Che Yesu, ni ŵansalile, “Jwakwiganya, nnole! Chitela cha ntini chimwalwesisye chila chijumwile!”
22 ౨౨ అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుని మీద విశ్వాసం ఉంచండి.
Che Yesu ŵaasalile, “Mwakulupilile Akunnungu.
23 ౨౩ మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది.
Isyene ngunsalila, mundu achichisalilaga chitumbi chi, ‘Ntupuche nkaliponye mbahali,’ pangakola lipamba mu ntima mwakwe ni akulupililaga kuti chaŵechete cho chichitendekwe, chichitendekwe kukwakwe.
24 ౨౪ అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.
Kwa ligongo lyo ngunsalila, pankupopela ni kuŵenda chindu, nkulupilile kuti nkuchipochela, nombecho chichiŵe chenu.
25 ౨౫ అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి.
Pankupopela, iŵaga kwana mundu jwanneŵele, mwalechelesye yangalumbana yantendele, kuti Atati ŵenu ŵa kwinani annechelesye sambi syenu.
26 ౨౬ అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
Nambo iŵaga ngumwalechelesya ŵane sambi syao, Atati ŵenu ŵa kwinani nombe ngannechelesya sambi syenu.”
27 ౨౭ యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి
Nipele ŵaiche sooni ku Yelusalemu. Che Yesu paŵaliji nkwendajenda pa Nyuumba ja Akunnungu, achakulu ŵambopesi ni ŵakwiganya Malajisyo ni achachekulu ŵajaulile,
28 ౨౮ ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు.
ni ŵausisye, “Ana nkugatendekanya gelega kwa ulamusi wa acheni? Ŵaani ŵampele ulamusi wa kuitendekanya yeleyi?”
29 ౨౯ యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను.
Che Yesu ŵajanjile, “None chinambusye liusyo limo. Iŵaga chimunyanje none chinansalile kwa ulamusi wa acheni nguitenda indu yi.
30 ౩౦ యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.
Musalile, ubatiso u che Yohana waumile kwinani, pane kwa ŵandu?”
31 ౩౧ వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు.
Ŵanyawo ŵatandite kuusyana jwine ni jwine achitiji, “Twajilaga, ‘Waumile kwinani’, chatuusye, ‘Kwachichi nganimwakulupilila che Yohana?’
32 ౩౨ ‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు.
Ni twatiji, ‘Waumile kwa ŵandu,’ chiiŵe uli?” Ŵaujogwepe mpingo wa ŵandu, pakuŵa ŵandu wose ŵakulupilile kuti che Yohana ŵaliji jwakulondola jwa Akunnungu.
33 ౩౩ కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.
Nipele, ŵanjanjile Che Yesu, “Ngatukumanyilila.” Nombejo ŵaasalile, “None jwakwe ngangunsalila kwa ulamusi wa acheni nguitendekanya yeleyi.”