< న్యాయాధిపతులు 3 >
1 ౧ ఇశ్రాయేలీయులకు కనానీయులకు జరిగిన యుద్ధాల గురించి తెలియని ఇశ్రాయేల్వాళ్ళందరినీ పరీక్షకు గురి చెయ్యడానికి యెహోవా ఈ శత్రు జాతులను అక్కడే ఉంచాడు
A teć są narody, które pozostawił Pan, aby kusił przez nie Izraela, wszystkie, którzy nie wiedzieli o żadnych walkach Chananejskich;
2 ౨ ఇశ్రాయేలీయుల్లో కొత్త తరం వాళ్లకు యుద్ధం నేర్పించడానికి యెహోవా ఉండనిచ్చిన జాతులు ఇవి:
Aby wżdy wiedzieli potomkowie synów Izraelskich, i poznali, co jest walka, którzy jej zgoła przedtem nie znali.
3 ౩ ఫిలిష్తీయుల ఐదుగురు నాయకుల జాతులు, కనానీయులందరూ, సీదోనీయులు, బయల్హెర్మోను నుంచి హమాతునకు వెళ్ళే మార్గం వరకూ లెబానోను కొండలో ఉండే హివ్వీయులు.
Pięcioro książąt Filistyńskich i wszystkie Chananejczyki, i Sydończyki i Hewejczyki, mieszkające na górze Libanie, od góry Baal Hermon aż tam, gdzie wchodzą do Hemat.
4 ౪ యెహోవా మోషే ద్వారా వాళ్ళ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళు అనుసరిస్తారో లేదో తెలుసుకోవాలని ఇశ్రాయేలీయులను పరీక్షించడానికి ఈ జాతులను ఆయన ఉండనిచ్చాడు.
Cić byli, przez które doświadczał Izraela, aby się dowiedział, będąli posłuszni przykazaniom Pańskim, które rozkazał ojcom ich przez Mojżesza.
5 ౫ కాబట్టి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు,
A tak synowie Izraelscy mieszkali w pośród Chananejczyków, Hetejczyków, i Amorejczyków, i Ferezejczyków i Hewejczyków, i Jebuzejczyków.
6 ౬ పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్య ఇశ్రాయేలీయులు నివాసం చేస్తూ వాళ్ళ కూతుళ్ళను పెళ్లిచేసుకుంటూ, వాళ్ళ కొడుకులకు తమ కూతుళ్ళను ఇస్తూ, వాళ్ళ దేవుళ్ళను పూజిస్తూ వచ్చారు.
I brali sobie córki ich za żony, a córki swe dawali synom ich, i służyli bogom ich.
7 ౭ ఆ విధంగా ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా కనబడి, తమ దేవుడైన యెహోవాను మరచి, బయలుదేవుళ్ళను, అషేరా విగ్రహాలను పూజించారు.
I czynili Izraelscy synowie złe przed oczyma Pańskiemi: zapomniawszy Pana, Boga swego, służyli Baalom, i święconym gajom.
8 ౮ ఫలితంగా యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు ఆయన ఆరాము నహరాయిము రాజైన కూషన్రిషాతాయిము కు బానిసలుగా ఉండడానికి వాళ్ళను అమ్మి వేశాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాలు కూషన్రిషాతాయిముకు బానిసలుగా ఉన్నారు.
Tedy się zapalił gniew Pański przeciw Izraelowi, i podał je w rękę Chusanrasataima, króla Syrskiego w Mezopotamii: A służyli synowie Izraelscy Chusanrasataimowi przez osiem lat.
9 ౯ ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు కొడుకు ఒత్నీయేలును ఇశ్రాయేలీయుల కోసం నియమించి వాళ్ళను కాపాడాడు.
Potem wołali synowie Izraelscy do Pana; I wzbudził Pan wybawiciela synom Izraelskim, aby je wybawił, Otonijela, syna Kenezowego, brata Kalebowego młodszego.
10 ౧౦ యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి యుద్ధానికి బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిషాతాయిమును జయించాడు.
I był nad nim Duch Pański, a sądził Izraela; a gdy się ruszył na wojnę, podał Pan w rękę jego Chusanrasataima, króla Syryjskiego, i zmocniła się ręka jego nad Chusanrasataimem.
11 ౧౧ ఆ తరువాత నలభై సంవత్సరాలు దేశం ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత కనజు కొడుకు ఒత్నీయేలు చనిపోయాడు.
A tak była w pokoju ziemia przez czterdzieści lat, aż umarł Otonijel, syn Kenezów.
12 ౧౨ ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు. వాళ్ళు యెహోవా దృష్టికి దోషులైన కారణంగా యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చెయ్యడానికి మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు.
Potem znowu synowie Izraelscy czynili złe przed oczyma Pańskiemi. I zmocnił Pan Eglona, króla Moabskiego, przeciw Izraelowi, przeto iż czynili złe przed oczyma Pańskiemi.
13 ౧౩ అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకుని వెళ్లి ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూరచెట్ల పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
Bo zebrawszy do siebie syny Ammonowe i Amalekowe ruszył się, i poraził Izraela, i opanował miasto Palm.
14 ౧౪ ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజుకు బానిసలుగా ఉన్నారు.
Służyli tedy synowie Izraelscy Eglonowi, królowi Moabskiemu, osiemnaście lat.
15 ౧౫ ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు
Potem wołali synowie Izraelscy do Pana. I wzbudził im Pan wybawiciela, Aoda, syna Gery, syna Jemini, męża ręką prawą niewładającego; i posłali synowie Izraelscy przezeń dar Eglonowi, królowi Moabskiemu.
16 ౧౬ ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల కత్తిని చేయించుకుని, తన వస్త్రంలో తన కుడి తొడమీద
I uczynił sobie Aod miecz z obu stron ostry, na łokieć wzdłuż, i przypasał go pod szaty swe do prawego biodra swojego.
17 ౧౭ దాన్ని కట్టుకుని, ఆ కప్పం మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి తెచ్చాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండే వాడు.
I przyniósł dar Eglonowi, królowi Moabskiemu: a Eglon był człowiek bardzo otyły.
18 ౧౮ ఏహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తరువాత కప్పం మోసిన మనుషులను పంపివేసి
A gdy oddał dar, odprawił lud, który był dar przyniósł;
19 ౧౯ గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము దగ్గర నుంచి తిరిగి వచ్చి “రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి” అన్నాడు. అప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళే వరకూ మాట్లాడవద్దని చెప్పాడు.
A sam wróciwszy się do gór kamiennych, które były w Galgal, rzekł: Rzecz tajemną mam do ciebie, o królu! któremu on odpowiedział: Milcz; i wyszli od niego wszyscy, którzy stali przed nim.
20 ౨౦ ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు.
I wszedłszy Aod do niego, (a on sam siedział na sali letniej, którą miał sam dla siebie, ) i rzekł Aod: Mam rozkazanie Boże do ciebie. I powstał z stolicy swojej.
21 ౨౧ అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు.
Tedy Aod wyciągnąwszy lewą rękę swą, dobył miecza od prawego biodra swego, i wraził go w brzuch jego,
22 ౨౨ ఆ కత్తితో పాటు దాని పిడి కూడా అతని కడుపులోకి దిగి పోయింది. ఆ కత్తి అతని వెనుకనుంచి బయటకు వచ్చింది. అతని క్రొవ్వు ఆ కత్తిని కప్పేసిన కారణంగా ఏహూదు ఆ కత్తిని అతని శరీరంలోనుంచి బయటకు తీయలేదు.
Tak iż wpadła i rękojeść za żelazem, i zawarło się w sadle żelazo; bo był nie wyjął miecza z brzucha jego, aż się i gnój rzucił.
23 ౨౩ అప్పుడు ఏహూదు వసారాలోకి వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టాడు.
Wyszedł potem Aod przez przysionek, a zamknął drzwi gmachu za sobą, i zawarł zamkiem.
24 ౨౪ అతడు వెళ్ళిపోయిన తరువాత ఆ రాజు సేవకులు లోపలికి వచ్చి చూసినప్పుడు ఆ మేడగది తలుపుల గడియలు వేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు, రాజు తన చల్లని గదిలో మూత్ర విసర్జన చేస్తున్నాడనుకున్నారు.
A gdy on wyszedł, słudzy jego przyszli, a widząc, iż drzwi gmachu zamknione były, rzekli: Podobno sobie król czyni wczas na sali letniej.
25 ౨౫ వాళ్ళు ఎంతసేపు కనిపెట్టినా రాజు ఆ గది తలుపులు తీయకపోవడంతో వాళ్ళు తాళపు చెవి తెచ్చి తలుపులు తీసి చూశారు. వాళ్ళ రాజు చనిపోయి నేలమీద పడి ఉన్నాడు.
A naczekawszy się, aż się wstydzili, widząc, że on nie otwiera drzwi sali, wziąwszy klucz otworzyli; a oto, pan ich leżał na ziemi umarły.
26 ౨౬ వాళ్ళు ఆలస్యం చేస్తుండగా ఏహూదు తప్పించుకుని చెక్కిన విగ్రహాలు ఉన్న పెసీలీమును దాటి శెయీరాకు పారిపోయాడు.
Lecz Aod uszedł, póki się oni bawili, a minąwszy góry kamienne, szedł do Seiratu.
27 ౨౭ అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూర ఊదగా ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతం నుంచి దిగి అతని దగ్గరికి వచ్చారు.
A gdy przyszedł, zatrąbił w trąbę na górze Efraim; i zstąpili z nim synowie Izraelscy z góry, a on przed nimi.
28 ౨౮ అతడు వాళ్ళతో “నాతో రండి, యెహోవా మీ శత్రువులైన మోయాబీయులను ఓడించబోతున్నాడు” అన్నాడు. కాబట్టి వాళ్ళు అతని వెంట దిగివచ్చి మోయాబువారికి ఎదురుగా ఉన్న యొర్దాను రేవులను ఆక్రమించుకుని ఎవరినీ దాటనివ్వలేదు.
I rzekł do nich: Pójdźcie za mną: albowiem podał Pan nieprzyjacioły wasze Moabity w ręce wasze. Tedy szli za nim, a odjąwszy bród Jordański Moabitom, nie dopuszczali nikomu przeprawy.
29 ౨౯ ఆ సమయంలో వాళ్ళు మోయాబీయుల్లో బలం, సామర్ధ్యం కలిగిన పరాక్రమవంతులైన పదివేల మందిని చంపారు. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. ఆ దినాన మోయాబీయులు ఇశ్రాయేలీయుల బలాన్ని బట్టి అణగారిపోయారు. ఆ కారణంగా ఆ ప్రాంతం ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
I pobili Moabitów na ten czas około dziesięciu tysięcy mężów, wszystko bogatych, i wszystko mężów dużych, a nikt nie uszedł.
30 ౩౦ అతని తరువాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. అతడు ఆరు వందల మంది ఫిలిష్తీయులను పశువులు కాసే మునుకోల కర్రతో చంపాడు.
I poniżony jest Moab dnia onego pod ręką Izraela, a była w pokoju ziemia przez osiemdziesiąt lat.
31 ౩౧ అతడు కూడా ఇశ్రాయేలీయులను ప్రమాదాల నుంచి కాపాడాడు.
A po nim był Samgar, syn Anatów, który poraził z Filistynów sześć set mężów stykiem wołowym, a wybawił i ten Izraela.