< యెహొషువ 15 >
1 ౧ యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.
ユダの人々の部族が、その家族にしたがって、くじで獲た地は、南の方では、エドムの境に達し、南のはてにあるチンの荒野に及んでいた。
2 ౨ వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
その南の境は、塩の海の南の端の、入海から起り、
3 ౩ వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి
アクラビムの坂の南に出てチンに進み、カデシ・バルネアの南から上って、ヘヅロンに進み、アダルに上っていって、カルカに回り、
4 ౪ అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
アヅモンに進んで、エジプトの川に達し、その境は海に至って尽きる。これが彼らの南の境である。
5 ౫ దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.
東の境は塩の海であって、ヨルダンの川口に達する。北の方の境は、ヨルダンの川口の、入海から起り、
6 ౬ ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.
上ってベテホグラに行き、ベテアラバの北を過ぎ、上ってルベンびとボハンの石に達し、
7 ౭ ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.
またアコルの谷からデビルに上って、北におもむき、川の南にあるアドミムの坂に対するギルガルに向かって進み、エンシメシの水に達し、エンロゲルに至って尽きる。
8 ౮ ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
またその境はベンヒンノムの谷に沿って、エブスびとの地、すなわちエルサレムの南のわきに上り、ヒンノムの谷の西にある山の頂に上る。これはレパイムの谷の北の果にあるものである。
9 ౯ ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.
その境は、この山の頂からネフトアの水の源に至り、その所からエフロン山の町々に及び、その境は曲ってバアラに達する。これは、すなわちキリアテ・ヤリムである。
10 ౧౦ ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.
その境は、バアラから西に回って、セイル山に及び、ヤリム山、すなわちケサロンの北のわきを経て、ベテシメシに下り、テムナに進み、
11 ౧౧ ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
エクロンの北の丘のわきに出て、シッケロンに曲り、バアラ山に進み、ヤブネルに達し、海に至って尽きる。
12 ౧౨ పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
また西の境は大海であって、海岸を境とした。これがユダの人々の、その家族にしたがって獲た地の四方の境である。
13 ౧౩ యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.
ヨシュアは、主に命じられたように、エフンネの子カレブに、ユダの人々のうちで、キリアテ・アルバ、すなわちヘブロンを与えて、その分とさせた。アルバはアナクの父であった。
14 ౧౪ షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.
カレブはその所から、アナクの子三人を追い払った。すなわち、セシャイ、アヒマン、およびタルマイであって、アナクから出たものである。
15 ౧౫ అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.
そして彼はこの所からデビルに住む民の所に攻め上った。デビルの名は、もとはキリアテ・セペルといった。
16 ౧౬ కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే
カレブは言った、「キリアテ・セペルを撃って、これを取る者には、わたしの娘アクサを妻として与えるであろう」。
17 ౧౭ కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.
ケナズの子で、カレブの弟オテニエルがそれを取ったので、カレブは娘アクサを、妻として彼に与えた。
18 ౧౮ ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
彼女がとつぐ時、畑を父に求めるようにと、オテニエルに勧められた。そして彼女が、ろばから降りたので、カレブは彼女に、何を望むのかとたずねた。
19 ౧౯ “నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
彼女は答えて言った、「わたしに贈り物をください。あなたはネゲブの地に、わたしをやられるのですから、泉をもください」。カレブは彼女に上の泉と下の泉とを与えた。
20 ౨౦ యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
ユダの人々の部族が、その家族にしたがって獲た嗣業は、次のとおりである。
21 ౨౧ యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
ユダの人々の部族が、南でエドムの境の方にもっていた遠くの町々は、カブジエル、エデル、ヤグル、
22 ౨౨ కీనా, దిమోనా, అదాదా,
キナ、デモナ、アダダ、
23 ౨౩ కెదెషు, హాసోరు, ఇత్నాను,
ケデシ、ハゾル、イテナン、
24 ౨౪ జీఫు, తెలెము, బెయాలోతు,
ジフ、テレム、ベアロテ、
25 ౨౫ హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,
ハゾル・ハダッタ、ケリオテ・ヘヅロンすなわちハゾル、
26 ౨౬ అమాము, షేమ, మోలాదా,
アマム、シマ、モラダ、
27 ౨౭ హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,
ハザルガダ、ヘシモン、ベテペレテ、
28 ౨౮ హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,
ハザル・シュアル、ベエルシバ、ビジョテヤ、
29 ౨౯ బాలా, ఈయ్యె, ఎజెము,
バアラ、イイム、エゼム、
30 ౩౦ ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
エルトラデ、ケシル、ホルマ、
31 ౩౧ సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
チクラグ、マデマンナ、サンサンナ、
32 ౩౨ లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
レバオテ、シルヒム、アイン、リンモン。これらの町は合わせて二十九、ならびにそれに属する村々。
33 ౩౩ మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
平地では、エシタオル、ゾラ、アシナ、
34 ౩౪ జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
ザノア、エンガンニム、タップア、エナム、
35 ౩౫ యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
ヤルムテ、アドラム、ソコ、アゼカ、
36 ౩౬ షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
シャアライム、アデタイム、ゲデラ、ゲデロタイム。すなわち十四の町々と、それに属する村々。
37 ౩౭ సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
ゼナン、ハダシャ、ミグダルガデ、
38 ౩౮ దిలాను, మిజ్పా, యొక్తయేలు,
デラン、ミヅパ、ヨクテル、
39 ౩౯ లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
ラキシ、ボヅカテ、エグロン、
40 ౪౦ కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
カボン、ラマム、キテリシ、
41 ౪౧ గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.
ゲデロテ、ベテダゴン、ナアマ、マッケダ。すなわち十六の町々と、それに属する村々。
42 ౪౨ లిబ్నా, ఎతెరు, ఆషాను,
またリブナ、エテル、アシャン、
43 ౪౩ ఇప్తా, అష్నా, నెసీబు,
イフタ、アシナ、ネジブ、
44 ౪౪ కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
ケイラ、アクジブ、マレシャ。すなわち九つの町々と、それに属する村々。
45 ౪౫ ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,
エクロンと、その町々、および村々。
46 ౪౬ దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.
エクロンから海まで、すべてアシドドのほとりにある町々、およびそれに属する村々。
47 ౪౭ గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,
アシドドとその町々および村々。ガザとその町々および村々。エジプトの川と大海の海岸までが、その境であった。
48 ౪౮ మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
山地では、シャミル、ヤッテル、ソコ、
49 ౪౯ దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
ダンナ、キリアテ・サンナすなわちデビル、
50 ౫౦ అనాబు, ఎష్టెమో, ఆనీము,
アナブ、エシテモ、アニム、
51 ౫౧ గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.
ゴセン、ホロン、ギロ。すなわち十一の町々と、それに属する村々。
52 ౫౨ ఆరాబు, దూమా, ఎషాను,
アラブ、ドマ、エシャン、
53 ౫౩ యానీము, బేత్ తపూయ, అఫెకా,
ヤニム、ベテタップア、アペカ、
54 ౫౪ హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
ホムタ、キリアテ・アルバすなわちヘブロン、ヂオル。すなわち九つの町々と、それに属する村々。
55 ౫౫ మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,
マオン、カルメル、ジフ、ユッタ、
56 ౫౬ యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,
エズレル、ヨクデアム、ザノア、
57 ౫౭ కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.
カイン、ギベア、テムナ。すなわち十の町々と、それに属する村々。
58 ౫౮ హల్హూలు, బేత్సూరు, గెదోరు,
ハルホル、ベテズル、ゲドル、
59 ౫౯ మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
マアラテ、ベテアノテ、エルテコン。すなわち六つの町々と、それに属する村々。
60 ౬౦ కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.
キリアテ・バアルすなわちキリアテ・ヤリム、ラバ。これらの二つの町とそれに属する村々。
61 ౬౧ అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా
荒野では、ベテアラバ、ミデン、セカカ、
62 ౬౨ ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
ニブシャン、塩の町、エンゲデ。すなわち六つの町々と、それに属する村々。
63 ౬౩ యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.
しかし、ユダの人々は、エルサレムの住民エブスびとを追い払うことができなかった。それでエブスびとは今日まで、ユダの人々と共にエルサレムに住んでいる。