< యెహొషువ 12 >

1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ తూర్పు మైదానమంతటిలో ఉన్న వారిని ఓడించి వారి దేశాలను ఆక్రమించుకొన్న రాజులు ఎవరంటే,
Ovo su zemaljski kraljevi što su ih pobijedili Izraelci i osvojili njihovu zemlju s onu stranu Jordana k istoku, od potoka Arnona do gore Hermona, sa svom Arabom na istoku:
2 అమోరీయుల రాజు సీహోను. అతడు హెష్బోనులో నివసిస్తూ అర్నోను నదీ తీరంలోని అరోయేరు నుండి, అంటే ఆ నదీ లోయ మధ్య నుండి గిలాదు అర్థభాగమూ అమ్మోనీయులకు సరిహద్దుగా ఉన్న యబ్బోకు నది లోయ వరకూ
Sihon, kralj amorejski, koji je stolovao u Hešbonu; njegovo se kraljevstvo protezalo od Aroera, koji leži na rubu doline potoka Arnona, sredinom doline i polovinom Gileada pa do potoka Jaboka, gdje je graničilo s Amoncima;
3 తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకూ తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గంలో ఉప్పు సముద్రంగా నున్న అరాబా సముద్రం వరకూ దక్షిణం వైపున పిస్గాకొండ చరియల కింద ఉన్న మైదానం వరకూ పరిపాలించాడు.
i na istoku mu bila Araba do Keneretskog mora s jedne strane i sve do Arabskog ili Slanog mora prema Bet Haješimotu; i dalje na jugu do obronaka Pisge.
4 ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగును పట్టుకున్నారు. అతడు రెఫాయీయుల్లో మిగిలిన వారిలో ఒకడు. అతడు అష్తారోతులో ఎద్రెయిలో నివసించి గెషూరీయుల, మాయకాతీయుల సరిహద్దు వరకూ బాషాను అంతటా సల్కా,
Međašio s njime Og, kralj bašanski, jedan od posljednjih Refaimaca; stolovao je u Aštarotu i Edreju.
5 హెర్మోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకూ గిలాదు అర్థభాగంలో పాలించినవాడు.
A vladao je gorom Hermonom i Salkom, čitavim Bašanom sve do gešurske i maakadske međe te drugom polovinom Gileada sve do granice Sihona, kralja hešbonskoga.
6 యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులూ వారిని ఓడించారు. యెహోవా సేవకుడు మోషే, ఆ భూమిని రూబేనీయులకూ గాదీయులకూ మనష్షే అర్థగోత్రపు వారికీ స్వాస్థ్యంగా ఇచ్చాడు.
Mojsije, sluga Jahvin, i sinovi Izraelovi sve su ih pobili i predao je Mojsije, sluga Jahvin, tu zemlju u posjed plemenu Rubenovu i Gadovu plemenu te polovini plemena Manašeova.
7 యొర్దానుకు అవతల, అంటే పడమరగా లెబానోను లోయలో ఉన్న బయల్గాదు నుండి శేయీరు వరకూ వ్యాపించిన హాలాకు కొండవరకూ ఉన్న దేశాల రాజులను యెహోషువ, ఇశ్రాయేలీయులు జయించారు. యెహోషువ దాన్ని ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం స్వాస్థ్యంగా ఇచ్చాడు.
A ovo su zemaljski kraljevi što su ih pobijedili Jošua i sinovi Izraelovi s ovu stranu Jordana k zapadu, od Baal Gada u libanonskoj ravnici pa do gore Halaka, koja se diže prema Seiru, a tu je zemlju Jošua dao u baštinu plemenima Izraelovim prema njihovim dijelovima,
8 కొండ ప్రాంతాల్లో, లోయలో షెఫేలా ప్రదేశంలో చరియల ప్రదేశాల్లో అరణ్యంలో దక్షిణ దేశంలో ఉన్న హిత్తీయులూ అమోరీయులూ కనానీయులూ పెరిజ్జీయులూ హివ్వీయులూ యెబూసీయులూ అనేవారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకున్నారు.
u Gorju, u Šefeli, u Arabi i po obroncima, u Pustinji te u Negebu: zemlju hetitsku, amorejsku i kanaansku, perižansku, hivijsku i jebusejsku:
9 వారెవరంటే, యెరికో రాజు, బేతేలు పక్కన ఉన్న హాయి రాజు, యెరూషలేము రాజు,
jerihonski kralj, jedan; kralj Aja kod Betela, jedan;
10 ౧౦ హెబ్రోను రాజు, యర్మూతు రాజు,
jeruzalemski kralj, jedan; hebronski kralj, jedan;
11 ౧౧ లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
jarmutski kralj, jedan; lakiški kralj, jedan;
12 ౧౨ గెజెరు రాజు, దెబీరు రాజు,
eglonski kralj, jedan; gezerski kralj, jedan;
13 ౧౩ గెదెరు రాజు, హోర్మా రాజు,
debirski kralj, jedan; gederski kralj, jedan;
14 ౧౪ అరాదు రాజు, లిబ్నా రాజు,
hormski kralj, jedan; aradski kralj, jedan;
15 ౧౫ అదుల్లాము రాజు, మక్కేదా రాజు,
kralj Libne, jedan; adulamski kralj, jedan;
16 ౧౬ బేతేలు రాజు, తప్పూయ రాజు,
makedski kralj, jedan; betelski kralj, jedan;
17 ౧౭ హెపెరు రాజు, ఆఫెకు రాజు,
kralj Tapuaha, jedan; heferski kralj, jedan;
18 ౧౮ లష్షారోను రాజు, మాదోను రాజు,
afečki kralj, jedan; šaronski kralj, jedan;
19 ౧౯ హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు,
madonski kralj, jedan; hasorski kralj, jedan;
20 ౨౦ అక్షాపు రాజు, తానాకు రాజు,
šimron-meronski kralj, jedan; ahšafski kralj, jedan;
21 ౨౧ మెగిద్దో రాజు, కెదెషు రాజు.
tanaački kralj, jedan; megidski kralj, jedan;
22 ౨౨ కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెరక ప్రాంతాల్లో ఉన్న దోరు రాజు,
kedeški kralj, jedan; kralj Jokneama na Karmelu, jedan;
23 ౨౩ గిల్గాలులో గోయీయుల రాజు, తిర్సా రాజు.
dorski kralj u pokrajini dorskoj, jedan; gojski kralj u Gilgalu, jedan;
24 ౨౪ వారంతా కలిసి ముప్ఫై ఒక్క మంది రాజులు.
tirški kralj, jedan. U svemu trideset i jedan kralj.

< యెహొషువ 12 >