< యోబు~ గ్రంథము 3 >
1 ౧ ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు.
斯て後ヨブ口を啓きて自己の日を詛へり
3 ౩ నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. “మగ పిల్లవాడు పుట్టాడు” అని చెప్పే రాత్రి సమయం లేకపోయినట్టయితే బాగుండేది. నా తల్లి గర్భాన్ని ఆ రోజు మూసి ఉంచితే బాగుండేది. ఆ రోజు నా కళ్ళకు బాధను మరుగు చేయలేకపోయింది.
我が生れし日亡びうせよ 男子胎にやどれりと言し夜も亦然あれ
4 ౪ ఆ రోజు చీకటిమయం కావాలి. దాని మీద వెలుగు ప్రకాశించకూడదు. పైన ఉన్న దేవుడు ఆ రోజును లెక్కించకూడదు.
その日は暗くなれ 神上よりこれを顧みたまはざれ 光これを照す勿れ
5 ౫ చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి.
暗闇および死蔭これを取もどせ 雲これが上をおほえ 日を暗くする者これを懼しめよ
6 ౬ కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు.
その夜は黑暗の執ふる所となれ 年の日の中に加はらざれ 月の數に入ざれ
7 ౭ ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది.
その夜は孕むこと有ざれ 歡喜の聲その中に興らざれ
8 ౮ శపించేవాళ్ళు ఆ రోజును శపించాలి. సముద్ర రాక్షసిని రెచ్చగొట్టే వాళ్ళు దాన్ని శపించాలి.
日を詛ふ者レビヤタンを激發すに巧なる者これを詛へ
9 ౯ ఆ దినాన సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలకు చీకటి కమ్మాలి. వెలుగు కోసం అది ఎదురు చూసినప్పుడు వెలుగు కనబడకూడదు.
その夜の晨星は暗かれ その夜には光明を望むも得ざらしめ 又東雲の眼蓋を見ざらしめよ
10 ౧౦ అది ఉదయ సూర్య కిరణాలు చూడకూడదు. పుట్టిన వెంటనే నేనెందుకు చనిపోలేదు?
是は我母の胎の戸を闔ずまた我目に憂を見ること無らしめざりしによる
11 ౧౧ తల్లి గర్భం నుండి బయటపడగానే నా ప్రాణం ఎందుకు పోలేదు?
何とて我は胎より死て出ざりしや 何とて胎より出し時に氣息たえざりしや
12 ౧౨ నన్నెందుకు మోకాళ్ల మీద పడుకోబెట్టుకున్నారు? నేనెందుకు తల్లి పాలు తాగాను?
如何なれば膝ありてわれを接しや 如何なれば乳房ありてわれを養ひしや
13 ౧౩ లేకపోతే ఇప్పుడు నేను పడుకుని ప్రశాంతంగా ఉండేవాణ్ణి. నేను చనిపోయి విశ్రాంతిగా ఉండేవాణ్ణి.
否らずば今は我偃て安んじかつ眠らん 然ばこの身やすらひをり
14 ౧౪ శిథిలమైపోయిన భవనాలు తిరిగి కట్టించుకునే భూరాజుల్లాగా, మంత్రుల్లాగా నేను కూడా చనిపోయి ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
かの荒墟を自己のために築きたりし世の君等臣等と偕にあり
15 ౧౫ బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.
かの黄金を有ち白銀を家に充したりし牧伯等と偕にあらん
16 ౧౬ భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు.
又人しれず墮る胎兒のごとくにして世に出ず また光を見ざる赤子のごとくならん
17 ౧౭ అక్కడ దుర్మార్గులు ఇక బాధపెట్టరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు.
彼處にては惡き者 虐遇を息め倦憊たる者安息を得
18 ౧౮ అక్కడ బంధితులైన వారు కలసి విశ్రమిస్తారు. వాళ్ళ చేత పనులు చేయించేవాళ్ళ ఆజ్ఞలు వాళ్లకు వినిపించవు.
彼處にては俘囚人みな共に安然に居りて驅使者の聲を聞ず
19 ౧౯ పేదవారు, గొప్పవారు అంతా అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల చెర నుండి తప్పించుకుని స్వతంత్రులయ్యారు.
小き者も大なる者も同じく彼處にあり僕も主の手を離る
20 ౨౦ దుర్దశలో ఉన్నవారికి వెలుగు ఎందుకు? దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఎందుకు?
如何なれば艱難にをる者に光を賜ひ 心苦しむ者に生命をたまひしや
21 ౨౧ వారు మరణం కోరుకుంటారు. దాచిపెట్టిన నిధి కోసం వాళ్ళు లోతుగా తవ్వుతున్నారు గాని అది వారికి దొరకడం లేదు.
斯る者は死を望むなれどもきたらず これをもとむるは藏れたる寳を掘るよりも甚だし
22 ౨౨ వాళ్ళు సమాధికి చేరినప్పుడు వారు ఆనందిస్తారు, ఎంతో సంబరపడతారు.
もし墳墓を尋ねて獲ば大に喜こび樂しむなり
23 ౨౩ మార్గం కనుగొనలేని వాడికి, దేవుడు చుట్టూ కంచె వేసిన వాడికి జీవం ఎందుకు?
その道かくれ神に取籠られをる人に如何なれば光明を賜ふや
24 ౨౪ భోజనం చేయడానికి బదులు నాకు నిట్టూర్పులు కలుగుతున్నాయి. నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి.
わが歎息はわが食物に代り我呻吟は水の流れそそぐに似たり
25 ౨౫ ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది.
我が戰慄き懼れし者我に臨み我が怖懼れたる者この身に及べり
26 ౨౬ నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.
我は安然ならず穩ならず安息を得ず唯艱難のみきたる