< యిర్మీయా 15 >
1 ౧ అప్పుడు యెహోవా నాకిలా చెప్పాడు. “మోషే అయినా సమూయేలైనా నా ఎదుట నిలబడినప్పటికీ ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఒప్పుకోదు. నా దగ్గర నుంచి వాళ్ళను వెళ్లగొట్టు. వాళ్ళను వెళ్లనియ్యి.”
And the Lord said to me: “Even if Moses and Samuel were to stand before me, my soul would not be toward this people. Cast them away from my face, and let them depart!
2 ౨ “మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.
And if they say to you, ‘Where shall we go?’ you shall say to them: Thus says the Lord: Those who go to death, shall go to death. And those who go to the sword, shall go to the sword, and those go to famine, shall go to famine, and those who go to captivity, shall go to captivity.
3 ౩ చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.” ఇది యెహోవా వాక్కు.
And I will visit against them in four ways, says the Lord: by the sword, to kill; and by dogs, to tear apart; and by the birds of the air and by the beasts of the earth, to devour and to scatter.
4 ౪ యూదా రాజు హిజ్కియా కొడుకు మనష్షే యెరూషలేములో చేసిన పనులను బట్టి భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికీ భీతి కలిగేలా చేస్తాను.
And I will give them over to the fervor of all the kingdoms of the earth, because of Manasseh, the son of Hezekiah, the king of Judah, because of all that he did in Jerusalem.
5 ౫ యెరూషలేమా, నిన్ను ఎవరు కనికరిస్తారు? నీ గురించి ఎవరు ఏడుస్తారు? నీ బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? ఇది యెహోవా వాక్కు.
For who will take pity on you, O Jerusalem? Or who will feel sorrow for you? Or who will go to prayer for the sake of your peace?
6 ౬ నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.
You have abandoned me, says the Lord. You have gone backwards. And so, I will extend my hand over you, and I will destroy you. I have labored to plead with you.
7 ౭ దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. వారికి వియోగం కలిగిస్తాను.
And I will scatter them with a winnowing fan at the gates of the land. I have killed and dispersed my people, and yet they have not turned back from their ways.
8 ౮ వారి వితంతువుల సంఖ్య సముద్రతీరాన ఇసుక కంటే ఎక్కువయ్యేలా చేస్తాను. నేను మధ్యాహ్నం సమయంలో యువకుల తల్లుల మీదికి నాశనం చేసేవాణ్ణి పంపిస్తాను. వారి మీదికి భయం, దిగ్భ్రాంతి ఆకస్మాత్తుగా రప్పిస్తాను.
Their widows have been multiplied by me, more so than the sand of the sea. I have led them against the mother of a youth like an attacker at midday. I have sent a terror suddenly against the cities.
9 ౯ ఏడుగురిని కనిన స్త్రీ నీరసించి ప్రాణం విడుస్తుంది. పగటి సమయం ఇంకా ఉండగానే ఆమె పొద్దు ముగుస్తుంది. ఆమె సిగ్గుతో అవమానం పాలవుతుంది. మిగిలిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
She who gave birth to seven has become weak. Her life has faded away. Her sun has set while it was still daytime. She has been confounded and shamed. And the remainder of them I will give over to the sword in the sight of their enemies, says the Lord.”
10 ౧౦ అయ్యో నాకెంతో బాధ! అమ్మా! దేశస్థులందరితో కలహాలు పెట్టుకునేవాడిగా నన్ను కన్నావు. నేనెవరికీ అప్పివ్వలేదు, అప్పు తీసుకోలేదు. అయినా వారంతా నన్ను దూషిస్తున్నారు.
“O my mother, woe to me! Why did you conceive me, a man of strife, a man of discord to all the earth? I have not lent money at interest, nor has anyone lent money at interest to me. Yet everyone is cursing me.”
11 ౧౧ అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “మంచి కోసం నేను నిన్ను తప్పించనా? తప్పకుండా విపత్తులో బాధలో నీ శత్రువులు నీ సాయాన్ని అర్థించేలా చేస్తాను.
The Lord says: “Certainly, it will be well with your remnant. Certainly, I will run to meet you, in the time of affliction and in the time of tribulation, against the enemy.
12 ౧౨ ఇనుమును, మరి ముఖ్యంగా ఉత్తర దేశం నుంచి వచ్చిన కంచు కలిసిన ఇనుమును ఎవడైనా విరగ గొట్టగలడా?
But how can iron be joined with the iron from the north or with brass?
13 ౧౩ మీ ప్రాంతాలన్నిటిలో మీరు చేసే పాపాలన్నిటికీ మీ సంపదనూ మీ విలువైన వస్తువులనూ నేను దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను.
Your riches and your treasures I will give over to be freely despoiled, because of all your sins, even throughout all your borders.
14 ౧౪ నువ్వెరుగని దేశంలో మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. నా కోపం మంటల్లాగా రగులుకుంది. అది మిమ్మల్ని దహిస్తుంది.
And I will lead in your enemies from a land that you do not know. For a fire has been kindled in my fury; it will burn upon you.”
15 ౧౫ యెహోవా, నా బాధ నీకే తెలుసు. నన్ను గుర్తు చేసుకుని సాయం చెయ్యి. నన్ను బాధించే వారి మీద నా కోసం ప్రతీకారం చెయ్యి. నువ్వు ఓర్పు వహించి నన్ను తీసుకుపోవద్దు. నీ కోసమే నేను నింద భరిస్తున్నానని గుర్తు చేసుకో.
“You know me, O Lord. Remember me, and visit me, and watch over me, because of those who persecute me. In your patience, do not choose to let me endure. You know I have suffered reproach because of you.
16 ౧౬ సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.
I discovered your words and I consumed them. And your word became to me as the gladness and joy of my heart. For your name has been invoked over me, O Lord, the God of hosts.
17 ౧౭ వేడుక చేసుకునే వాళ్ళ గుంపులో నేను కూర్చుని సంతోషించలేదు. నీ బలమైన చెయ్యి నా మీద ఉంది. కడుపుమంటతో నువ్వు నన్ను నింపావు. కాబట్టి, నేను ఒంటరిగా కూర్చున్నాను.
I did not sit in the company of mockers, nor did I glorify myself before the presence of your hand. I sat alone, because you filled me with threats.
18 ౧౮ నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?”
Why has my sorrow become never-ending, and why has my wound become so dire that it refuses to be cured? It has become for me like the deception of untrustworthy waters.”
19 ౧౯ అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు. “యిర్మీయా, నువ్వు నావైపు తిరిగితే నువ్వు నా సన్నిధిని నిలిచేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. యోగ్యమైన వాటిలో నుంచి పనికిమాలిన వాటిని నువ్వు తీసేస్తే నా నోటిలాగా నువ్వుంటావు. ప్రజలు నీవైపుకు తిరుగుతారు. అయితే నువ్వు వారి వైపుకు తిరగకూడదు.
Because of this, thus says the Lord: “If you will be converted, I will convert you. And you will stand before my face. And you will separate what is precious from what is vile. You will be my mouthpiece. They will be converted to you, but you will not be converted to them.
20 ౨౦ నేను నిన్ను ఈ ప్రజలకు అభేధ్యమైన కంచుకోటగా చేస్తాను. వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు గాని నిన్ను గెలవలేరు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉంటాను. ఇది యెహోవా వాక్కు.
And I will present you to this people as a strong wall of brass. And they will fight against you, and they will not prevail. For I am with you, so as to save you and to rescue you, says the Lord.
21 ౨౧ నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి విడిపిస్తాను. నిరంకుశుల బారినుంచి నిన్ను విమోచిస్తాను.”
And I will free you from hand of those who are most wicked, and I will redeem you from the hand of the powerful.”