< యెషయా~ గ్రంథము 22 >
1 ౧ “దర్శనం లోయ” ను గూర్చిన దైవ ప్రకటన. “మీరంతా ఇళ్ళ పైకప్పుల పైకి ఎక్కి ఉండటానికి కారణమేంటి?
THE WORD OF THE VALLEY OF SION. What has happened to you, that now you are all gone up to the housetops which help you not?
2 ౨ సందడితో నిండి పోయి కేకలు వేస్తున్న పట్టణమా! వేడుకల్లో మునిగిపోయిన నగరమా! నీలో చనిపోయిన వాళ్ళు కత్తి వల్ల హతం కాలేదు. వాళ్ళు యుద్ధంలో చనిపోలేదు.
The city is filled with shouting [men]: your slain are not slain with swords, nor are your dead those who have died in battle.
3 ౩ నీ అధిపతులంతా కలసి పారిపోయారు. కానీ విలుకాళ్ళు బాణాలు వేసి కొట్టకుండానే వాళ్ళు దొరికి పోయారు. దూరంగా పారిపోయినా శత్రువు వాళ్ళందర్నీ కలిపి పట్టుకున్నాడు.
All your princes have fled, and [your] captives are tightly bound, and the mighty [men] in you have fled far away.
4 ౪ కాబట్టి నేను చెప్పేదేమిటంటే ‘నా వంక చూడకండి. నేను తీవ్రమైన విషాదంతో ఏడుస్తాను. నా జనానికి సంభవించిన వినాశనం గూర్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి.’
Therefore I said, Let me alone, I will weep bitterly; labor not to comfort me for the breach of the daughter of my people.
5 ౫ దర్శనం లోయలో అల్లరి, తొక్కిసలాటతో నిండిన ఒక రోజు రాబోతుంది. దాన్ని సేనల ప్రభువు అయిన యెహోవా రప్పించబోతున్నాడు. ఆ రోజు ఓటమీ, కలవరమూ కలుగుతాయి. గోడలు కూలిపోతాయి. ప్రజలంతా సహాయం కోసం పర్వతాల వైపు చూస్తారు.
For [it is] a day of trouble, and of destruction, and of treading down, and [there is] perplexity [sent] from the Lord of hosts: they wander in the valley of Sion; they wander from the least to the greatest on the mountains.
6 ౬ ఏలాము రథాలతో ఉన్న యోధులతో, రౌతులతో తన అంబుల పొదిని ధరించింది. కీరు తన డాలును బయటకు తీసింది.
And the Elamites took [their] quivers, and [there were] men mounted on horses, and [there was] a gathering for battle.
7 ౭ నీకు ఇష్టమైన లోయలన్నీ రథాలతో నిండిపోతాయి. తమ గుర్రాలపై కూర్చున్న రౌతులు పట్టణ ద్వారం దగ్గర తమ స్థానాల్లో ఉన్నారు.
And it shall be [that] your choice valleys shall be filled with chariots, and horsemen shall block up your gates.
8 ౮ అప్పుడు ఆయన యూదా భద్రత కవచాన్ని తీసివేశాడు. ఆ రోజు నువ్వు ‘అడవి రాజ భవనం’ లో ఉన్న ఆయుధాల కోసం చూశావు.
And they shall uncover the gates of Juda, and they shall look in that day on the choice houses of the city.
9 ౯ దావీదు పట్టణానికి అనేక చోట్ల బీటలు పడటం నువ్వు చూశావు. అది తెలుసుకుని నువ్వు దిగువన ఉన్న కోనేరు నుండి నీళ్ళ తెచ్చుకున్నావు.
And they shall uncover the secret places of the houses of the citadel of David: and they saw that they were many, and that one [had] turned the water of the old pool into the city;
10 ౧౦ మీరు యెరూషలేములోని ఇళ్ళను లెక్కపెట్టారు. ప్రాకారాన్ని బలపరచడానికై మీరు ఇళ్ళు పడగొట్టారు.
and that they [had] pulled down the houses of Jerusalem, to fortify the wall of the city.
11 ౧౧ పాత కోనేటి నీళ్ళ కోసం రెండు గోడల మధ్య మీరు ఒక జలాశయాన్ని నిర్మించారు. కానీ పట్టణాన్ని నిర్మించిన వాణ్ణి మీరు పట్టించుకోలేదు. ఏనాడో దాని కోసం ఆలోచించిన వాణ్ణి మీరు లక్ష్యం చేయలేదు.
And you procured to yourselves water between the two walls within the ancient pool: but you looked not to him that made it from the beginning, and regarded not him that created it.
12 ౧౨ ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు.
And the Lord, the Lord of hosts, called in that day for weeping, and lamentation, and baldness, and for girding with sackcloth:
13 ౧౩ కానీ చూడండి! దానికి బదులుగా, పశువులను చంపుదాం, గొర్రెలను వధించుదాం. వాటి మాంసం తిని ద్రాక్షారసం తాగుదాం. సంతోషంతో పండగ చేసుకుందాం. ఎందుకంటే రేపు చనిపోతాం కదా” అనుకున్నారు.
but they engaged in joy and gladness, slaying calves, and killing sheep, so as to eat flesh, and drink wine; saying, Let us eat and drink; for to-morrow we die.
14 ౧౪ ఈ సంగతి సేనల ప్రభువైన యెహోవా నా చెవుల్లో తెలియజేశాడు. “మీరు చేసిన ఈ దోషానికి క్షమాపణ లేదు. మీరు చనిపోయేటప్పుడైనా సరే” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.
And these things are revealed in the ears of the Lord of hosts: for this sin shall not be forgiven you, until you die.
15 ౧౫ సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా చెప్పాడు. భవనంలో నిర్వహణా పనులు చూసే షెబ్నా దగ్గరకి వెళ్ళు. అతనికి ఇలా చెప్పు.
Thus says the Lord of hosts, Go into the chamber, to Somnas the treasurer, and say to him, Why are you here?
16 ౧౬ “ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు? ఎత్తయిన స్థలంలో సమాధిని తొలిపించుకుంటున్నావు. రాతిలో నీ కోసం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు!
and what have you to do here, that you have here hewn yourself a sepulchre, and made yourself a sepulchre on high, and have graven for yourself a dwelling in the rock?
17 ౧౭ చూడు, బలవంతుడివైన నిన్ను యెహోవా విసిరి వేయబోతున్నాడు. ఆయన నిన్ను నేలకు విసిరి కొట్టబోతున్నాడు. ఆయన నిన్ను గట్టిగా పట్టుకుంటాడు.
Behold now, the Lord of hosts casts forth and will utterly destroy [such] a man, and will take away your robe and your glorious crown,
18 ౧౮ ఆయన నిన్ను కచ్చితంగా చుట్ట చుట్టివేస్తాడు. ఒక బంతిలా నిన్ను విశాలమైన దేశంలోకి విసిరివేస్తాడు. నువ్వు అక్కడే చనిపొతావు. నీ గొప్ప రథాలు కూడా అక్కడే పడి ఉంటాయి. నీ యజమాని ఇంటికి నువ్వు ఒక అవమానంగా ఉంటావు.
and will cast you into a great and unmeasured land, and there you shall die: and he will bring your fair chariot to shame, and the house of your prince to be trodden down.
19 ౧౯ నీ ఉద్యోగం నుండి నిన్ను తొలగిస్తాను. నీ హోదాను తీసి వేస్తాను. నిన్ను కిందకు లాగేస్తాను.
And you shall be removed from your stewardship, and from your place.
20 ౨౦ ఆ రోజున నేను నా సేవకుడూ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీముని పిలుస్తాను.
And it shall come to pass in that day, that I will call my servant Eliakim the son of Chelcias:
21 ౨౧ నీ చొక్కా అతనికి తొడిగిస్తాను. నీ నడికట్టును అతనికి కడతాను. నీ అధికారాన్ని అతనికి బదలాయిస్తాను. అతడు యెరూషలేములో నివాసం ఉన్న వాళ్ళకీ, యూదా జాతి వాళ్ళకీ ఒక తండ్రిగా ఉంటాడు.
and I will put on him your robe, and I will grant him your crown with power, and I will give your stewardship into his hands: and he shall be as a father to them that dwell in Jerusalem, and to them that dwell in Juda.
22 ౨౨ నేను దావీదు ఇంటి తాళపు చెవిని, అధికారాన్ని అతని భుజంపై ఉంచుతాను. అతడు తెరచినప్పుడు ఎవ్వరూ మూయలేరు. అతడు మూసినప్పుడు ఎవ్వరూ తెరవలేరు.
And I will give him the glory of David; and he shall rule, and there shall be none to speak against him: and I will give him the key of the house of David [upon] his shoulder; and he shall open, and there shall be none to shut; and he shall shut, and there shall be none to open.
23 ౨౩ బలమైన చోట ఒక మేకును దిగగొట్టినట్టు నేను అతణ్ణి స్థిరపరుస్తాను. అతడు తన తండ్రి కుటుంబానికి ఘనమైన సింహాసనంగా ఉంటాడు.
And I will make him a ruler in a sure place, and he shall be for a glorious throne of his father's house.
24 ౨౪ చిన్న గిన్నెలనూ, పాత్రలనూ మేకుకి వేలాడదీసినట్టుగా అతని పితరుల ఇంటి గౌరవమూ, సంతానం, వారసుల గౌరవమూ అతనిపై వేలాడదీస్తారు.”
And every one that is glorious in the house of his father shall trust in him, from the least to the greatest; and they shall depend upon him in that day.
25 ౨౫ ఇది సేనల ప్రభువైన యెహోవా మాట. “ఆ రోజున బలమైన చోట కొట్టిన మేకు సడలి ఊడిపోతుంది. కింద పడిపోతుంది. దానిపై ఆధారపడిన బరువంతా తెగి కింద పడుతుంది.” ఇది యెహోవా మాట.
Thus says the Lord of hosts, The man that is fastened in the sure place shall be removed and be taken away, and shall fall; and the glory that is upon him shall be utterly destroyed: for the Lord has spoken it.